ట్రోల్స్ ఆపాలని డిమాండ్
హైదరాబాద్, ఆగష్టు 24 : మహిళా జర్నలిస్టులపై దాడులను పలువురు జర్నలిస్టులు ఖండించారు.దీనికి కారణం ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో మహిళా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న మూక దాడులు. ముఖ్యంగా రాజకీయ వార్తాంశాలను కవర్ చేసే మహిళా జర్నలిస్టులపైన ఆయా పార్టీల అభిమానులు, కార్యకర్తలు టార్గెట్ చేసి ఆన్ లైన్, ఆఫ్ లైన్ దాడులు చేస్తుండడం. ముఖ్యమంత్రి స్వగ్రామం కొండారెడ్డి పల్లెలో ఇద్దరు మహిళా జర్నలిస్టులు రుణ మాఫీ అంశంపై వివరాల సేకరణకు వెళ్ళినప్పుడు స్థానికంగా ఉన్న అధికార పార్టీ మద్దతుదారులు వారిని భయభ్రాంతులకు గురి చేశారు. ఈ సంఘటన వెల్లడైన అనంతరం ఆ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. ఇది దారుణం. దీనికి సంబంధించి కొన్ని సంఘటనలను వారు ఉదహరించారు.
నిత్య పోరాటం చేస్తున్న మహిళా జర్నలిస్టులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఆన్ లైన్ ట్రోల్స్, ఆఫ్ లైన్ దాడులు అనేవి మహిళా జర్నలిస్టులకు చాలా పెద్ద సమస్యగా మారాయి.
ప్రభుత్వానికి మా డిమాండ్లు
- మహిళా జర్నలిస్టుల సమస్యలపై స్పందించే క్విక్ సపోర్ట్ సిస్టమ్ క్రియేట్ చెయ్యండి.
- మహిళా జర్నలిస్టుల్ని రాజకీయ పార్టీలు, మద్దతుదారులు నడిపే పేజీల నుంచి ఫేక్ అకౌంట్స్ నుంచి వచ్చే ట్రోల్స్ కి ఆ రాజకీయ పార్టీలనే బాధ్యుల్ని చెయ్యాలి. ఈ మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని రాజకీయ పార్టీలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చెయ్యాలి.ప్రభుత్వానికి పంపిన వినతి పత్రంపై 42 మంది మహిళా జర్నలిస్టులు సంతకాలు చేశారు.