ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీ– 20 లోగో ఆవిష్కరించిన జగన్
అమరావతి, జూన్ 6: లోగోతో పాటు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ టీ – 20 టీజర్‌ను ఏపీ సీఎం వైయస్ జగన్ సోమవారం ఆవిష్కరించారు. లోగోను కూడా రిలీజ్ చేశారు. జులై 6 నుంచి జులై 17 వరకు విశాఖపట్నం డాక్టర్ వైయస్‌ఆర్ ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో టోర్నమెంట్ జరుగుతుంది.
జులై 17న జరిగే ఫైనల్‌కు సీఎంను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ టీమ్ ఆహ్వానించింది. ఐపీఎల్ తరహాలో మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. బీసీసీఐ నుంచి ఏపీఎల్ నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనుమతి పొందింది.
ఇప్పటికే తమిళనాడు, కర్నాటక, సౌరాష్ట్రకు బీసీసీఐ అనుమతిచ్చింది. ఈ కార్యక్రమంలో ఏసీఏ ప్రెసిడెంట్ పి.శరత్ చంద్రారెడ్డి, ట్రెజరర్ ఎస్.ఆర్.గోపినాద్ రెడ్డి, సీఈవో ఎం.వి.శివారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ టి.సత్యప్రసాద్, సభ్యులు ప్రసాద్, గోపాల రాజు, టెక్నికల్ ఇంచార్జి విష్ణు దంతు, వీరితో పాటు హాజరైన ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.