నటుడు విజయ్ ర్యాలీలో తొక్కిసలాట
కరూర్, సెప్టెంబర్ 27 : తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. సినీ నటుడు విజయ్ కరూర్ లో ఏర్పాటు చేసిన ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకూ 39 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ రాలికి విజయ్ ఆరుగంటలు ఆలస్యంగా వచ్చారు. కరూరులో ఆయన పదివేలమందితో టి.వి.కె. కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆయన వచ్చి వ్యాన్ ఎక్కినప్పుడు ఆయన ఒక వ్యక్తి స్పృహ తప్పిపడిపోవడం గమనించారు. అతనికి మంచినీళ్లు ఇవ్వండి అంటూ ఒక బాటిల్ విసిరారు. అతడిని ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్సు కూడా ఏర్పాటు చేసారు. పదివేలమంది తీసుకున్న ఈ రాలీకి రెండులక్షలమందికి పైగా హాజరయ్యారు. ఇది తొక్కిసలాటకు దారితీసింది. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. రేపు ఆయన క్షతగాత్రులు చికిత్స పొందుతున్న కరూర్ ఆస్పత్రిని సందర్శించనున్నారు.

