నేడు జంధ్యాల పౌర్ణమి

Date:

(వాడవల్లి శ్రీధర్)
సంవత్సరానికి ఒకసారైనా, శ్రావణ పూర్ణిమ నాడు తప్పకుండా నూతన యజ్ఞోపవీతధారణ చేస్తుంటారు. శ్రావణ పూర్ణిమ భారతావని మొత్తం శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే రోజు. ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లోనూ శ్రావణ పూర్ణిమకు చాలా విశిష్టత వుంది. పాల్కురికి సోమన ఈ పూర్ణిమని ‘నూలి పున్నమి’ అన్నాడు. నూలుతో తయారు చేసిన జంధ్యాలు ధరించడమే దీనికి కారణం. పాల్కురికి సోమనాథుడు రచించిన పండితారాధ్య చరిత్రలో జంధ్యాల పూర్ణిమ గురించి సవివరంగా వర్ణించాడు
శ్రావణ పౌర్ణమి నాడు యజ్ఞోపవీత ధారులందరూ నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు.
ఎందుకంటే సంవత్సరం అంతా ఏమైనా గాయత్రీ లోపం జరిగినా అనుష్టాన లోపాలేమైనా ఉన్నా వాటికి ప్రాయశ్చిత్తంగా ఉపాకర్మ చేసి నూతన యజ్ఞోపవీతధారణ చేస్తారు. విద్యాధిపతి హయగ్రీవుడు కనుక వేదవిద్యను అభ్యసించేవారు స్వరలోపం ఉన్నవారు, ఉచ్ఛారణ లోపం జరిగినా దాని ప్రాయశ్చిత్తార్థం గురుహోమం, ఉపాకర్మ జరిపి యజ్ఞోపవీతధారణ చేస్తారు.. ఉపవీతుల యజ్ఞోపవీతాలు దారపు పోగులే.. అనుపవీతుల రక్షలుదారపు పోగులే.. స్త్రీల వ్రత తోరాలు దారపు పోగులే.. మంగళ సూత్రాలు దారపు పోగులే.. ఇలా హిందువు ఎంతటి వారైనా ధర్మంకోసం దారపు పోగుకు జీవితాంతం కట్టుబడి ఉంటారనేది ఉదాత్త భావం ఈ పర్వదినాల్లో ఇమిడి ఉంది.
యజ్ఞోపవీతం అంటే శరీరంపై ఒక పవిత్రమైన కవచం, అది లేకుండా యజ్ఞం లేదా పవిత్ర కర్మ చేయలేము. యజ్ఞోపవీతము అనే పదము ‘యజ్ఞము’ ‘ఉపవీతము’ అనే రెండు పదాల కలయికవల్ల ఏర్పడింది. యజ్ఞము అంటే ‘యాగము’ ‘ఉపవీతము’ అంటే దారము అనే అర్థాలున్నాయి. యజ్ఞోపవీతము అంటే యాగకర్మ చేత పునీతమైన దారము అని అర్థము. యజ్ఞోపవీతం సాక్షాత్తూ గాయత్రీదేవికి ప్రతీక. పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణవల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని, యజ్ఞం ఆచరించిన ఫలితం కలుగుతుందని వేదోక్తి. యజ్ఞోపవీతాన్నే జంధ్యమని, బ్రహ్మసూత్రమని పిలుస్తారు.

ప్రతి జంధ్యానికి మూడు పోగులు ఒక ముడి చేత కట్టబడి ఉంటాయి. ఈ ముడినే బ్రహ్మ గ్రంధి అని అంటారు. ఈ మూడు పోగులు సత్త్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణాలను తెలియ జేస్తాయి. ఈ మూడు పోగులను ధరించినప్పుడు అవి మనకు ఋషి ఋణం, పితృ ఋణం, దేవ ఋణాలను గుర్తు చేస్తాయి. ఆ మూడు పోగులను కలిపి ముడి వేయబడిన బ్రహ్మ గ్రంథి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు లను కలిసి ఏకంగా ఉండడాన్ని సూచిస్తుంది
యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేః యత్సహజం పురస్తాత్
అయుష్యం అగ్రియం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవితం బలమస్తు తేజః”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

We are here to help our country: Trump

This is a moment never seen before We are here...

Uddhav Thackeray: Congress riding Shiv sena tiger?

(Dr Pentapati Pullarao) In November 2019, Uddhav Thackeray broke of...

US Elections vs Indian Polls

Plethora of similarities in campaigning style (Anita Saluja) As the US...

శిల్ప చేసిన భగీరథ విఫల యత్నం

త్వరలో సమస్య పరిష్కారానికి HMWSSB ఎం.డి. హామీ (కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)ఎవరికైనా వ్యక్తిగతంగా...