దటీజ్‌ ఈనాడు.. అవసరమైనప్పుడు సర్వ శక్తులూ ఒడ్డి…

Date:

ఆదుకున్న పచ్చళ్ళు…
నేను – ఈనాడు: 11
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)

ఇకపనిలో నిమగ్నమయ్యాను… May 9, 1990న పెద్ద తుపాను. ఆఫీసుకు వెళ్ళేటప్పటికి ఫెళ్ళున ఎండకాస్తోంది. సాయంత్రానికి పరిస్థితి మారిపోయింది. భీకరమైన గాలులతో మచిలీపట్నం దగ్గర తుపాను తీరం తాకింది. రాత్రంతా ఆఫీసులోనే… టైముకి కడుపుకి ఇంత కమ్మగా తినడం అలవాటైపోయింది. అప్పటివరకూ నాకు తుపాను తీవ్ర త తెలీదు.. గుండెలపై పడుతున్నట్లుగా పిడుగులు.. మెరుపులు భీతావహమైన వాతావరణం.. రాత్రి పదకొండు గంటలైంది… ఆఫీసులో మహిళా సబ్‌ ఎడిటర్లను కార్లో అతి కష్టంమీద వారిళ్ళకు చేర్చారు. మేనేజర్‌ వెంగళనీడు గారు అంతవానలో ఎలా వచ్చారో తెలీదు ఆఫీసుకు.. వస్తూనే.. క్యాంటిన్లో అన్నం వండించారు.. కూరల్లేవు.. ఎలా తినాలి… స్టోర్‌ రూమ్‌ తెరిపించారు. ప్రియా ఊరగాయలు రకరకాలు తెప్పించారు. ప్లేట్లు లేవు… న్యూస్‌ ప్రింట్‌ నాలుగైదు కాగితాలను బొత్తుగా కూర్చుకుని అందులోనే వేడన్నంలో టమోటా, ఆవకాయ, నిమ్మకాయ, వెల్లుల్లి ఆవకాయ, గోంగూర, చింతకాయ.. ఇలా ఎవరికి ఇష్టమైంది వారు వేసుకుని సంతృప్తిగా భోజనం చేశాం. అన్నదాతా సుఖీభవ అని అలాంటి సమయంలో ఎవరైనా అనగలరు. నిజంగా నాడు ఆ సమయంలో తిన్న ఆ ఆహారం అమృతంలా తోచింది. దటీజ్‌ ఈనాడు.. అవసరానికి ఉద్యోగులకు ఏం చేయాలో అది చేస్తుంది.

గాలి ధాటికి అద్దాలు పగిలి…
కడుపు నిండిందిగా ఇక మనసు ఇంటిపైకి పోయింది. వాళ్ళెలా ఉన్నారో… ఇంట్లో కొబ్బరి చెట్లూ, వేపచెట్టు, జామచెట్టు.. బోలెడన్ని పూలమొక్కలు… ఏం ఆలోచించినా చేయగలిగేదేం లేదు.. అప్పట్లో ఇంట్లో ఫోను కూడా లేదు. ఉన్నా.. పనిచేయాలి కదా.. గాలికి కరెంటు సరఫరా నిలిచిపోయింది… ఫోన్లు కట్‌ అయిపోయాయి. తగ్గి ఇంటికెడితే తప్ప ఏ సమాచారమూ తెలీదు..
అందరూ తలో మూలా నడ్డి వాలుస్తున్నారు. నేను కూడా ఓ పాత పేపరు తీసుకుని పరుచుకుని పడుకున్నాను.. ఇంతలో గాలి ఈలలు వేయడం వినిపించింది. వెంటిలేటర్లలో ఉన్న అద్దాలనుంచి చిరుతుంపరలు లోపల పడుతున్నాయి. ఈ లోగా ఓ అద్ద పగిలి.. నాకు సమీపంలో పడింది. చుట్టూ అద్దాలే. పైనా.. పక్కనా… ఈ బీభత్సంతో పడుకోడానికి కూడా లేకపోయింది. ఓపక్క భవనం కింద భాగంలో ప్రింటింగ్‌ పని పూర్తయిపోయింది. అంత వానలోనూ టాక్సీలు బయలుదేరాయి పేపరు కట్టలతో.. ప్రకృతితో సంబంధంలేదు.. ఈనాడు తలచుకుంటే.. ప్రతిపనీ జరగాల్సిందే..అలా ఉంటుంది… ప్రణాళిక. ఈలోగా మాకూ కరెంటు పోయింది. చిమ్మ చీకట్లో చలికి గజగజలాడుతున్నాం. బతికిబయటపడతామా అన్న భావన కూడా ఒకానొకదశలో బయలురేరింది. ఉన్నామా.. తెల్లారడం చూస్తాం.. లేమా… మనల్ని మరొకరు చూస్తారనుకున్నాను. తెల్లవారుఝామున ఐదుగంటల ప్రాంతంలో వాన.. ఈదురుగాలులూ మెల్లగా తగ్గడం మొదలయ్యంది. ఆరున్నరవుతుండగా బయటకొచ్చి చూశాం. పట్టణం నడవడానికే వీలుగా లేదు. తెగిపడిన కరెంటు తీగలు, నేలకూలిన స్థంభాలు, చెట్లు.. హోర్డింగ్స్‌… నేను శర్మగారు, చిరువోలు పార్థసారధి, శ్రీనివాసులు, జానకిరామయ్య… కలిసి.. బయలుదేరాం. చేయి చేయి పట్టుకుని జాగ్రత్త అడుగులో అడుగేసుకుంటూ ఓ గంటకి ఇళ్ళకు చేరాం.

మా వీధి చివరకు చేరేసరికి మా మావగారు.. గుమ్మంలో నిలుచుని చూస్తున్నారు.. మామూలు రోజుల్లో కూడా రాత్రి తొమ్మిది దాటితే రోడ్డుమీద తిరుగుతుండే వారు.. నేనొచ్చే దాకా.. ఇంట్లో ఎవరు రాకపోయినా ఆయన అలాగే చేసేవారు. ఇంట్లోకి వెళ్ళడమే కష్టమైంది. హనుమంతుడు ధ్వసంచేసిన అశోకవనంలా అయిపోయింది ఇంటి ఆవరణ. ప్రహారీ ఒక పక్క పడిపోయింది.

జడి వానలో బయలుదేరిన రిపోర్టింగ్ బృందం…
బీభత్సమైన గాలి వానలో మోటూరి వెంకటేశ్వర్రావు గారి నాయకత్వంలో నవీన్ గారు, సురేష్ గారు, తదితరులు తుపానుకు ఎదురెళ్ళారు. ఇక్కడ మోటూరి గారి ముందుచూపు గురించి చెప్పుకోవాలి. వెళ్లేవారికి అవసరమైన మంచి నీరు, బిస్కట్ ప్యాకెట్లు తీసుకెళ్లారు. కొద్దీ దూరం వెళ్లేసరికి ఇక ముందుకు సాగలేని స్థితి. అక్కడ నుంచి వెనక్కి మళ్లారు. తీసిన ఫొటోలతో ఆఫీసుకి వచ్చారు. వస్తూనే, రిపోర్ట్ ఇచ్చారు. జనరల్ డెస్క్ వారు చక్కగా దానిని తీర్చిదిద్ది ప్రచురించారు.

ఏం యంత్రాంగం….

మళ్ళీ సమయానికి ఆఫీసుకు వెళ్ళిపోయాను. అక్కడ అసలు తుపాను జాడే కనిపించలేదు. మొత్తం శుభ్రం చేసేశారు. సమయానికి కొన్ని టీపీ సెంటర్లు పనిచేయడం ప్రారంభించాయి. ఫోన్లూ బాగయ్యాయి. టీపీ సెంటర్‌ లేని చోటనుంచి ఫోన్లు.. ఎవరికి ఎక్కడ అందుబాటులోఉంటే అక్కడినుంచి ఫోను చేయడం వార్తలు చెప్పేయడం. వాటిని డెస్కులో ఉన్నవాళ్ళు చకచకా రాసేసుకుంటూ.. ఇన్ఛార్జికి ఇచ్చేయడం. తూర్పుగోదావరి జిల్లా నుంచి కొందరు కంట్రిబ్యూటర్లు రాజమండ్రికి వచ్చి, ఫొటోలు,వార్తలు ఇచ్చేవారు.. వార్తలు ఫోనులో వచ్చేవి. ఫొటోలెలా…
రాజమండ్రి నుంచి ఒక కంట్రిబ్యూటర్‌ స్కూటర్‌ మీద కొవ్వూరుకు.. అక్కడినుంచి ఏలూరుకు.. అక్కడి నుంచి విజయవాడకు చేరేవారు… ఎంత నిబద్ధత ఉంటే ఉద్యోగి ఇలా పనిచేయగలుగుతారు..
అలా వచ్చిన ఫొటోలతోనే ఎడిషన్‌ ఇచ్చే వాళ్ళం. ఏ పేజీలో చూసినా ఇవే వార్తలు. ఫొటోలు.. ఇది ఒక సమష్టి కృషికి అత్యద్భుతమైన సజీవ ఉదాహరణ. ఈనాడులో పనిచేసిన వారికి ఈ విషయం తెలుస్తుంది. అందులో మజా అనుభవంలోకి వస్తుంది. ఈనాడు తిట్టేవారూ ఉన్నారు. కానీ పని విషయం వచ్చేసరికి అందరూ ఒకటే.. ఏకతాటిపై అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఈనాడు.. ఇక్కడో విషయం ప్రస్తావించాలి. అంత బీభత్సంలో రెల్లు పొదలా విలవిలలాడిన నగరంలో భూమికి సుమారు 150అడుగుల ఎత్తులో కట్టిన గెస్ట్‌ హౌస్‌పై నిర్మించిన ఎర్రటి రంగులో ఉన్న ఈ….నా…డు… అనే మూడక్షరాలు వార్తా జగతిని కళ్ళకు కట్టాయి. అవెంత చెక్కుచెదరకుండా ఉన్నాయంటే.. రామోజీరావు గారి దృఢ సంకల్పం.. ఆయన యంత్రాంగం కఠోర దీక్షే కారణం. దీని తరవాత ఎన్నో సంఘటనలు ఉన్నప్పటికీ, లోక్ సభ ఎన్నికలు కీలకమైనవి. ఆ సందర్భంగా జరిగిన అంశాలు రేపటి ఎపిసోడ్ లో వివరిస్తాను.

పెళ్లి చూపుల నుంచి పెళ్లి వరకూ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆరోజు డి.ఎన్. ప్రసాద్ ఏం చేశారంటే…?

ఎవరూ లేకున్నా ప్రత్యేక సంచికదీని వెనుక డి.ఎన్. ప్రసాద్ కృషిబాలయోగి మరణించి...

A Premier Rural Development Institute of India

National Institute of Rural Development and Panchayati Raj (NIRD&PR)...

Science for the common man

(Dr. N. Khaleel) Four years ago, Corona shook the world....

Watch CHAVA in a Theatre

(Dr Kamalakar Karamcheti) The Hero is captured by the villain...