భారత్ రాష్ట్ర సమితిగా పార్టీ తీర్మానం
తీర్మానంపై సంతకం చేసిన అధినేత కేసీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 05: టీఆర్ఎస్… బీఆర్ఎస్గా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు టీఆర్ఎస్ పార్టీ భారత్ రాష్ట్ర సమితిగా అవతరించింది. జాతీయ రాజకీయ యవనికపై అడుగుపెట్టడానికి కేసీఆర్‌కు వేదిక సిద్ధమైంది. జాతీయ నాయకుల సమక్షంలో జరిగిన టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో పార్టీని బీఆర్ఎస్ గా ఎందుకు మార్చాల్సి వచ్చిందీ కేసీఆర్ వివరించారు.
అనంతరం సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట 19 సెకన్లకు కేసీఆర్ పార్టీ పేరుమార్పు తీర్మానంపై సంతకం చేశారు ముఖ్యమంత్రి. కేసీఆర్ సంతకం చేసిన వెంటనే పార్టీ కార్యాలయం వెలుపల కోలాహల వాతావరణం నెలకొంది. తీర్మానం కాపీలను పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు అందజేయనున్నారు. సమావేశంలో పార్టీ జెండా, అజెండాల గురించి kcr వివరించారు.