(వైజయంతి పురాణపండ, 8008551232)
థాంక్యూ శాస్త్రిగారు.. అంటూ సీతారామశాస్త్రి ఫోటోను మనస్ఫూర్తిగా ముద్దాడిన వర్మ
దటీజ్ వర్మ…
నా పేరు ఇది.. ఆయన పేరు అది… అంటూ అందరికీ పేర్లు ఉంటాయి.
పేరనేది ఒక ఆలోచనా సమూహానికి పెట్టిన ఐడెంటిటీ.
తన లోపలి ఆలోచనలు తన భావం అనేది ప్రధాన కారణం.
ఆయన పాటల రచయిత కవి అనేది కాదు, ఫైనల్‌గా ఆయన లోపల ఏం ఫీలవుతున్నాడు.
ఆయన స్టడీ చేసిన అబ్జర్వేషన్స్. అందులో నుంచి ఆయనకున్న ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలను కమ్యూనికేట్ చేస్తారు. ఆయన కవి కాబట్టి ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు… అంటూ సీతారామ శాస్త్రి పేరు గురించి చెపుతూ పేరు అనే పదాన్నినిర్వచించారు. సిరివెన్నెల రాసిన తనకు నచ్చిన పాట గురించి ప్రస్తావిస్తూ…
ఒక హోప్‌లెస్‌నెస్.. ఉన్నప్పుడు ఒక యాంబిషన్ ఉండాలి… అనే అంశాన్ని అందరికీ తెలియచేయటం కోసం…
ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ
ఎన్నడూ కోలుపోవద్దురా ఓరిమీ..
విశ్రమించ వద్దు ఏ క్షణం..
అంటూ శాస్త్రిగారు రచించిన గీతాన్ని ఎంతో ఆవేశంగా ఆలపించారు వర్మ.
పాట పూర్తిగా నోటికి నేర్చుకున్న వర్మ, తన మనసు తెర మీద ఆ గీతాన్ని ఎంతో మురిపెంగా చూసుకుంటూ ఆ గీతాన్ని మొత్తం శాస్త్రిగారు ఆలపించినట్లుగానే, ఆయన ఆవహించినట్లుగానే వినిపించారు.
వర్మకి శాస్త్రిగారి మీద ఎంత ప్రేమ, అభిమానం ఉన్నాయో, శాస్త్రిగారి భావాలను ఎంతో ప్రేమించారో ఆ పాట అప్పగిస్తున్న తీరు చూస్తుంటే అర్థం అవుతుంది.. ఈ చిన్న వీడియోను అప్‌లోడ్ చేసిన గంటలోపే సుమారు 20 వేల మంది చూడటమే కాకుండా, వర్మ నిజాయితీని ప్రశంసిస్తూ కామెంట్లు కూడా పెట్టారు. వర్మలోనూ శాస్త్రిగారికి ఉన్నలాంటి ఆలోచనలు, భావాలు ఉన్నాయి. అందుకే వర్మకు శాస్త్రిగారి మీద అవ్యాజమైన అనురాగం, అభిమానం, ఆప్యాయత ఉన్నట్లు స్పష్టంగా కనిపించింది. బయటకు వర్మ కన్నీరు కనిపించకపోవచ్చు కానీ, తప్పకుండా ఆయన గుండె పూర్తిగా తడి అయి ఉంటుంది. తనకు ఇమోషన్స్ ఉన్నాయని వర్మే చాలా సార్లు అన్నారు.
నిజమే..
వర్మ తన సినిమాలకు ఎన్నో పాటలు రాయించుకున్నారు.
1989 లో వర్మకు శాస్త్రిగారితో అనుబంధం చిగుళ్లు వేసింది.
ఆ చిగుళ్లు మహావృక్షం స్థాయికి ఎదిగినట్లు ఈ వీడియో చెబుతోంది.
వర్మ ఈజ్ ట్రూ పర్సన్.
వర్మకు నటించటం రాదు.
వర్మకు ఉన్నది ఉన్నట్లు చెప్పటం మాత్రమే తెలుసు..
అని ఈ వీడియో చూసినవారంతా అనుకుంటున్నారు.