రాజీవ్ సభ వార్త ఎలా వచ్చిందంటే…

Date:

వాళ్ళు వార్త రాస్తే…
ఈనాడు – నేను: 11
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)

సైక్లోన్ తరవాత చెప్పుకోదగిన అంశం 1991 లోక్ సభ ఎన్నికలు…
ఎన్నికల వార్తలలో అంతా నిమగ్నమై ఉన్నాం. జిల్లా ఎడిషన్‌ సెంటర్‌ స్ప్రెడ్ లో ఎన్నికల భారతం వచ్చేది. నియోజకవర్గాల సమీక్షలు.. గత ఎన్నికలకూ.. ఈ ఎన్నికలకూ మధ్య వ్యత్యాసం, అమలైన హామీలు.. కానివీ.. ఎవరి విజయావకాశాలెంత.. మధ్యలో చెణుకులు.. ఇంటర్య్వూ లూ.. వీటన్నింటితో ఆసక్తికరంగా వచ్చేవి అవి. ప్రతి పేజీకి ఒక్కో బాధ్యుడు.. తప్పొస్తే అతగాడిదే బాధ్యత. దీనివల్ల తప్పులు జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి. ఒకవేళ జరిగినా ఎవరో ఒకరి కంట పడేవి. వార్తలు పునరుక్తాలకు అసలు ఈనాడులో చోటే లేదు. ఒకవేళ పొరపాటున తప్పిదం జరిగిందీ అంటే అందరి కన్ను కప్పిందన్నమాటే. ఆ పరంపర కొనసాగేది… ఎవరికీ దొరికేది కాదు..
వాళ్ళు వార్త రాస్తే….
పెద్దాడ నవీన్‌గారు, పమ్మి నాగేంద్రశర్మ గారు, వైఆర్‌ గాంధీగారు, హనుమంతరావు గారు ఇలా ఎందరో ఉద్దండులు.. అత్యద్భుతంగా రాసేవారు. వీరెవరి కాపీల మీద డెస్కులో పెన్ను పెట్టాల్సిన అవసరం ఉండేదికాదు..
వై.ఆర్. గాంధీ గారు అంటే నేను జాయిన్ అయినప్పుడు అమలాపురంలో ఈనాడు రిపోర్టర్. తరవాత ఆయనను రాజమండ్రి రిపోర్టర్ గా తెచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక డెస్కులో సభ్యుడు. గుండ్రటి దస్తూరి. దస్తూరికి తగ్గట్టే ఆయన చాలా పద్ధతిగా వ్యవహరించేవారు. పని చేసేవారు. కోనసీమ వారు కావడంతో ఆయన మాటలు కొబ్బరి నీళ్లలా తియ్యగా ఉండేవి. ఎవర్నీ నొప్పించే వారు కాదు.


నవీన్ గారు ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీని ప్రారంభించిన సందర్భంలో ఆయన ప్రసంగాలకు అవసరమైన సమాచారాన్ని ప్రోది చేసి ఇచ్చేవారు. ఈయన దస్తూరి కూడా అద్భుతంగా ఉండేది. కాపీ చదవాల్సిన అవసరమే ఉండేది కాదు. ఆయన రాసిన వార్త చదవడం ప్రారంభిస్తే, ఆఖరు దాకా చదివిస్తుంది. అది ఆయన ప్రత్యేకత. నవీన్ గారు ప్రస్తుతం రాజమండ్రిలోని జి.ఎస్.ఎల్. విద్యా సంస్థలలో డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు.


ఇక పమ్మి నాగేంద్ర శర్మ గారు. వార్తలో స్పష్టత. విశ్లేషణ ఆయన ప్రత్యేకతలు. వార్తలోనూ, మాటలోనూ ముక్కుసూటితనం. ఈయన ఈనాడు తర్వాత కొన్నాళ్ళు ఎంపీ భూపతిరాజు విజయకుమార రాజుకు పి.ఏ.గా చేశారు. ఇప్పుడు చెన్నైలో ఒక లా కళాశాలకు డీన్ గా వ్యవహరిస్తున్నారు. వై.ఆర్. గాంధీ గారు దివంగతులయ్యారు. నాగేంద్ర శర్మ గారి నుంచి నేను నేర్చుకున్నవి ఈ రెండు. వార్త ఎంత స్పష్టంగా ఉండాలో నవీన్ గారి నుంచి నేర్చుకున్నాను. మృదు భాషణం మాత్రం అలవడలేదు. అది నన్ను ఎన్నో ఇబ్బందులకు గురిచేసింది. పని చేయడం మాత్రమే కాదు… కాస్త లౌక్యం కూడా పనిచేసే చోటనే కాదు… నిత్య జీవితంలోనూ అవసరమే. అది నాకు ఇప్పటికీ అలవడలేదు. దాని వల్ల ఎంతో నష్టపోయాను. ఆ విషయాలు మున్ముందు తెలుస్తాయి.


రాజమండ్రి సభకు టి.పి. ఆపరేటర్ రిపోర్టర్
ఓ రోజు రాజమండ్రిలో రాజీవ్‌ గాంధీ బహిరంగ సభ… రాత్రి 8.30 గంటల ప్రాంతంలో.. రిపోర్టర్‌ సభాస్థలిలో ఉన్నారు. టీపీ సెంటర్‌లో విశ్వప్రసాద్‌ అనే ఆపరేటర్‌.. అతన్ని అలా అనే కంటే రిపోర్టర్‌ అంటే బాగుంటుంది. ఇక్కడ ఎడిషన్‌ ఇచ్చేయాలి. నవీన్‌ గారనుకుంటా.. అతనికి కొన్ని ప్రశ్నలు వేశారు. తెలుసుకుని చెప్పమన్నారు. అతను ఇచ్చిన సమాచారంతో రాజీవ్‌ గాంధీ ఫొటోపెట్టి.. బ్యానర్‌ వార్త రాసేశారు. తరువాత సిటీ ఎడిషన్‌కు ప్రసంగం వార్తతో ఇచ్చామనుకోండి. స్టాఫర్‌ అందుబాటులో లేకపోయినా.. రాజీవ్‌ గాంధీ సభ వార్తను ఇచ్చేయగలిగామంటే.. అది డెస్క్‌ నిబద్ధత. అందులో ఉండేవారి మేధాశక్తికి తిరుగులేని రుజువు. దటీజ్‌ ఈనాడు.. ఆలోచనతో సాధించిన ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. ముందుముందు మీతో పంచుకుంటాను.

భీకరమైన రాత్రి
మొదటి విడత ఎన్నికలు ముగిశాయి. ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచార అంకం పూర్తయ్యింది. ఇక తమిళనాడులో.. మిగిలుంది.. 21 మే 1991 నాడు విశాఖ నుంచి మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వెళ్ళి తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌ సభలో ప్రసంగించాలి. ఆ సమయానికి మా పని పూర్తయ్యింది. ఇంటికొచ్చేశాం. మండువేసవి.. భోజనం చేసి, డాబా మీద పడుకున్నాం… అప్పుడు మొదలైంది అలజడి.. రోడ్డు మీద కొన్ని వందల మంది పరుగులు తీస్తున్న శబ్దం.. అందరూ ఇళ్ళకు వెళ్ళి పోండి.. ఎవరూ బయటకు రావద్దంటూ పోలీసుల హెచ్చరికలు.. ఈలోగా ఎవరో మా ఇంటి గోడ దూకినట్లు దబ్బుమని చప్పుడు.. ఉలిక్కిపడ్డా.. ఓ ఆకారం నా దగ్గరకొచ్చి … రొప్పుతోంది… ఆ ఆకారం నాతో ఏం చెప్పింది..తదితర విశేషాల కోసం రేపటిదాకా ఆగాల్సిందే.

దటీజ్‌ ఈనాడు.. అవసరమైనప్పుడు సర్వ శక్తులూ ఒడ్డి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Can Modi repair the economy?

Government maybe planning to play with the budget to...

ఒక పత్రిక పని విధానం ఎలా ఉంటుందంటే…

ఆ రోజుల్లో కంపోజింగ్‌ తీరు…పేజీ మేకప్‌ ఆసక్తిదాయకంఈనాడు – నేను: 35(సుబ్రహ్మణ్యం...

Blood Donation camp at Libdom Villas

On the 76th Independence Day (Dr Shankar Chatterjee)   Republic...

నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్

బాలయ్యకు పద్మ భూషణ్, మాడుగులకు పద్మశ్రీమొత్తం 139 మందికి పద్మ అవార్డులుఏడుగురు...
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://eastofanfield.com/https://nyonyabesar.com/https://direktoriwisata.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://richmondhardware.com/https://technostrix.com/https://troostcoffeeandtea.com/https://www.majestkids.com/