తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్
ఈసారి టీమ్ జేఎన్‌జే అభ్యర్థులను గెలిపించండి
అడ్డంకులన్నీ తొలగించి, మీకు ప్లాట్లు వచ్చేలా సహకారం అందిస్తాం
హైదరాబాద్, ఫిబ్రవరి 17 : జవహర్‌లాల్ నెహ్రూ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీకి ఈనెల 23 న నిర్వహించనున్న ఎన్నికల్లో టీమ్ జేఎన్‌జేను గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్‌కుమార్‌గౌడ్ కోరారు. కాగ్రెస్ పార్టీ… టీం జె.ఎన్.జె.కు సంపూర్ణ మద్దతునిస్తోందని చెప్పారు. గతంలో బీఆర్ఎస్‌కు చెందిన వ్యక్తులు జర్నలిస్టుల స్థలాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారని, దాన్ని తిప్పికొట్టేందుకు పోరాడిన టీమ్‌జేఎన్‌జేకు… నాడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి పూర్తి మద్దతునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే సీఎం రేవంత్‌రెడ్డి టీమ్‌జేఎన్‌జేకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈసారి జరగనున్న సొసైటీ ఎన్నికల్లో టీమ్‌జేఎన్‌జే అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని పాత్రికేయ మిత్రులకు మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.
మా మద్దతు టీమ్ జేఎన్‌జేకే
Date: