యుద్ధక్షేత్రంలో సమస్యకు పరిష్కారం శూన్యం
ఉక్రెయిన్‌తో పాటు పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభాలు తీవ్ర ఆందోళనకరమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా ఈ ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా శాంతి, స్థిరత్వం పునరుద్ధరణకు భారతదేశం నుంచి దౌత్య పరమైన మద్దతు తెలుపుతామన్నారు ఉక్రెయిన్‌తో పాటు పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభాలు తీవ్ర ఆందోళనకరమని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా ఈ ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా శాంతి, స్థిరత్వం పునరుద్ధరణకు భారతదేశం నుంచి దౌత్యపరమైన మద్దతు తెలుపుతామన్నారు
భారత ప్రధాని పోలాండ్ పర్యటన
45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్ లో పర్యటించారు ఈ పర్యటన వల్ల. భారత్ – పోలాండ్ మధ్య సంబంధాలు ఇప్పుడు మెరుగుపడుతున్నాయి. ఈ ఏడాది రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నాము. ఈ సందర్భంగా సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని ఇరు దేశాల అధినేతలు నిర్ణయించారు. పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా పోలాండ్‌తో సంబంధాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. భారత్, పోలాండ్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 2022 సంవత్సరంలో ఉక్రెయిన్ సంక్షోభం సమయంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను సురక్షితంగా తరలించడానికి పోలాండ్ చూపిన దాతృత్వాన్ని భారతదేశం ఎప్పటికీ మరచిపోలేమని ప్రధాని మోదీ అన్నారు.
వాణిజ్యం, పెట్టుబడులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, రక్షణ, భద్రత, సాంస్కృతిక సహకారం, ప్రజల మధ్య సంబంధాలతో సహా ద్వైపాక్షిక భాగస్వామ్యంలోని వివిధ అంశాలపై వారు విస్తృత చర్చల్లో నిమగ్నమయ్యారు. ఫుడ్ ప్రాసెసింగ్, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వాటర్, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, AI, మైనింగ్ మరియు క్లీన్ టెక్నాలజీస్ వంటి రంగాలలో ఆర్థిక, వ్యాపార సహకారం కోసం గణనీయమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ఇద్దరు నేతలు అంగీకరించారు. భారత రాయబార కార్యాలయం ఉదహరించిన గణాంకాల ప్రకారం, 2013-2023 నుండి ద్వైపాక్షిక వాణిజ్యం యొక్క మొత్తం విలువ $1.95 బిలియన్ల నుండి $5.72 బిలియన్లకు పెరిగింది, భారతదేశ ఎగుమతులు మెజారిటీగా ఉన్నాయి. పోలాండ్‌తో బలమైన సంబంధాలపై, అంతర్జాతీయ వేదికపై కూడా భారతదేశం – పోలాండ్ సన్నిహిత సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడానికి ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలలో సంస్కరణలు అవసరం అని రెండు దేశాల ప్రధానులు అంగీకరించారు.
పోలాండ్ పర్యటన తర్వాత ప్రధాని మోదీ ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను సందర్శించనున్నారు.
ఏదైనా సంక్షోభంలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం మొత్తం మానవాళికి అతిపెద్ద సవాలుగా మారిందని మోదీ అన్నారు. శాంతి, స్థిరత్వం ముందస్తు పునరుద్ధరణ కోసం చర్చలకు, దౌత్యానికి మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఇందుకోసం భారత్ తన మిత్ర దేశాలతో పాటు అన్ని విధాలా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభం, పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణపై ఆందోళన వ్యక్తం చేసిన ప్రధాని మోదీ, ఉక్రెయిన్, పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం మనందరికీ తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు.