మ‌ధ్య త‌ర‌గ‌తికి అందుబాటులో స్థలాలు

Date:

జ‌గ‌న‌న్న స్మార్ట్ సిటీల‌కు శ్రీ‌కారం
వెబ్‌సైట్‌ను ప్రారంభించిన సీఎం జ‌గ‌న్‌
మూడు విడ‌త‌ల్లో చెల్లింపులు
18 ల‌క్ష‌ల వార్షికాదాయం ఉన్న వారికి కేటాయింపు
అమరావతి, జ‌న‌వ‌రి 11:
మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబాల‌కు అందుబాటు ధ‌ర‌ల్లో స్థ‌లాల‌ను కేటాయించ‌డానికి ఆంధ్ర ప్ర‌దేశ్‌లోని వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం న‌డుం బిగించింది. సొంతింటి క‌ల‌ను నిజం చేయాల‌నే సంక‌ల్పానికి శ్రీ‌కారం చుట్టింది. ఇందులో భాగంగా జ‌గ‌న‌న్న స్మార్ట్ టౌన్‌షిప్స్ వెబ్‌సైట్‌ను సీఎం జ‌గ‌న్ మంగ‌ళ‌వారం ప్రారంభించారు. కుల‌, మ‌త‌, ప్రాంతాల‌కు అతీతంగా మ‌ధ్య ఆదాయ వ‌ర్గాల వారికి లిటిగేష‌న్ల‌కు తావు లేని స్థ‌లాల‌ను కేటాయించడానికి రాష్ట్ర ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తోంది. మ‌ధ్య త‌ర‌గ‌తి వారికి అనువైన ధ‌ర‌ల‌ను కూడా నిర్ణ‌యించింది. రాష్ట్రంలో ప్రతి పేదవాడికీ సొంత ఇల్లు ఉండాల‌నే ల‌క్ష్యంతో 31 లక్షల ఇళ్ల పట్టాలను ఇప్ప‌టికే పేదలకు పంపిణీ చేశామ‌ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చెప్పారు. తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభ‌మ‌య్యాయన్నారు.


అందుబాటు ధరలకే స్థ‌లాలు..
ఇలాంటి పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబాలకు(మిడిల్‌ ఇన్‌కం గ్రూపు) కూడా సొంత ఇళ్లు ఉండాలనే కలను సాకారం చేసేందుకు వారిని మార్కెట్‌లో రియల్‌ఎస్టేట్‌ వాళ్లు మోసాలు చేయకుండా, మంచి టైటిల్స్‌తో స్ధలాలు ఇవ్వడం, లాభాపేక్ష లేకుండా మార్కెట్‌ ధర కంటే తక్కువ ధరకే, సరసమైన ధరలకే, లిటిగేషన్స్‌కు ఎలాంటి తావులేకుండా క్లియర్‌ టైటిల్స్‌తో ఇవ్వాలని నిర్ణయించామ‌న్నారు. ప్రభుత్వమే ఇంటి ప్లాట్లు అభివృద్ధి చేసి, లేఅవుట్‌ చేసి అందుబాటులోకి తీసుకుని వచ్చే ఒక మంచి ప్రయత్నం వల్ల మధ్యతరగతి కుటుంబాలుకు మేలు జరుగుతుందనే సదుద్ధేశ్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామ‌ని వెల్ల‌డించారు. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేని, వివాదాలకు తావేలేని క్లియర్‌ టైటిల్స్‌తో పాటు అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాటును అందించే ప్రయత్నం చేస్తున్నామ‌ని తెలిపారు. సంక్రాంతి పండగ వేళలో దీనికి శ్రీకారం చుడుతున్నామ‌ని చెప్పారు.


మూడు కేటగిరీలుగా స్ధలాలు
ఈ పథకంలో మూడు కేటగిరీలలో స్ధలాలు పంపిణీ చేస్తామ‌ని సీఎం చెప్పారు. ఎంఐజీ –1 కింద 150 గజాలు, ఎంఐజీ –2 కింద 200 గజాలు, ఎంఐజీ –3 కింద 240 గజాలు ప్రతి లేఅవుట్‌లో అందుబాటులోకి తెస్తామ‌న్నారు. మొదటి దశలో అనంతపురంజిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు, వైయస్సార్‌ జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోనూ లేఅవుట్‌లకు శ్రీకారం చుడుతున్నాం.


ఈ నెల 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు
ఈ స్థలాల‌కు సంబంధించి జ‌న‌వ‌రి 11 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామ‌ని జ‌గ‌న్ చెప్పారు. ఈ 6 జిల్లాలే కాకుండా మిగిలిన అన్ని జిల్లాలతో పాటు ప్రతి నియోజవర్గంలో ఈ పథకం రాబోయే రోజుల్లో విస్తరిస్తామ‌ని వివ‌రించారు. https://migapdtcp.ap.gov.in అనే వెబ్‌సైట్ లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చని సీఎం తెలిపారు. ఏడాదికి 18 లక్షల వరకు ఆదాయం ఉన్నవాళ్లంతా జగనన్న స్మార్ట్‌ టౌన్స్‌లో ప్లాట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఉన్న ప్రాంతంలోనే స్మార్ట్‌ టౌన్స్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్లాట్లకు అయ్యే డబ్బులు కూడా నాలుగు వాయిదాల్లో ఒక సంవత్సర కాలంలో చెల్లించే వెసులుబాటును కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది.


చెల్లింపులు ఇలా..
ఇలా స్మార్ట్‌ టౌన్స్‌లో ఇంటి స్ధలం కోసం దరఖాస్తు చేసుకునేవారు ఆ ప్లాటు నిర్ణీత విలువలో 10 శాతం ముందుగా చెల్లించాలి. అగ్రిమెంటు చేసుకున్న నెలలోపు 30 శాతం, 6 నెలల్లోపు మరో 30 శాతం, 12 నెలలు లేదా రిజిస్ట్రేషన్‌ తేదీ లేదా రెండింటిలో ఏది ముందు అయితే ఆ తేదీలోపు అప్పటికి ఇంకా మిగిలిపోయిన 30 శాతం అమౌంట్‌ చెల్లిస్తే… రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేసి వాళ్లకు ప్లాటు అప్పగిస్తారు. ఇలా వాయిదాల్లో కాకుండా ఒకేసారి మొత్తం అమౌంట్‌ ఇచ్చే వాళ్లకు 5 శాతం రాయితీ కూడా ఇస్తారు.


ప్రభుత్వ ఉద్యోగులకు ప్ర‌త్యేక రాయితీ..
మొన్న పీఆర్సీ ప్రకటన సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి లేఅవుట్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు 10శాతం ప్లాట్లు 20 శాతం రిబేటుతో ప్రత్యేకంగా కేటాయించారు.


ఈ కార్యక్రమంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ సమీర్‌ శర్మ, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి ఎం వీ రామమనోహరరావు, ఎంఐజీ లేఅవుట్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ బసంత్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రిపోర్టర్ సలహా పాటించిన లోక్ సభ స్పీకర్

జిల్లాలో పూర్తైన కీలకమైన వంతెనవేదికపైకి పిలిచి చెప్పిన బాలయోగిఈనాడు - నేను:...

హాసం రాజా అమీన్ సయానీ

ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణహైదరాబాద్, జనవరి 21 : ప్రముఖ పాత్రికేయులు, మ్యూజికాలజిస్ట్,...

ఒ.ఎన్.జి.సి. వెల్ రిగ్గింగ్ ఎలా చేస్తుందంటే…

ఒక మాజీ ఉద్యోగి కథనంపాశర్లపూడి వెల్ తవ్వింది మేడ్ ఇన్ ఇండియా...

నిజాయితీకి ఆహార్యం ఆ రిపోర్టర్

ఆయన పేరే బొబ్బిలి రాధాకృష్ణనేను - ఈనాడు: 31(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి) సంస్థకు...
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://eastofanfield.com/https://nyonyabesar.com/https://direktoriwisata.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://richmondhardware.com/https://technostrix.com/https://troostcoffeeandtea.com/https://malindoak.co.id/