ఎపి సీఎంతో భేటీలో యూఏఈ రాయబారి
సౌకర్యాల కల్పనకు సిద్ధమన్న జగన్
అమరావతి, మే 1 : సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను భారత్‌లో యూఏఈ రాయబారి అబ్ధుల్‌నాసర్ అల్షాలి సోమవారం కలిశారు. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై వారిరువురు చర్చించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని సీఎం నాసర్ కు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను ఆయనకు సీఎం జగన్ వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఫుడ్ పార్క్‌లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, టూరిజం, హాస్పిటాలిటీ, గ్రీన్ హైడ్రోజన్, పోర్ట్‌లు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు, మౌలిక సదుపాయాల కల్పన వంటి వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి యూఏఈ రాయబారి వివరించారు. ఏపీని పెట్టుబడులకు లీడ్ స్టేట్‌గా పరిగణిస్తున్నామని ఆయన జగన్ కు తెలిపారు.
ఇప్పటికే పెట్టుబడుల సదస్సులో చర్చించిన అంశాలపై మున్ముందు ప్రభుత్వం తరపున తీసుకోవాల్సిన చర్యలపై కూడా వీరివురి నడుమ సమావేశంలో చర్చ సాగింది.
ఈ సమావేశంలో సీఎం స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, యూఏఈ రాయబార కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.
పెట్టుబడులకు లీడ్ స్టేట్ ఆంధ్ర ప్రదేశ్
Date: