ఇది ఒక కాలనీ విజయం

Date:

డ్రైనేజీ పారే పార్కు ఇప్పుడెలా ఉందంటే…
(కూచిమంచి వి.ఎస్. సుబ్రహ్మణ్యం)
సమస్య ఎదురైనప్పుడే సంయమనంతో కూడిన ప్రణాళిక కావాలి. దానికి సహకారమూ తోడు కావాలి. సహకారం అంటే కేవలం మందీమార్బలం కాదు… ఆర్ధిక పరిపుష్టి కూడా అవసరం. ఇవన్నీ ఒకచోట చేరితే ఫలితం ఎలా ఉంటుందో చెప్పేదే ఈ కథనం.


నాడు మురుగునీరు
2020 సంవత్సరం నుంచి రూపుదిద్దుకున్న కాలనీ ఇది. అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని హెచ్.ఎం.టి. స్వర్ణపురి కాలనీకి, ఆర్టీసీ స్వర్ణపురి కాలనీకి నడుమ 20 ఎకరాల విస్తీర్ణంలో వెలిసిన ఈ కాలనీ పేరు శిల్ప విలేజ్. దాదాపు ముపై ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ ప్రాంతం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. ప్లాట్ యజమానులు సంఘంగా ఏర్పడి తమతమ ప్లాటులను డెవలప్మెంట్ కు ఇవ్వడంతో బహుళ అంతస్తుల భవనాలు వెలిశాయి. 2021 ఆగస్టు నుంచి కాలనీలో ఫ్లాట్లు కొనుగోలు చేసి దాదాపు వెయ్యి కుటుంబాలు స్థిరపడ్డాయి. అప్పటి పరిస్థితికి, ఇప్పటి పరిస్థితికి ఎంతో వ్యత్యాసం ఉంది. 2022 ఫిబ్రవరి నుంచి డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో ఎక్కడ చూసినా డ్రైనేజీ నీరు పొంగిపొర్లేది.

అక్కడి పార్కులో ఉన్న సెవెరజ్ ట్యాంక్ నిండిపోయి పార్కు ప్రాంతం మురుగునీటి చెరువులా మారిపోయింది. దుర్గంధం భరింపరాని స్థాయిలో ఉండేది. దోమలు పెరగడం సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. డ్రైనేజీ నీరు బోర్లలోకి సైతం ప్రవేశించి, దుర్భరంగా ఉండేది. ఆ సమయంలో కొందరు సీనియర్ సిటిజన్లు ఈ పరిస్థితిని మార్చడానికి తమవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనికి యువకులు చేయూత ఇవ్వడంతో శాంతియుత ఉద్యమం ఊపందుకుంది. మొదట బిల్డర్లను ఆశ్రయించాం. తరవాత అప్పటి మునిసిపల్ కమిషనర్ శ్రీమతి సుజాత శరణుజొచ్చాము. ఆమె చొరవతో బిల్డర్లలోనూ కదలిక మొదలైంది. రెండువిడతలుగా నిర్వహించిన సమావేశాలలో బిల్డర్లు, కాలనీవాసులు, మున్సిపాలిటీ మధ్య లిఖిత పూర్వక అవగాహన కుదిరింది.

https://youtu.be/mdZj7NGUujw
ఎంత కాలమైనా కదలిక లేకపోవడంతో… అప్పటి టి.ఆర్.ఎస్. ప్రభుత్వం ఇండిపెండెన్స్ డే వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఇచ్చిన పిలుపును అందిపుచ్చుకుని 2022 ఆగస్టు ఏడో తేదీ నుంచి ఇరవై రెండో తేదీ వరకూ జాతీయ జెండాను భుజాన ఎత్తుకుని,
రోడ్లపై పారుతున్న మురుగునీటిలో జాతీయ గీతాలాపన చేసాము. మా శాంతియుత ఆందోళన కార్యక్రమాలను ట్విట్టర్ ద్వారా సి.ఎం.ఓ., సంగారెడ్డి కలెక్టర్, మున్సిపాలిటీలను టాగ్ చేస్తూ పోస్ట్ చేసాం. ఎట్టకేలకు మా ఆందోళన కార్యక్రమాలు ఫలితాన్నిచ్చాయి. డ్రైనేజీ బయటకు వెళ్లే విధంగా యు.జి.డి.ని నిర్మించారు. ఈ క్రతువులో మునిసిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి చొరవతో ఆర్టీసీ, హెచ్.ఎం.టి. కాలనీవాసులు కూడా సహకరించడంతో కార్యక్రమం పూర్తయ్యింది. దీనితో మా కాలనీ మురుగునీటి ముప్పును తప్పించుకుంది. సమైక్యంగా చేపట్టిన శాంతియుత ఆందోళనే ఇందుకు కారణం.

https://youtu.be/R7wTiJ0IFBM
ఇప్పటి పరిస్థితి…
అనంతరం కాలనీవాసులంతా కలిసి తాత్కాలిక రోడ్లను వేసుకున్నాం. యువత స్వచ్ఛందంగా సహకరించడంతో పార్కు అభివృద్ధికి నడుం బిగించాము. ఫ్లాట్ కు ఇంత అని నిర్ణయించుకుని చందాలు వేసుకుని దాదాపు రెండు లక్షల రూపాయలు వసూలు చేసుకుని పార్కును శుభ్రపరిచాం. ఓం సిరి ప్రాజెక్ట్స్ కు చెందిన బిల్డర్ కొంతమేర మట్టిని పార్కులో నింపి సహకరించారు. మరికొంత మేము కూడా తెప్పించుకుని జె.సి.బి.లు ఏర్పాటు చేసుకుని ఒక రూపునకు తెచ్చాము. మా కృషిని గమనించిన చైర్మన్ పాండురంగారెడ్డి పార్కుకు 25 లక్షల రూపాయలను కేటాయించి సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు తొలి విడతగా హై మ్యాచ్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం ఆయన లైటింగును ప్రారంభించబోతున్నారు.


మంచినీటి లైన్ల కోసం
మంచినీటి సరఫరాకు వీలుగా గొట్టాలు వేయాల్సిందిగా మేము చేసిన వినతిని హెచ్.ఎం.డబ్ల్యు,ఎస్.ఎస్.బి. ఉన్నతాధికారులు మన్నించారు. ఫీల్డ్ విజిట్ చేశారు. అప్రూవల్ వచ్చిన వెంటనే పైపు లైన్లు వేసే కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆశిస్తున్నాము. కొంతమేర ఇంకా ఇంటర్నల్ డ్రైనేజీ వేయాల్సి ఉంది. అది కూడా త్వరలో పూర్తిచేస్తామని అధికారులు చెప్పారు. కాలనీలో రెండో పార్కు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాము.


కాలనీ అభివృద్ధి కోసం ఇంచుమించుగా రెండేళ్ల పాటు చేసిన పోరాటం కొంతమేర ఫలించింది. ఇందుకు సహకరించిన చైర్మన్ పాండురంగారెడ్డి గారికి, ప్రస్తుత కలెక్టర్ గారికీ, డెప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ గారికి, అప్పటి కమిషనర్ సుజాత గారికి, మునిసిపల్ అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కాలనీలో పూర్తిస్థాయి సౌకర్యాల ఏర్పాటుకు వారికి విన్నవించుకుంటున్నాం. సమస్యల పరిష్కారంలో కాలనీ యువత చూపిన తెగువ మరువలేనిది. ఉద్యోగాలకు సైతం సెలవు పెట్టి వారు వెన్నుదన్నుగా నిలిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అధికారం పోయిందనే అక్కసులో కె.సి.ఆర్.: రేవంత్

చిల్లరగాళ్లను ఉసిగొల్పుతున్న మాజీ సీఎంకాలకేయ ముఠాలా తెలంగాణాపైకి చిల్లరగాళ్ళురాజీవ్ విగ్రహావిష్కరణలో రేవంత్...

Anti- defection laws need a review

(Dr Pentapati Pullarao) There is much news when MLAs or...

Onam the festival of Colors and Flowers

(Shankar Raj) Kerala in many ways is a strange state....

మీది ఉద్యోగం కాదు… భావోద్వేగం

ఎస్.ఐ.ల పాసింగ్ అవుట్ పెరేడ్లో సీఎం రేవంత్కాస్మటిక్ పోలీసింగ్ కాదు... కాంక్రీట్...