ఎగ్జిట్ పోల్స్ అంచనా
ఢిల్లీ, ఫిబ్రవరి 05 : దేశ రాజధాని ఢిల్లీలో బి.జె.పి. దశ తిరుగుతుందా? బుధవారం పూర్తైన అసెంబ్లీ ఎన్నికల అనంతరం విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలు బి.జె.పి. ఢిల్లీ అసెంబ్లీని కైవసం చేసుకుంటుందని చెబుతున్నాయి. వివిధ సర్వేల ఫలితాలు ఇలా ఉన్నాయి.

పీపుల్స్ పల్స్: బీజేపీ 51-60, ఆప్ 10-19, ఏబీపీ మ్యాట్రిజ్: బీజేపీ 35-40, ఆప్ 32-37, ఆత్మసాక్షి: బీజేపీ 38-41, ఆప్ 27-30, కాంగ్రెస్ 1-3, చాణిక్య స్ట్రాటజీస్: బీజేపీ 39-44, ఆప్ 25-28, కేకే సర్వేలో బీజేపీ 22, ఆప్ 39, ఢిల్లీ టౌమ్స్ నౌ: బీజేపీ 39-45, ఆప్ 22-31. వీటి ప్రకారం చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ఈ సారి అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నాయి. అంచనాలు తిరగబడితే తప్ప బి.జె.పి.కి తిరుగులేదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి..