డబ్బు, పేరు ప్రఖ్యాతులు జీవితమా?

Date:

అదే బ్రహ్మానందమా
అదే నిజమైతే ఆత్మహత్యలు ఎందుకు?
(వాసిరెడ్డి అమర్నాథ్)

అనగనగా ఒక కుర్రాడు !
రోహిత్ గుర్తున్నాడా ?

జ్ఞాపకం రావడం లేదా ?
ఫరవా లేదు !

పోనీ …
మంచి కాఫీ లాంటి సినిమా “ఆనంద్” హీరో ?
గుర్తొచ్చాడు కదా ?
పేరు గుర్తుందా ?
ఆయన్ని వెండితెరపై చూసి ఎన్నాళ్లయింది ?
ఇప్పుడేమి ఏమి చేస్తున్నాడో ?
ఆలోచించారా ?

కొత్త బంగారు లోకం వరుణ్ సందేశ్ ; సూపర్ హిట్ “పెళ్లి “హీరో వడ్డే నవీన్ , గౌతం ఎస్ఎస్సి హీరో నవద్వీప్ …
… వీరందరూ ఇపుడు ఏమి చేస్తున్నారో ఆలోచించండి !

హీరో ల సంగతే కాదు .. నిన్న మొన్నటి దాక వెండి తెరపై ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ లు ఇప్పుడు ఎక్కడ ?
ఎక్కడ ఉన్నారు అనేది ముఖ్యం కాదు .
వారు ఆనందంగా ఉన్నారా ?
ఆలోచించండి .

ఉవ్వెత్తున నింగికెగసి అటుపై కిందకు పడిపోతే ?
యుక్త వయసులోనే పేరు ప్రఖ్యాతులొచ్చి ముప్పై- ముప్పైఐదేళ్లకే ఫేడవుట్ అయిపోతే ?
జీవితం ఎలా ఉంటుంది ?

ఏముంది .. పేరు తో బాటు డబ్బు కూడా వచ్చి ఉంటుంది .. జీవితాంతం కాలుపై కాలేసుకుని హ్యాపీగా బతికేయొచ్చు అని అనుకుంటున్నారా ?

అయితే హీరో ఉదయ్ కిరణ్ ఎందుకు ఆత్మ హత్య చేసుకున్నట్టు ?
బతకడానికి డబ్బులు లేకనా ?

అయన కొచ్చిన పేరుకు, జీవితాంతం ఒక్కో తెలుగు వారి ఇంట్లో గెస్ట్ గా వెళ్లి హ్యాపీగా బతికేసి ఉండొచ్చుగా?

డబ్బుతోనే లైఫ్ లో సంతోషం వచ్చేటట్టయితే వేల కోట్ల సంపదకు వారసులుగా పుట్టిన అనేక మంది ఏదో గుర్తింపు పొందాలని ఎందుకు ప్రయత్నిస్తున్నట్టు ?

తాత అక్కినేని, తెలుగు సినిమా లెజెండ్ .
తండ్రి నాగార్జున టాప్ హీరో .
వారసత్వంగా వచ్చిన అన్నపూర్ణ స్టూడియో .. ఇంకా వేల కోట్ల ఆస్తులు .
దర్జాగా కాలు పై కాలు వేసుకొని బతికేయక .. అఖిల్ అక్కినేని హీరో గా నిలదొక్కుకోవాలని ఎందుకు అంత కష్టపడుతున్నట్టు ? సిక్స్ ప్యాక్ బాడీ .. నటన.. ఫైటింగ్.. డాన్స్ ల లో శిక్షణ ఎందుకు తీసుకొంటున్నట్టు ?
ఆలోచించండి !

డబ్బు .. పేరు ప్రఖ్యాతులే జీవితం అయితే ..

సిల్క్ స్మిత .. ఫటాఫట్ జయలక్ష్మి లాంటి ఎందరో నటీమణులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నట్టు ?
శ్రీదేవి దివ్య భారతి లాంటి టాప్ హీరోయిన్స్ అనుమానాస్పద మరణాలను ఎలా అర్థం చేసుకోవాలి ?

ఒకప్పుడు టాప్ – 5 హీరో లలో ఒకడుగా వెలిగిన రాజశేఖర్, నేటి మానసిక స్థితి ఏంటి ?

వేణు అయితే సొంత వ్యాపారాలు చూసుకొంటున్నాడు .

కానీ తరుణ్ ?
ఒకప్పటి లవర్ బాయ్ .. నేడు అతని జీవితం ఎలా ఉంది? ఫీలింగ్స్ ఎలా వున్నాయి ?
ఏ మీడియా ఇంటర్వ్యూ చెయ్యదేమి?

అల్లరి నరేష్ ?
కామెడీ నటనలో రాజేంద్ర ప్రసాద్ ను మించిపోయాడు .
పాపం నేడు ?
ఏమి చేస్తున్నాడు ?
దిన చర్య ఎలా ఉంది ?
పొద్దున్న లేస్తే .. నాకు ఈ రోజు పెద్దగా పనేమీ లేదు అనే ఫీలింగ్ ఎలా ఉంటుంది ?
ఒక్కసారి ఎవరూ అడగరేమి ?

సినిమా వారి ఉదాహరణలు అయితే మీరు బాగా కనెక్ట్ అవుతారు అని చెప్పాను.

డిజిపి… చీఫ్ సెక్రటరీ… ప్రిన్సిపాల్ సెక్రటరీ లాంటి అత్యున్నత పదవుల్లో రిటైర్ అయిన ఐఏఎస్.. ఐపీఎస్ ఆఫీసర్ లు .. అప్పటిదాకా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నవారు… రిటైర్ అయిన కొన్ని నెలలకే తీవ్ర అనారోగ్యం తో మరణించడం చూసాను .

అప్పటిదాకా అనారోగ్యం తో ఉండి మంచి పదవి రాగానే ఆరోగ్యవంతులయిన రాజకీయ నాయకులున్నారు .
బాగా గుర్తుకు తెచ్చుకోండి .
పదవి అయన లో వన్నె తెచ్చింది అంటారు .
కారణం పదవి .. కుర్చీ కాదు ..

వీటికి అసలు కారణం తెలుసుకోవాలి .
అప్పుడే లైఫ్ అంటే ఏంటో మనకు అర్థం అవుతుంది .

జీవితం మనది .. దేహం మనది .. కానీ

మనల్ని ఆడించేది .. పాడించేది .. ఉన్నత శిఖరాలు చేర్చేది .. అధః పాతాళంలోకి తోసేసేది …. మన ఆలోచనలు ..

అవును .. ఆలోచనలే … భవిత .. జీవితం .

పెద్ద వారు… ” నుదిటి రాత “అంటారు .
“ఆడేది.. ఆడించేది .. అంతా పై వాడు .. మనం నిమిత్త మాత్రులం” అంటారు .

“యత్నం .. ప్రయత్నం .. దైవ యత్నం” అని కూడా అన్నారుగా .?

“నీ పని నీవు చేయి … ఫలితం గురించి ఆలోచన వద్దు ” అన్నాడు గీత లో కృష్ణుడు .

” నా చేతిలో ఏముంది ? దైవాధీనం” అనుకొంటే అది మెట్ట వేదాంతం అవుతుంది .

“అదృష్టం ధైర్యవంతులనే వరిస్తుంది” అని ఇంగ్లీష్ సామెత .

అందమే .. ఆనందం..
ఆనందమే జీవిత పరమార్థం .

అందం ఆంటే?… ఒడ్డు… పొడవు.. రంగు… రూపం ..
ఆగండాగండి .
నేను చెప్పేది దేహానికి సంబంధించి కాదు . మనసుకు సంబంధించి .

దేవుడు అనండి.. లేదా ప్రకృతి .
అబ్బుర పరిచే ఏర్పాటును ప్రతి వ్యక్తి దేహం లో చేసి పెట్టాడు .

నిన్నటి కంటే .. ఈ రోజు బాగుండాలి ..
ఈ రోజుకంటే రేపు బాగుండాలి ..
నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే దాక చేతి నిండా పనుండాలి .
ఛాలెంజ్ ఉండాలి .
అప్పుడు… ప్రతి రోజూ… భలే మంచి రోజు .. పసందయిన .రోజూ …

.అదే బతుకు మాధుర్యం ..
ఆలా బతుకు మాధుర్యాన్ని చవి చూస్తేనే జీవితం లో వసంతాలు పూస్తాయి .
లేకపొతే ఎడారి .

పాజిటివ్ ఫీలింగ్స్.. పాజిటివ్ వాతారవరణం.. లైఫ్ లో ఉంటే ఆక్సిటోసిన్ , డోపమైన్ , ఎండార్ఫిన్ సెరిటోనిన్ అనే హాపీ హార్మోన్స్ మన శరీరం లో స్రవిస్తాయి .
వాటి వల్ల ఆరోగ్యం .. ఆనందం .. అదే బ్రహ్మానందం ..

పుణ్య దంపతులు నాగలింగా చారి , లక్ష్మి నర్సమ్మ ఏమి అలోచించి బ్రహ్మానందం అని పేరు పెట్టారో .. ఒక తరం తెలుగు వారికి బ్రహ్మానందం పంచాడు . తాను ప్రతి ప్రతి రోజూ బ్రహ్మ్మనందం పొందుతూ జీవించాడు .జీవిస్తున్నాడు .

అదీ లైఫ్ ఆంటే ..

ఎన్టీవోడిలా ముఖ వర్చస్సు లేదు . అక్కినేని లా డాన్స్ రాదు . ఎస్వీ రంగారావు లా నటన రాదు ప్రభాస్ లా కండలు లేవు . మహేష్ బాబులా గ్లామర్ లేదు .. అయినా ముప్పై ఏళ్ళు .. దినదినప్రవర్ధమానం ..
అయన సమకాలికులు అయన తరువాత వచ్చిన వారు ఎంతో మంది ఫేడ్ అవుట్ అయిపోయారు .
కానీ బ్రహ్మానందం ?

ఏమిటి రహస్యం ?

లైఫ్ కొంతమందిని అందలాలు ఎక్కిస్తుంది !
కొంతమందిని నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకొంటుంది .

రావు గోపాల్ రావు మాటల్లో చెప్పాలంటే .. దీని తస్సా దియ్య .. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి .టీవీ వారి మాటల్లో చెప్పాలంటే దీన్ని ఎలా చూడాలి ?

మన ఆలోచనలే మన జీవితం .

ఉన్నత లక్ష్యాలు ఉండాలి .
కానీ నిలకడయైన వృద్ధి అంతకన్నా ముఖ్యం .
మన పరిమితులు తెలుసుకోవాలి . ఎక్కడ తగ్గాలో తెల్సుకోవాలి .
అగ్ర హీరో అయిపోవాలి అనుకోవడం గొప్ప ఆలోచనే .
కానీ వాస్తవాన్ని గ్రహించకపోతే ?
తెలుగు కామెడీ స్టార్ గుర్తొస్తున్నాడా ?

జీవితం ఎప్పుడు సవాళ్లు విసురుతూనే ఉంటుంది .
సవాళ్లు లేని జీవితం పెద్ద బోర్ .
కష్టాలు మనుషులుకు కాక రాళ్లకు రప్పలు వస్తాయా ?
ఒత్తడికి గురయితేనే బొగ్గు వజ్రం అవుతుంది . సాన పడితినే అది మెరుస్తుంది .
శిల్పి ఉలి దెబ్బలను వొళ్ళంతా తగిలించుకున్న రాయి గుడిలో శిల్పమయ్యింది . పూజలందుకొంది . ఉలిదెబ్బలు తగలని రాళ్లు గండశిలలుగా మిగిలిపోయాయి .

ప్రతి సంక్షోభం ఒక అవకాశం . నీ స్పందన ఏంటి అనేదే నీ జీవితం .
అపజయానికి మించిన గురువు సంక్షోభానికి మించిన స్నేహితుడు లేదు.

జీవితాన్ని ఈ బాటలో సాగిస్తే బ్రహ్మ్మనందం .

ఈర్ష .. అసూయ .. ద్వేషం … నిస్సహాయత.. కోపం… దుఃఖం .. ఇవన్నీ నెగటివ్ ఫీలింగ్స్ .

ప్రతి మనిషికి ఇలాంటి ఫీలింగ్స్ వస్తాయి . వాటిని ఎంత త్వరగా వదిలిచుకొంటాము అనేది ముఖ్యం . చేతిలో ఒక వాటర్ బాటిల్ ను వదలకుండా వారం రోజులు పట్టుకొంటే ?
ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. కదా ?

. ఒక చిన్న వాటర్ బాటిల్ కే ఇలా అయితే .. నెగటివ్ ఫీలింగ్స్ ను ఏళ్ళ తరబడి మోస్తూ తిరిగితే ?

కార్టిజాల్ అనే హార్మోన్ వస్తుంది . అది గుండెను కిడ్నీ లను .. ఇంకా శరీర భాగాలను దెబ్బ దెబ్బ తీస్తుంది .
మనసు పాడై పోతుంది .
మనసు గతి అంతే అయితే మనిషి బతుకు కూడా అంతే..

జీవితం లో బ్రహ్మానందం పొందాలి ఆంటే..
పనిని ప్రేమించండి .
ఇష్టమయిన పని చేస్తుంటే అలసట రాదు . ఆకాశమే హద్దుగా ఎదిగే అవకాశం ఉంటుంది .
మీరు పని వెంట పడితే .. పేరు ప్రఖ్యాతులు డబ్బు ఆరోగ్యం ఆనందం మీ వెంట పడుతాయి .

మీరు ఎంత డబ్బు సంపాదించినా… ఎన్ని ఆస్తులు మీ వారసులకిచ్చినా వారి జీవితం హ్యాపీగా ఉంటుందని గ్యారెంటీ లేదు . మీకింకా అనుమానం ఉంటే ముంబై హైదరాబాద్ లలోని అగ్ర హీరోలనడగండి .

మీ పిల్లలకు మంచి విద్య నందివ్వండి .
మంచి విద్య ఆంటే మార్కులు ర్యాంకు లుకాదు .
అవి ముఖ్యమే .

అందమయిన బతుకునిచ్చేదే విద్య .
జీవితం ఆనందంగా సాగాలంటే వారి ఆలోచనలు సరిగా రూపు దిద్దుకోవాలి .
మొక్కై వంగితేనే మాను దృడంగా పెరుగుతుంది .

షో ఆఫ్ .. బిల్డ్ అప్ లు కారాదు జీవితం .
నేలపై నడిస్తే.. ఎగరడం ప్రాక్టీస్ చెయ్యొచ్చు . ఎగరాలన్న పట్టుదల వస్తుంది .
మీ డబ్బుతో పలుకుబడి తో వారిని గాలిలో తిప్పితే .. రేపు అధఃపాతాళానికి పడిపోవచ్చు .

ఎందరో మహానుభావులు . అందరికీ వందనములు .

జీవితపు అందచందములను అనుభవించి బ్రహ్మనందము పొందిన వారు . ఎందరో మహానుభావులు

నా మెస్సేజ్ లో ఎన్నో వైరల్ అయ్యాయి . వేటిలో నా పేరు పెట్టుకోలేదు .

కానీ ఈ మెసేజ్ స్పెషల్ .

నా జన్మ దిన సందర్భంగా నేను పోస్ట్ చేసున్న ఈ మెసేజ్ సూపర్ వైరల్ కావాలని కోరుకుంటూ..
సర్వే జనా సుఖినోభవంతు !

(వ్యాస రచయిత ప్రముఖ విద్యావేత్త, స్లేట్ స్కూల్స్ వ్యవస్థాపకులు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ప్రమాదం చెప్పిన పాఠం

డెస్కుకు అవగాహన ముఖ్యంఈనాడు-నేను: 23(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి) సజీవంగా వెళ్ళి నిర్జీవంగా… మధ్యాహ్నం బయలుదేరిన...

కీలక సమయాల్లో ఆలస్యమైతే…

అత్యున్నత అధికారి సైతం డెస్కులో పని చేస్తారునేను-ఈనాడు: 23(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)అది...

సీఎంకు దుర్గ గుడి అర్చకుల శుభాకాంక్షలు

విజయవాడ: నూతన ఆంగ్ల సందర్భాన్ని పురస్కరించుకుని విజయవాడలోని దుర్గ గుడి ప్రధాన...

వాస్తవాల నిర్థారణ ఈనాడుకు పట్టుగొమ్మ

ఒక వార్తను రూఢీ చేసుకోవడం వెనుక…లోక్ నాయక్ జేపీ మృతి వార్త...
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://eastofanfield.com/https://nyonyabesar.com/https://direktoriwisata.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://richmondhardware.com/https://revolo.co.uk/video/https://apollog.uk/top/https://abroadnext.global/m/https://optimalqatar.me/https://pixelpayments.com/https://plinyrealty.com/https://ilkaylaw.com/https://mycovinadentists.com/https://www.callnovodesk.com/https://www.untax.com/https://www.socialhire.io/https://www.therosenthallaw.com/https://www.charlietakesanadventure.com/https://www.hausefbt.com/https://www.tripvacationrentals.com/https://tfm.digital/https://teethinadayuk.com/https://schrijnwerkerschoten.be/https://daddara.in/file/https://www.atsenvironmental.com/slot gacorhttps://absolutegraniteandmarble.com/https://abyssinianbunacoffee.com/https://acumenparentalconsultancy.com/https://adeyabebacoffee.com/https://afrocessories.co/https://alkinzalim.com/https://alphabetconsult.com/https://amhararegionsolarenergyassociation.com/https://angazavijiji.co.ke/https://www.bezadsolutions.com/https://bigonealuminium.co.tz/https://brentecvaccine.com/https://byhengineering.com/https://centercircle.co.tz/https://delitescargo.com/https://ecobeantrading.com/https://ejigtibeb.com/https://enrichequipment.com/https://enterethiopiatours.com/https://ethiogeneralbroker.com/https://ethiopiancoffeeassociation.org/https://ethiopolymer.com/https://excellentethiopiatour.com/https://extracarepharmaceuticals.com/https://eyobdemissietentrental.com/https://fiscanodscashewnuts.com/https://flocarebeauty.com/https://fluidengineeringandtrading.com/https://fostersey.com/https://geezaxumfetl.com/https://gollaartgallery.com/http://amgroup.net.au/https://expressbuds.ca/https://pscdental.com/https://livingpono.blog/https://thejackfruitcompany.com/https://thewisemind.net/https://www.sk-group.ca/https://www.spm.foundation/https://mmmove.com/https://touchstoneescrow.com/https://www.asuc.edu.mk/