మూడు ఎస్టేట్ల దేశం ఇప్పుడు రియల్ ఎస్టేట్ అయ్యింది

Date:

దేనికైనా ‘ప్రశ్నే’ కారణం
‘‘భారత రాజ్యాంగ పీఠిక’’ పుస్తకం: ఒక పరిచయం
(మాడభూషి శ్రీధర్)

● భారత రాజ్యాంగ పీఠిక పేరుతో పుస్తకం రాయడానికి కారణం ఏమిటి? విజయవాడ మిత్రుడు శ్రీశ్రీప్రింటర్స్ విశ్వేశ్వర్ రావు ఈ పుస్తకాన్ని ఎందుకు ప్రచురించారు?
● భారత రాజ్యాంగం అంబేడ్కర్ గారే రచించారా? ఆయన ఒక్కరే మనదేశానికి, ఇంత పెద్ద దేశానికి, ఇంత పెద్ద రాజ్యాంగాన్ని రచించినారా? ఏమైనా సందేహాలు ఉన్నాయా?
అందుకు ఈ ప్రశ్న కారణం, ఈ పుస్తకానికీ ఏ దేనికైనా కూడా ‘ప్రశ్న’ కారణం అవుతుంది. మన రాజ్యాంగాన్ని రూపొందించింది అంబేడ్కర్ అని చదివి అర్థం చేసుకున్న తర్వాత పూర్తిగా నా నమ్మకం అని నా అభిప్రాయం. ఈ పుస్తకం ప్రచురించిన తరువాత కూడా నా నమ్మకం అదే. ప్రచురణ కూడా చాలా అవసరం అనిపించింది.

ఈ పుస్తకానికి పూర్తి శీర్షిక ఈ ‘‘అంబేడ్కర్ నిర్మాతా లేదా రచయితా? భారత రాజ్యాంగ పీఠిక: జన చైతన్యమే రక్ష’’. దృష్టి, సృష్టి, పెరుగుదల, పేరు, ముగింపు ఈ ప్రశ్నకు సమాధానం ఈ పుస్తకం. అదే చిరునామా. అదే వివరణ. రాజ్యాంగ చరిత్ర, గతం, వర్తమానం ఈ జాతిలో ఉంది, ఉంటుంది. రాబోయే భవిష్యత్తు గురించి నా తరతరాలు ఈ జవాబిస్తాయి.
రిప్లబిక్ సెలవు అనుకుంటే..

2024 జనవరి 26 రిపబ్లిక్ డే. మన గణతంత్రం. భారత స్వాతంత్య్రం తరవాత గణతంత్ర కూడా లేకపోతే రాజ్యాంగం కూడా ఉండజాలదు. చాలామందికి అది ఒక సెలవు అని మాత్రమే అనుకుంటే మన భవిష్యత్తు ఏమిటో చెప్పాల్సిందేమీ లేదు. జనవరి 26వ తేదీనాడు ఒక వ్యాసం రాయాలని అనుకున్నాను. ఈ ప్రశ్న గురించి రాయలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఒకే రోజు పత్రికలో వివరణ చేయడం సాధ్యం కాదు. పత్రికలో రాజ్యాంగ పీఠిక గురించి ఇచ్చేంత పెద్ద జాగ ఏ ఎడిటర్ కూడా ఇవ్వలేరు. దాదాపు ఓ వేయి పదాలు చాలంటారు. ఇంకా తక్కువ కావాలంటారు. తప్పుకాదు. నా వ్యాసాన్ని రెండు నుంచి అయిదు భాగాలు విడివిడిగా ప్రచురించేందుకు వ్యాసాలై ఉంటాయని అర్థమైంది. చాలా దిద్దుకున్న తరువాత అవన్నీ ఫేస్ బుక్ లో చేర్చాను. మిత్రులు చదివారు. ఆ సమయంలో విశ్వేశ్వర్ రావు ఫోన్ చేసారు. ఆ అయిదు భాగాల కటింగ్ లు తీసి దాదాపు 25 పేజీలుగా పేర్చి చిన్న పుస్తకం వేద్దాం అన్నారాయన. అంతకుముందు ఆయన మంచి పుస్తకాలు ఇదే విధంగా చాలా బాగున్నాయని వారి మిత్రులు ‘సాహితీ మిత్రులు’ అన్నారు. కాని 25 పేజీలలో చెప్పడానికి పీఠిక ఈ వివరం సరిపోదు. ఆయనగారు ‘‘మీ ఇష్టం..మొత్తానికి ఒక పుస్తకం చేయిద్దాం ’’ అన్నారు. ఆ విధంగా పుస్తకం కొన్ని అంశాలతో చేర్చుతూ, పెంచుతూ, మార్చి, విశ్లేషించి రాస్తూ ఉంటే ప్రచురించిన విశ్వేశ్వర్ రావుని, వారి ప్రింటర్ డెస్క్ టాప్ డిజైనర్ని ఎన్నో సార్లు నానా కష్టాలు పెట్టాను. నా బ్రెయిన్ స్ట్రోక్ వైద్య సమస్యలు, ఆలోచనలు, చదువుల వల్ల ఇదిగో ఇందాకా పుస్తకం 200 పేజీల దాకా వచ్చింది. శ్రీశ్రీ శక్తివంతమైన వాక్యాలు ఉంటంకించాం. అవి కేవలం శబ్దాలు కాదు, పిడుగులనీ, అవసరమనీ అనిపించింది. కనుక దానికి కారణం ‘శ్రీశ్రీ’ పేరు, విశ్వేశ్వర్ రావ్.
నా బ్రెయిన్ స్ట్రోక్ తరువాత నెమ్మదిగా శక్తి పెంచుకుంటూ ఉన్నదశలో, నా మాతృమూర్తి, అమ్మ, 93 సంవత్సరాల వయసులో కష్టాలు పడీ పడీ, అప్పడికే, దెబ్బలు పడి, కాళ్లు విరిగి, హస్పిటల్ కష్టాలు, మధ్యలో జ్ఞాపకాలు ఉడిగిపోతూ ఉంటే, ‘‘వీరు నా కొడుకా? వారేనా?’’ అంటే ‘అమ్మా, నేను రెండో కొడుకును’ అంటూ,‘‘ఆహా నేను పెద్దకొడుకునమ్మా’’ అని అన్నయ్య చెప్పడం విన్నాను.

ఆ దశలో జనవరి 2023న తన జీవనగాధ (చెమ్మగిల్లే దశలో) ముగించారు మా అమ్మ. మరో ఏడాది ముగిసిన తరువాత తేరుకుంటూ ఒక్కో అక్షరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, తెలుగు, ఇంగ్లీషు అక్షరాలు టైప్ గుర్తు చేసుకుంటూ ఆలోచనలు పేర్చుకుంటూ ఉండడం వల్ల రాయడం ఆలస్యమైంది. బోలెడు తప్పులు. (నా జీవన కథానాయకి వేద కల్యాణిని పదేపదే వేధించి, ‘ఆ మాట ఏమిటి ఇదే, ఇదే నాకు గుర్తు రావడం లేదు’ అని సాధించి, కళ్లుమూసుకుని ఆలోచించి ‘ఇదే సరిపోయిందా అంటూ, అవునని ఆమె అనడం’’ చాలా సందర్భాల్లో కల్యాణి క్షణంలో చెప్పగల్గడం నా అదృష్టం. (‘నా 67 సంవత్సరాల వయసులో 94 సంవత్సరాల మా అమ్మగారు రథసప్తమినాడు 28.1.2023న సూర్యలోకం ద్వారా రంగనాయకమ్మ (కీ.శే. ఎం ఎస్ ఆచార్య ధర్మపత్ని) పరమపదం చేరి ఏడాది (2024) జ్ఞాపకంగా ఈపుస్తకం మీ ముందు సమర్పించడం మా అదృష్టం. ధర్మపత్ని శ్రీమతి వేద కల్యాణి సహాయంతో నిజమైంది’ అనే అక్షరాలతో అంకితం చేసాను. తరువాత ఏడుడి (ఏడాది) కార్యక్రమాలు, నా కుడి చేయి విరగడం, మధ్యలో నా కుమారుని పెళ్లి జరిపించడం, ఆ పరిస్థితిలో ఈ పుస్తక రచన జరిగింది. అందుకని ‘‘నాకు సరే మన రాజ్యాంగానికి స్ట్రోక్ వద్దు’’ అని శీర్షికతో ముందుమాటగా నాకథ అన వచ్చు)
తెలుగులో రాయడం అన్నింటి కన్న, మన రాజ్యాంగ పీఠిక తెలుగులో రాయడం, మొత్తం రచన కన్నా గొప్ప అనుకున్నాను. కేవలం ఒక్క పేజి. కాని ప్రతి అక్షరం గొప్పది. ఈ దేశ పీఠిక అది. పీఠం అది. ఎన్నో సార్లు రాసి కొట్టేసి నా మిత్రుడు నరేశ్ మూడుసార్లు కూడా మార్చి, అవునవును ఇదే కరెక్ట్ అనుకుంటూ, అయ్యో ప్రింట్ అయిపోయిందే అని బాధపడ్డాను. ముగించాను. ఇంకా తప్పులు ఉండవచ్చు.
మొదటి అధ్యాయంలో భారత రాజ్యాంగ నిర్మాణ చరిత్ర పరిణామాలను ప్రముఖ పాత్రికేయుడు, 15.8.1947నాడు విశ్లేషించి రచించిన వ్యాసం కీర్తిశేషులు శ్రీ పండితారాధ్యుల నాగేశ్వరరావు నాటి వ్యాసాన్ని చేర్చుకున్నాను. స్వాతంత్ర రాజ్యాంగ రచనా చరిత్రను చాలా సమగ్రంగా రచించినది ఇది. దానికి ‘వర్తక దృష్టితోనే శాసనాలను చేసిన ఆంగ్లేయులు’ అని నా శీర్షిక ఇచ్చాను.
మన భారతదేశాన్ని మూడో అధ్యాయంలో
‘‘భారత ప్రజలమైన మనము, మన భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్రదీక్షతో తీర్మానించి, మన దేశ పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాల్ని; ఆలోచనా, భావప్రకటనా, మతవిశ్వాస ఆరాధనా స్వేచ్ఛను; హోదాల్లోనూ అవకాశాలలోను సమానత్వాన్ని సాధించేందుకు; వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యత సమగ్రతను కల్పించే సౌభ్రాతృత్వాన్నిపెంపొందించాలని; మన రాజ్యాంగ నిర్ణాయక సభలో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, శాసనీకరించి, ఆమోదించి, మనకు మనము సమర్పించుకుంటున్నాము.’’ అని అనువదించాను. ఎన్నిమార్పులు చేసిన తరువాత కూడా మళ్లీ చర్చించి పూర్తి చేసాను.
‘‘మాకు మేము సమర్పించుకునే గణతంత్ర రాజ్యాంగం భారత ప్రజలమైన మనం, మన భారతదేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్రదీక్షతో తీర్మానించి, మన దేశ పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని; ఆలోచనా, భావప్రకటనా, మతవిశ్వాస ఆరాధనా స్వేచ్ఛను; హోదాల్లోను అవకాశాలలోనూ సమానత్వాన్ని సాధించేందుకు; వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యత సమగ్రతను నిర్మించేందుకు సౌభ్రాతృత్వాన్నిపెంపొందించేందుకు; మన రాజ్యాంగ నిర్ణాయక సభలోలో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి, శాసనం చేసి,, ఆమోదించి, మాకు మేము సమర్పించుకుంటున్నాము.’’
అని నిన్న 12.6.2024న సవరించాను. ఇంకా అవసరమైతే మారుస్తాను. ఇది నా ‘కృతి చరిత్ర’.


ఇది పౌర దీక్షా ప్రకటన
నాలుగోఅధ్యాయంలో…‘‘ఈ పీఠిక కేవలం పీఠిక కాదు. ఇది పునాది. ఈ భాగంలో రాజ్యాంగ ప్రవేశిక, ప్రస్తావన అంటారు. ఇది నిజానికి రాజ్యాంగానికి ఒక మూలతత్వం గురించి పీఠిక వివరిస్తుంది. ఇది రాజ్యాంగం ఉపోద్ఘాతం అవుతుంది. మొత్తం రాజ్యాంగానికి ఇది ఒక ముందుమాట, లేదా, పరిచయం అనీ అంటారు. ఇది పౌర దీక్షా ప్రకటన. ఈ పీఠిక మన భారతీయుల లక్ష్యాల పట్టిక, బాధ్యతల హెచ్చరిక. మన సంవిధాన ప్రవేశిక. మనం దీక్షవహించవలసిన ఆశయాల వేదిక. ఇదొక ప్రతిజ్ఞ. సంవిధానం చరిత్ర, రాజ్యాంగ చరిత్ర. మన ఘనమైన దేశ చరిత్ర, కనీసం అదేమిటో. మహాకవి శ్రీశ్రీ చెప్పేదన్న‘చరిత్రకర్థం’ తెలుసుకోవాడమే మన కర్తవ్యం.’’ చివరకు చెప్పవలసిన ఒక మాట అంబేడ్కర్ ఇది: ‘‘నిర్మాణ ఘనత నాకు ఇచ్చారు, కాని నిజంగా అది నాకు చెందదు’’.
‘నిజాం దమనకాండ’
ఏడో అధ్యాయం ‘‘ స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్ నిజాం దమనకాండ’’. ఆ పోరాటంలో అనేకమంది ప్రాణాలు బలిచేసుకున్నారు. ఆంగ్లేయుల దుర్మార్గాలకు కూడా అంతులేదు. అంతేకాదు, ఆనాటి హైదరాబాద్ రాజ్యంలో (రాష్ట్రం కాదు) అంటే దాదాపు మధ్య భారతంలో స్వాతంత్ర భారతదేశం వచ్చిన తరువాత కూడా ఆనాటి తెలంగాణ, మహారాష్ట్ర, కర్నాటక, ఛత్తీస్ నగర్ పరిసరాల్లో కూడా హైదరాబాద్ లో అత్యాచారాలకు, నిజాం, ప్రభుత్వాల దారుణాలు అంతులేదు. ఒక ఉదాహరణ: స్వాతంత్ర సమరయోధుడు ఎం ఎస్ ఆచార్య.

గొప్ప రచయిత, చరిత్ర వివరించే రెండు పుస్తకాలు రాసారు. భారతీయతతో అర్థంచేసుకున్న రచయిత చరిత్ర గ్రాన్ విల్ ఆస్టిన్. వారితో చర్చించే అవకాశం ఇచ్చిన నా ప్రిన్సిపల్ కీర్తిశేషులు ప్రొఫెసర్ కె గుప్తేశ్వర్ గారు, ఆస్టిన్ తో మాట్లాడే అవకాశం ఇచ్చారు.

పదో అధ్యాయంలో ‘నోబెల్ బహుమతి గ్రహీత, రవీంద్రనాథ్ టాగోర్ రచించిన ఒక బెంగాలీ గీతం లోని మొదటి భాగం ఈ జనగణమన, ఇదీ భారత జాతీయగీతం అయింది. అయితే మన సంవిధాన రాజ్యాంగ పీఠిక అసలు ‘ఒక జాతీయ గీతం’ అని వివరించాను. పదకొండవ అధ్యాయంలో ఆదేశిక సూత్రాలలో స్టేట్ సమానత అంటూ అంబేడ్కర్ ప్రియాంబుల్ పుస్తకాన్ని ఉటంకించాను.
వైరుధ్యాల జీవితంలోకి
‘అంబేడ్కర్ వైరుధ్యాల జీవితంలోకి అడుగుబెడుతున్నాం’ అన్నరాజ్యాంగ సభలో ప్రసంగం చాలా గొప్పది. చదివి తీరాల్సిందే. ఆ అధ్యాయాల తరువాత మూడు ఎస్టేట్ లు మన దేశం, రియల్ ఎస్టేట్ గతి పట్టింది అని బాధ పడుతూ అంటూ మొదటి ఎస్టేట్ లో బాండ్లు, అవి లంచాలా విరాళాలా అని, రెండో ఎస్టేట్ న్యాయవ్యవస్థ ఇప్పటి న్యాయం ఇదా అని మాజీ సిజెఐ గారు తాజా ఎంపీ అనే భాగం, ఇక మూడో ఎస్టేట్ లెజిస్టేటర్ మన పార్లమెంట్ కథ అని ముగించాను. వివరాలు పుస్తకంలో చదువుకోవచ్చు.

అట్ట చివరిపేజీ ఇది. పుస్తకం పేరు

ప్రచురణ ఎక్కడ దొరుకుతుందో చెప్పేవివరాలు. విశాలాంధ్ర బుక్ హౌజ్, ప్రజాశక్తి, నవోదయం హైదరాబాద్ వగైరా చోట్ల.
చివరి అట్ట వెనుక ఇది. ప్రశ్నించండి అన్నదే సందేశం.

(Author is Deen in Mahindra School of Law, Hyderabad and former Central RTI Commissioner)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Who will be triumphing in MAHA elections?

Is it Mahayuti or Maha Vikas Aghadi? Among all parties...

Trump and India: Great expectations

(Dr Pentapati Pullarao) Donald Trump’s election has created great expectations...

Prof.Purushottam Reddy: Renowned Academician

Environmentalist and Developmental Activist  (Prof Shankar Chatterjee)     ...

We are here to help our country: Trump

This is a moment never seen before We are here...