వాస్తవాల నిర్థారణ ఈనాడుకు పట్టుగొమ్మ

Date:

ఒక వార్తను రూఢీ చేసుకోవడం వెనుక…
లోక్ నాయక్ జేపీ మృతి వార్త ఓ ఉదాహరణ
ఈనాడు-నేను: 22
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)


ఈనాడులో ప్రధానంగా చెప్పుకోవలసింది… దోషాలు… చాలా తక్కువగా తప్పులుంటాయని గర్వంగా చెబుతాను. నేను చెబుతున్నది అక్షర దోషాలకే కాక వాస్తవాలకు కూడా వర్తిస్తుంది. ఏదైనా వార్త తెలిస్తే దాన్ని నిర్థారించుకోవడం మొదటి అడుగు.. ఆ తరవాతే మిగిలిన ప్రక్రియ. నిర్థారించుకునే విధానం చాలా పక్కాగా ఉంటుంది. పొలిటికల్‌ వార్తల అంశంలోనైతే… ఒకటికి పదిసార్లు చెక్‌ చేసుకుంటారు. ప్రముఖుల మృతి సంఘటనల విషయంలో మరీనూ… దీనికి ఉదాహరణగా జయప్రకాష్‌నారాయణ్‌ కన్నుమూత వార్తను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. రామ్‌మనోహర్‌ లోహియా ఆస్పత్రి నుంచి ఎలా వచ్చిందో జేపీ మరణించారనే వార్త ఢిల్లీలో పాకిపోయింది. అది మార్చి 22, 1979… అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్‌ వెంటనే ఈ అంశాన్ని నిర్థారించుకోకుండానే పార్లమెంట్‌ సెషన్‌లో ప్రకటించేశారు. సంతాపం పాటించారు. జాతీయ పతాకాన్ని అవనతం చేశారు. దేశవ్యాప్తంగా సెలవు ప్రకటించారు. ఆకాశవాణి తన కార్యక్రమాలన్నీ రద్దు చేసేసి, సంతాప సంగీతాన్ని ప్రారంభించింది. గాంధీజీ శిష్యుడొకరు… ఆయనింకా జీవించే ఉన్నారని చెప్పడంతో ప్రభుత్వం నాలుక కరుచుకుంది. ఆయన మరణించలేదనీ, అది తప్పుడు వార్తనీ.. ఈలోగా జరగాల్సిన అనర్థం జరిగిపోయింది.


ఎవరో చేసిన తప్పునకు ప్రధానిగా మొరార్జీ దేశాయ్‌ పార్లమెంటుకు క్షమాపణ చెప్పుకోవలసి వచ్చింది. ఇటువంటి పరిస్థితి ప్రముఖులకు ఎంత ఇరకాటంగా ఉంటుందో.. ఆ ఆలోచనే భయానకంగా ఉంటుంది. పైగా జేపీ… ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా గళమెత్తి జనతా పార్టీ ఆవిర్భావానికీ, అది అధికారంలోకి రావటానికీ కారణభూతుడైనవాడు.. అలాంటి అసామాన్యుడి విషయంలో జరిగింది ఈ తప్పిదం..


ఆ తరవాత, జేపీ ఏడు నెలలు జీవించారు.. అక్టోబరు 18న కన్నుమూశారు. వార్తను నిర్థారించుకోకపోవడం వల్ల చోటుచేసుకున్న అనర్థమిది. వార్తా సంస్థకు గానీ, సంబంధిత విలేకరికి గానీ ఇది చాలా ముఖ్యం. ఒక్క సంఘటన ఇలాంటిది జరిగితే ఇక ఆ సంస్థకు గానీ.. అందులో పనిచేసే ఉద్యోగులకు గానీ.. ‘విశ్వసనీయత’ ఏముంటుంది. (ఆ సమయంలో నేను ఈనాడులో లేను. వార్తల నిర్ధారణ అంశాన్ని వివరించడానికి నేను దీనిని రాశాను)
నిర్థారణ ఈనాడుకు పట్టుగొమ్మ..
ఇదే అంశంలో నాకూ రాజమండ్రిలో ఓ అనుభవం ఉంది..
అది రాజమండ్రి మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ శ్రీ చల్లా అప్పారావుగారి మరణం విషయంలో…
ఆయన దివంగతులయ్యారనే వార్త పొరపాటుగా డెస్కుకు చేరింది. ఆయన రాజమండ్రి ప్రముఖుల్లో ఒకరు…ఏ కోణంలో చూసుకున్నా అది ఆ రోజే ప్రచురించాల్సిన వార్త… నిర్థారణ లేదు.. రాత్రి పదకొండు గంటలు దాటింది.. రాజమండ్రి స్లిప్‌ పేజీ బాధ్యుడిగా దీన్ని నిర్థారించాల్సిన బాధ్యత నాదే. స్టాఫ్‌ రిపోర్టర్‌ ప్రసాద్‌ కూడా అదే పనిలో ఉన్నారు. చల్లా అప్పారావుగారి ఇంటి పక్కనే నా మిత్రుడొకరు ఉన్నారు.. అతనికి ఫోను చేసి విషయం చెప్పాను.. ఏదైనా హడావిడి ఉందా…అని విచారించా…ఏమీ లేదన్నాడు. అంతా ప్రశాంతంగానే ఉందన్నాడు.. ఒకవేళ ఆస్పత్రిలో ఉండుంటే… ఇక్కడేమీ హడావుడి ఉండే అవకాశం లేదు. ఆయన రెగ్యులర్‌గా వెళ్ళే ఆస్పత్రి వర్గాల్నీ విచారించాం.. మనకొచ్చిన వార్తను నిర్థారించే అంశం కనిపించలేదు. అప్పుడు రంగంలోకి దింపాం.. ఓ కంట్రిబ్యూటర్ని… నీదే బాధ్యత అని జాగ్రత్త చెప్పాం. అతను రామభక్త హనుమాన్‌ లాంటి వాడు. తక్షణం రంగంలోకి దిగిపోయాడు..
చల్లా అప్పారావు గారి ఇంటి వాచ్‌మేన్‌కు ముందు చెప్పాడు…
ఆయన ఆరోగ్యం గురించి కాస్త చెబుతుండమని…
రాత్రి తొమ్మిది గంటలయ్యేసరికి అక్కడ బీట్‌ ఇతను..
లోపలికి వెళ్ళి వచ్చేవారిని
‘ఏమండీ! అప్పారావుగారు.. క్షేమమే కదా…’
అంటూ విచారించేవారు.
మొదట్లో దాన్ని పెద్దగా పట్టించుకోని వారు తరవాత..
ఇబ్బంది పడ్డారు..మమ్మల్నీ ఇబ్బంది పెట్టారు..
అప్పారావు గారు మాత్రం.. అప్పటి మా బ్యూరో ఇన్చార్జి శ్రీ నవీన్‌ గారితో..
….అతను మంచివాడండి… అమాయకుడు… అతని మీద ఏమీ చర్య తీసుకోకండంటూ
నవ్వుతూ చెప్పారట…
అప్పారావు గారి మంచితనానికి అదో నిదర్శనం..
కొన్ని వార్తలను నిర్ధారించుకునే విషయంలో ఇలాంటి అనుభవాలూ ఎదురవుతుంటాయి.
మాకు తప్పుడు వార్త తెలిసిన ఓ ఇరవై రోజుల తరవాత చల్లా అప్పారావుగారు పరమపదించారు..
ఓ ఛోటా రాజకీయ నాయకుడి తమ్ముడి హత్య వార్తను మిస్సయిన నేపథ్యంలో రామోజీరావుగారిచ్చిన షాక్‌ ట్రీట్‌మెంట్‌ ప్రభావమే ఈ అతి జాగ్రత్త.
అతి జాగ్రత్తతో అనర్థాలూ..
ఉదాశీనతతో వార్తల మిస్సింగులూ… ఇలా ఉంటుంది జర్నలిస్టుల జీవితం. నిరంతరం.. సత్యాన్వేషణ, రంధ్రాన్వేషణలతో కాలం గడిచిపోతుంది.
రోడ్డు ప్రమాదాలూ… పడవల బోల్తాలు.. అగ్నిప్రమాదాలు..వంటి అంశాలలో సంబంధిత అధికారులుంటారు.. నిర్థారించడానికి…. వీటికెవరుంటారు….
బస్సు ప్రమాదంలో నా మిత్రుడి సోదరుడు…
కడియం నుంచి రాజమండ్రి వస్తున్న బస్సులోకి క్రేన్‌ దూసుకుపోయిన ఘటనలో 24మంది మరణించారు… అందరికీ తలలు లేచిపోయాయి. నిద్రలోనే అందరి ప్రాణాలూ గాలిలో కలిసిపోయాయి.. దాని గురించి సమాచారం ఇచ్చేవారు కూడా లేరు. అటువైపుగా వెడుతున్న ఓ కారు ప్రమాదం చూసి ఆగింది. అందులో ఉన్న ఇద్దరూ… బస్సులోకి ఎక్కి ఎవరైనా జీవించి ఉన్నారేమోనని వెతికారు.. పోలీసులకు సమాచారమిచ్చి, మృతదేహాలను కిందకు దింపారు.. అలా దింపిన మృతదేహాలలో నా హైస్కూల్‌మేట్‌ మల్లికార్జునరావు అన్నగారిది కూడా ఉంది. దాన్ని కిందకి దింపింది.. కారులో వచ్చిన నా మరో క్లాస్‌మేట్‌ కృష్ణ.. తలలు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోవడం… చిమ్మచీకటి కారణంగా అతను కూడా గుర్తించలేకపోయారు. 2006లో 29 సంవత్సరాల తరవాత రాజమండ్రి ప్రకాశం సెంటినరీ మెమోరియల్‌ హైస్కూల్‌లో చదువుకున్న మిత్రులంతా హైదరాబాద్‌లో కలుసుకున్నాం. ఆ సందర్భంగా మాటలలో ఈ విషయం వెల్లడైంది. గుండె పిండేసినట్లయ్యింది. ఆ సంఘటన గురించి చెబుతూ కృష్ణ ఏడ్చినంత పనిచేశాడు. హృదయవిదారకమైన ఆ దృశ్యాన్ని ఊహించుకోలేకపోయాం. దురదృష్టమేమిటంటే… వారం రోజుల క్రితమే ఊరెళ్లిన మల్లికార్జున రావు అన్నగారు ఈ ప్రమాదంలో మృతి చెందిన విషయం కొన్ని రోజుల వరకూ వెల్లడికాకపోవడం. అతను అదే బస్సులో వచ్చాడని అతని బంధువులు చెప్పేవరకూ ఇతని మరణం గురించి తెలియలేదు. అప్పుడు నిర్థారించుకున్నారు…అతడి మరణాన్ని… భద్రపరిచిన భౌతికకాయాన్ని తీసుకెళ్ళారు అప్పుడు. ఈనాడుతో ముడిపడిన అంశం కాబట్టి దీన్నిక్కడ ప్రస్తావించా..

ఈనాడు సంపాదక సిబ్బంది అంతా సాయంత్రం నాలుగు గంటలకు ఆఫీసుకు వెళ్ళేవాళ్ళం. అప్పటి నుంచే పని మొదలయ్యేది. ఏదైనా ప్రమాదమో… ప్రమోదమో చోటుచేసుకుంటే ముందుగానే పరుగెత్తాల్సి వచ్చేది. ఒక్కొక్కసారి ఎవరికైనా ఆఫీసుకు రావాలనే వార్త తెలియక పోతే ఆ సబ్ ఎడిటర్ కు అక్షంతలు తప్పవు. ఎవరూ ఉద్దేశపూర్వకంగా ఉదాసీనంగా వ్యవహరించరు కానీ, ఆ తరుణంలో ఒక్కొక్కరికి చెప్పడం మిస్ అవ్వచ్చు. కానీ ఇలాంటివే క్యారెక్టర్ అసాసినేషన్ కు దారితీస్తాయి.
మరో ప్రమాదం… గోదావరిలోకి బస్సు దూసుకుపోయిన ఘటనలో 36 మంది జల సమాధి.. అప్పట్లో ఇంత మీడియా లేదు.. తెలిస్తే రిపోర్టర్ల ద్వారా తెలియాలి.. లేదా డెస్క్‌ ఇన్చార్జి చెప్పాలి. రెండు ఘటనలలోనూ నాకు సమాచారం అందక ఆఫీసుకు నిర్ణీత సమయానికి వెళ్లకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పటిలా చీమ చిటుక్కుమంటే చెప్పేసే మీడియా లేదు… సోషల్ మీడియా అంతకంటే లేదు. ఎలా తెలుస్తుంది అంటాను నేను.. తెలుసుకుని రావాలంటారు ఇన్చార్జి.. ఎవరూ కనీసం ఇన్చార్జైనా చెప్పకపోతే ఎలా తెలుస్తుందంటాను నేను… ఆ తరవాత ఏమైందనేగా… వేచి చూడండి…

రైటప్ లో తప్పు … రామోజీ రియాక్షన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆరోజు డి.ఎన్. ప్రసాద్ ఏం చేశారంటే…?

ఎవరూ లేకున్నా ప్రత్యేక సంచికదీని వెనుక డి.ఎన్. ప్రసాద్ కృషిబాలయోగి మరణించి...

A Premier Rural Development Institute of India

National Institute of Rural Development and Panchayati Raj (NIRD&PR)...

Science for the common man

(Dr. N. Khaleel) Four years ago, Corona shook the world....

Watch CHAVA in a Theatre

(Dr Kamalakar Karamcheti) The Hero is captured by the villain...