ఈ నెల 18న హైదరాబాద్‌లో మహాధర్నా
పంజాబ్‌కో న్యాయం-తెలంగాణకో న్యాయమా!
ధాన్యం కొనుగోలుపై స్పష్టతనివ్వాలి
కేంద్రం తీరుపై తెలంగాణ ముఖ్యమంత్రి ఫైర్
హైదరాబాద్, నవంబర్ 16: ఇచ్చిన మాట తప్పారంటూ కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. తెలంగాణలో వరి కొనకుండా పంజాబ్‌లో మొత్తం ఎలా కొంటారని నిలదీశారు. కేంద్రం రాష్ట్రానికో పద్ధతి అవలంబిస్తోంది. కేంద్రం కొననని చెప్పింది కాబట్టే రాష్ట్రంలో వరి సాగు చేయొద్దని రైతులను కోరామన్నారు. కేంద్ర వైఖరికి నిరసనగా హైదరాబాద్‌లో మహాధర్నా చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఇందిరా పార్క్ వద్ద జరిగే ఈ ధర్నాతో కేంద్రానికి స్పష్టమైన హెచ్చరిక పంపదలచుకున్నామన్నారు. ఈ ధర్నాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు పాల్గొంటారన్నారు. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌కు వినతి పత్రం సమర్పిస్తామని తెలియచేశారు. Latest news kcr కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ డ్రామాలు ఆడుతోందన్నారు. ధర్నా చేస్తున్న రైతులపై రాళ్ళతో దాడి చేశారని ఆరోపించారు.
వర్షాకాలంలో పండించే ధాన్యం కొంటారా కొనరా స్పష్టంచేయాలని కోరారు. పంజాబ్‌లో మొత్తం ధాన్యం కొంటున్న కేంద్రం తెలంగాణలో ఎందుకు కొనదో చెప్పాలని నిలదీశారు. కేంద్ర వ్యవసాయ మంత్రికి ఫోన్‌చేసి అడిగితే స్పందన లేదని తెలిపారు. ప్రధానికీ, ఆయనకు రేపు లేఖ రాస్తానని కేసీఆర్ తెలిపారు. ధాన్యం కొనుగోలుపై ఇప్పటికైనా స్పష్టతనివ్వాలని అందులో కోరనున్నట్లు చెప్పారు.
ఇష్టమొచ్చిన మాట్లాడుతున్న బీజేపీకి శిక్ష తప్పదని చెప్పారు. ధాన్యం కొనమని కేంద్రం చెప్పిందా లేదా అన్న అంశాన్ని రాష్ట్ర బీజేపీ తేల్చి చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 5లక్షల టన్నుల ధాన్యం కొంటారా లేదా తేల్చండని కేసీఆర్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై కేసీఆర్ మాటలతో దాడి చేశారు. Kcr warning to centre 18 తరవాత రెండు రోజులు గడువిస్తామని అప్పటికీ దిగిరాకపోతే కేంద్రాన్ని పార్లమెంటులో నిలదీస్తామనీ హెచ్చరించారు.