బ్రిటన్ భారత్‌ని దొడ్డిదారిలో వచ్చి 200 ఏళ్ళు పాలించింది. వారి చెర నుంచి బయటపడడానికి ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడో ఓ భారతీయ మూలాలున్న వ్యక్తికి బ్రిటన్ ప్రధాని పీఠం దక్కబోతోంది. దక్కే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఎనిమిదిమంది మంత్రుల రాజీనామాతో సంక్షోభంలో చిక్కుకున్న ప్రధాని బోరిస్ జాన్సన్ స్థానంలో ఎవరు ప్రధానిగా ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఆ అవకాశమున్న వారిలో రిషి సునాక్ తొలి వరుసలో నిలుస్తున్నారు. మిగిలిన అభ్యర్థులు ఎవరనేది మనకు అనవసరం. భారతీయ మూలాలున్న వారుండడం మనకి చాలా ఆనందకరం కదా. ఇంతకీ ఈ రిషి సునాక్ ఎవరన్నదే కదా ప్రశ్న.
భారతీయ ఐటీ రంగ ఉన్నతిలో కీలకపాత్ర పోషించిన వారిలో ఒకరైన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడే రిషి సునాక్. సౌంథాంప్టన్‌లో పుట్టి పెరిగారు. అక్కడే చదువుకున్నారు. వయసు 42. హౌస్ ఆఫ్ కామన్స్‌కు 2017లో ఎంపికయ్యారు. బోరిస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. అన్నట్లు తన ఇద్దరు పిల్లలకూ హిందూ జాతీయతను సూచించేలా పేరు పెట్టుకున్నారు. కృష్ణ సునాక్, అనుష్క సునాక్.
రిషి సునాక్ 2015లో ఎంపీగా ఎన్నికయ్యారు. యార్క్‌షైర్‌లోని రిచ్‌మండ్‌నుంచి హౌస్ ఆఫ్ కామన్స్‌కు ఎంపికయ్యారు. కరోనా సమయంలో ఆయన ప్రకటించిన ఆర్థిక ప్యాకేజి రిషి సునాక్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. కానీ పార్టీ గేట్ కుంభకోణంతో ప్రతిష్ఠ మసకబారింది. కరోనా లాక్ డౌన్ సమయంలో నిర్వహించిన పార్టీలు ఆయనకు చెడ్డపేరు తెచ్చిపెట్టాయి. పార్టీలు ఇచ్చానని ఆయన అంగీకరించారు కూడా. అన్నీ కలిసొస్తే సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ప్రస్తుత సంక్షోభాన్ని ఒకవేళ జాన్సన్ అధిగమించినా… అక్టోబర్‌లో పదవీకాలం ముగుస్తుంది. అప్పటికి ఎలాగూ కొత్త ప్రధాని రావాల్సిందే.