Home చదివేద్దాం సులభతర రీతిలో రాజ్యాంగం

సులభతర రీతిలో రాజ్యాంగం

1
సులభతర రీతిలో రాజ్యాంగం

శ్రీదేవి మురళీధర్ రచన
(డాక్టర్ వైజయంతి పురాణపండ)

భారత రాజ్యాంగం…
ఈ మాట ప్రతి అసెంబ్లీ సమావేశాల్లోను, లోక్‌సభ సమావేశాల్లోను అనేకమార్లు వినిపించే తారకమంత్రం. ఏ విషయం గురించి విశ్లేషించాలన్నా, ‘రాజ్యాంగంలోని ఫలానా అధికరణం ప్రకారం’ అంటూ రాజ్యాంగాన్ని ప్రస్తావించడం సర్వసాధారణం.
భారత రాజ్యాంగాన్ని చదివిన వారి సంఖ్య బహుశ ఒక్క శాతం ఉంటుందేమోనంటే ఏ మాత్రం అతిశయోక్తి కానేకాదు. అంత పెద్ద రాజ్యాంగ గ్రంథాన్ని పిల్లలు చదవటం చాలా కష్టం. అంత శ్రమ అక్కర్లేకుండా పిల్లలకు రాజ్యాంగం గురించి మూల విషయాలు అర్థమయ్యే రీతిలో శ్రీదేవి మురళీధర్‌ ‘భారత బాలలమైన మేము – మన రాజ్యాంగ పీఠిక’ అనే పేరున పరిచయం చేశారు. చిన్న చిన్న పదాలతో, అందమైన బొమ్మలతో, ప్రధానమైన అంశాలను ఏక పదంతో వివరిస్తూ అందరినీ ఆకట్టుకునేలాగ, అందరికీ అర్థమయేలాగ రచించారు.


ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి, తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయిన లీలా సేథ్. ‘వియ్‌ ద చిల్డ్రన్‌ ఆఫ్‌ ఇండియా’ పేరున ఆంగ్లంలో రాసిన పుస్తకాన్ని తెలుగులోకి శ్రీదేవి మురళీధర్‌ అనువదించారు. సరళమైన తెలుగులో అందరికీ అర్థమయ్యే రీతిలో వచ్చిన ఈ పుస్తకం పాఠశాలల్లో పిల్లలకు సిలబస్‌లో ఉంచితే రాజ్యాంగం గురించి తెలుసుకోవటానికి వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.


ఈ పుస్తకానికి చిత్రాలు వేసిన బిందియా థాపర్‌ వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్‌. ప్రవృత్తిరీత్యా కళాకారిణి. ఎన్నో పిల్లల పుస్తకాలకు అద్భుతమైన చిత్రాలను రూపొందించారు. 2014లో క్యాన్సర్‌ వ్యాధితో పోరాడుతూ కన్నుమూశారు.
విద్యార్థులు మాత్రమే కాదు రాజ్యాంగం గురించి తెలియని పెద్దలు కూడా ఈ పుస్తకాన్ని చదివి కనీస పరిజ్ఞానాన్ని పెంచుకోవచ్చు. అందరూ తప్పక చదవవలసిన గ్రంథం.


నాణ్యమైన కాగితం మీద ప్రచురితమైన ఈ పుస్తకం వెల 150 రూపాయలు.
చాలా తక్కువ ధరకు అందుతున్ఞ ఈ పుస్తకాన్ని
ఎమెస్కో, నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ప్రచురించారు.
ప్రతులకు

1 COMMENT

  1. నమస్కారం. మీ చక్కటి వివరణాత్మక పరిచయానికి ధన్యవాదాలు. ఇది పెద్దలు చదివి పిల్లల చేత దగ్గరుండి చదివించ వలసిన పుస్తకం. ఎమెస్కో , నల్సార్ వారికి ధన్యవాదాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here