(ఎలిశెట్టి సురేష్ కుమార్, 9948546286)
ఒకటా..రెండా..
వేలాది పాటలు..
పరవశించిపోయిన తరాలు..
కోట్లాది హృదయాలు..
ప్రతి మనిషి జ్ఞాపకంలో
ఆయన పాట..
ఏ వయసు వారికి
ఆ అనుభూతి..
బాల్యమా.. యవ్వనమా..కౌమారమా.. వార్ధక్యమా..జీవితంలోని
అన్ని దశలకు
అన్ని రకాల పాటలు..
ప్రేమా.. విషాదమా.. ఆవేశమా..రౌద్రమా.. సరదానా.. సంతోషమా..
ఎప్పుడు ఏదడిగినా చిటికెలో తీసి ఇచ్చేస్తుందా స్వరపేటిక..
అసలు పాటకు
ఘంటసాలే పీఠిక…!
భక్తి గీతాలు రసరమ్యాలు..
ఒకనాడు ప్రతి సినిమా
మాస్టారి పాటతోనే మొదలు
నమో వెంకటేశ..
నమో తిరుమలేశ…
శివశంకరీ శివానందలహరి
అయిదు గొంతులతో
పాడితే శిల కరిగింది..
అభిమాని గుండె పొంగింది..!
ఏడుకొండలవాడా ఎక్కడున్నావయ్యా..
ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా..
ఇలా పిలిస్తే
దిగిరాడా వెంకన్న..!
గుడిలో నీ పాటే..
గుడిసెలో నీ గీతమే..
మా గుండె గుడిలో
నీ గళమే…
నువ్వు మా హృదయాలలో నింపిన జాలమే..
మా బ్రతుకులో
నీ పాటలు కలకాలమే..!
సంగీతమే నీ ప్రపంచం..
వినిపించే పాటల వెనక
ఎంత సాధన..
ఇంకెంత శోధన..
నిదురలో.. మెలకువలో
నీ గొంతు కువకువ..
నీ పాట మెళకువ..
సంగీత ప్రపంచానికి
నీ స్వరమే వేకువ..!
నీ పాట..
నేల నలు చెరగులా
అదే ప్రతిధ్వని..
అన్ని చోట్లా నువ్వున్నావు..
ఎక్కడ విన్నా
నీ గొంతే..
నువ్వుంటావు..
నేనున్నంత కాలం
నా గుండెలో..
నా తర్వాత
నా బిడ్డ గొంతులో..
సినిమా ఉన్నంత కాలం
ప్రతి పాటలో..సంగీతమనే
ఒక పాఠంలో..
ప్రతి పుటలో..!
కిట్టయ్య భగవద్గీత
నీ గళంలో
సుమంగళంగా..
నేడు నీ గంభీరగాత్రం..
మా జీవితాల్లో చైత్రం..
అదెంత చిత్రం..!
నీ పాట..
తేటతేట తెలుగులా..
తెల్లవారి వెలుగులా..
చిన్నప్పటి నుంచి నాతోనే..
ప్రతి వయసులో..
ప్రతి శ్రుతిలో..
నేను పాడే
అపశ్రుతిలో..
నిరంతరం నా స్మృతిలో..!
🎼🎼🎼🎼🎼🎼🎼
మహాగాయకుడు
ఘంటసాల వర్ధంతి
సందర్బంగా..
ఇది నా నివాళి..