(Amarnath Vasireddy)
“ది గర్ల్ ఫ్రెండ్” – సినిమా గురించి !
ముందుగా ఒక మాట!
పోస్ట్ ఎందుకు ?
నేడు ఉన్నత విద్య సంస్థలో జరుగుతున్నదానికి…ఈ సినిమా దగ్గరగా ఉంది కనుక .
అంతే కాదు ఈ సినిమా చేత వేలాది మంది యువతీ యువకులు ప్రభావితమవుతున్నారు కనుక !
సిగ్గు .. ఎగ్గూ .. సభ్యత… సంస్కారం తగలెట్టేసేయండి నిరంజన్ గారూ !
బరి తెగించిన సమాజంతో మాట్లాడాలంటే… మనమూ… నిజాన్ని నిర్భయంగా మాట్లాడుకోవాలి ..
రండి అడుగుదాము .
1 . పురుషుల్లో మహిళా ద్వేషాన్ని , మహిళల్లో పురుష ద్వేషాన్ని రెచ్చగొడితే… అది లింగ సమానత్వం అవుతుందా రాహుల్ రవీంద్రన్ ?
ఒకే సారి రెండు పనులు చేస్తూ ఆల్రెడీ తగలడుతున్న సమాజం లోకి పెట్రోల్ పోసి… డబ్బు … పేరు సంపాదించాలి అనే నీ ప్లాన్ ఇప్పటిదాకా బాగానే వర్కౌట్ అవుతోంది సరే !
2 . పోస్ట్ గ్రాడ్యువేషన్ రెండేళ్ల కోర్స్ .
అంటే మొత్తం 730 రోజులు .
ఓ సారి హీరో చేత మరో సారి హీరోయిన్ చేత .. తాము వెయ్యి సార్లు శారీరకంగా కలుసుకొన్నట్టు చెప్పించావు.
అంటే ప్రతి రాత్రి .. సగం రోజులు పగలు కూడా !
నీ హీరో హీరోయిన్ కు మానవాతీత హార్మోన్ ఓవర్ డ్రైవ్ ఉంది అనుకొందాము .
రాత్రి పగలు యూనివర్సిటీ హాస్టల్ ను వాయ్యో హోటల్ రూమ్ గా మార్చేసిన వాళ్ళల్లో.. హీరో అయితే ఎనిమిది బ్యాక్ లాగ్స్ .
వాడి చదువు బంక నాకింది .
మరి హీరోయిన్ ఏంటి ?
ఆమె ఏమైనా సూపర్ బ్రెయిన్ పర్సన్ ?
ఒక పక్క ఆమెకు పానిక్ అటాక్స్ . మరో పక్క ఈ హార్మోనల్ ఓవర్ డ్రైవ్ ? ఇది ఎలా సాధ్యం ?
3 . హీరోయిన్ కు ఒక బాయ్ ఫ్రెండ్ దొరకగానే.. అదేదో పెద్ద పండుగ అయినట్టు అందరూ ఆమెను అభినందిస్తారు .
సరే .. నేటి విద్య సంస్థల్లో పరిస్థితి ఇదే .. ఒప్పుకొంటాను.
పీర్ ప్రెషర్ …
నలుగురు చేసిందే ట్రెండ్ .
ట్రెండ్ ను ఫాలో కాకపోతే మనం వెనుకబడి పోతాము అని పెద్దలు యువత పిల్లలు అనుకొంటున్న సమాజం మనది. .
ఉన్నత విద్య సంస్థల్లో తాగడం.. డ్రగ్స్ కూడా సహజం అయిపోయింది .
నీ హీరో హీరోయిన్ దీనికి మినహాయింపు ఎలా అయిపోయారు బ్రో ? వాళ్ళు ట్రెండ్ ను ఫాలో అవలేదా ?
నీ హీరో అసలే మాఫియా టైపు .
ఎంత గర్ల్ ఫ్రెండ్ అయినా… రోజూ చెయ్యాలంటే .. కిక్కు రావాలంటే .. రెండో ఐదో పెగ్గులు వెయ్యాలి అనుకోలేదా ?
పనిలోపనిగా హీరోయిన్ కు కూడా నేర్పలేదా ? ఈ విషయం లో వారు ట్రెండ్ ను ఎందుకు ఫాలో కాలేదు ?
లేక వాళ్ళు ఫాలో అయినా నువ్వు ఆ సీన్స్ చూపలేదా ?
సెన్సార్ ఒప్పుకోదు అనుకున్నావా ?
వాళ్ళు ఎప్పుడో చచ్చారు గా !
4 . మహిళలకు సైకిల్ అనేది ఉంటుంది కదా ? పదకొండో రోజు నుంచి పందొమ్మిదో రోజు దాక .. తొడుగులు లేకుండా కలుసుకొంటే అవాంఛిత గర్భం వస్తుంది . రోజుకు కనీసం ఒక్క సారి.. రెండేళ్ల కోర్స్ లో సగం రోజులు పగలు కూడా ఇంటర్ కోర్స్ చేసిన నీ హీరో హీరోయిన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకొన్నారు ? ఆమెకు అవాంఛిత గర్భం వచ్చి ఆసుపత్రికి పోయి తీయించుకొంటే అది ఆమె ఆరోగ్యం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది ?
పదేపదే ఆలా అబార్షన్ చేసుకొంటే.. భవిషత్తులో గుండె లో రంధ్రం.. అటిజం పిల్లలు పుట్టే ప్రమాదం ఉందని నీకు తెలియదా ?
ఏమీ లేదు . కాలేజీ రోజుల్లో అసలు కోర్స్ వదిలేసి ఇంటర్ కోర్స్ చేసుకొంటే తప్పులేదని యూత్ ను రెచ్చ గొట్టావు కదా .
వాళ్లకు కూడా తెలియాలని అడుగుతున్నా !
ఒక వేళా వాళ్ళు ఫుల్ గా డ్రింక్ చేసి డ్రగ్స్ తీసుకొని చేసుంటే .. ఆ సమయం లో తొడుగులు మరిచి పోయి ఉంటే ? అవి పగిలి పోయి ఉంటే ?
పోనీ ఓకే పని చేయరాదా?
యూనివర్సిటీలో హాస్టల్ కు అనుబంధంగా ఒక అబార్షన్ కేంద్రాన్ని కూడా చూపలేక పోయావా ?
అటు పై సంతాన సాఫల్య కేంద్రాలు .. ఆటిజం క్లినిక్కులు ..
బ్రతుకు బ్రెజిల్ ఎప్పుడో అయిపోయింది .
4 . మనిషికి అది బయలాజికల్ నీడ్.. శారీరక అవసరం .
నిజమే.
పిజి రోజుల్లోనే రోజుకు రెండు సార్లు వాంఛను తీర్చుకొన్న … నీ హీరోయిన్ చదువు పూర్తయ్యాక హ్యాపీ గా ఎలా బతికేస్తుంది?
హీరో నయితే నువ్వు చూపలేదు . సరే..
వాడు వేరే అమ్మాయిని చూసుకొని ఉంటాడు అనుకొందాము . హీరోయిన్ ఎలాంటి సమస్య లేకుండా హ్యాపీ గా బతికేస్తున్నట్టు చూపవు .
ఇంటెలిజెంట్ క్రిమినల్ .
జనాల చెవిలో ఏమి పువ్వులు పెట్టావు బ్రో .
ఒక్క సారి అలవాటు పడితే అదే కోరుకొంటారు కదా !
రోజుకు రెండు సార్లు కాకపోయినా… కనీసం వారానికి రెండు సార్లు !
మరి నీ హీరోయిన్ సంగతేంటి ?
అమ్మాయిలను రెచ్చగొట్టి .. వారి బతుకు ఇలా భ్రష్టు పట్టించి డబ్బు సంపాదించి ఏమి చేసుకొంటావు ? నీకు కూతుళ్లు లేరా ?
5 . నీకు లండన్ ఎక్కడ ఉందో తెలుసా ? అక్కడ ఉన్నవారికే ఉద్యోగాలు పోతున్నాయి .
డొల్ల డొక్కా చదువు … అదీ రోజుకు రెండు సార్లు ఇంటర్ కోర్స్ చేస్తూ చదివిన నీ హీరోయిన్ కు లండన్ లో జాబ్ ఎవరు ఇచ్చాడు బ్రో ?
జాబ్ చేస్తూనే తండ్రి ఆరోగ్యం పట్టించుకుంటుంది. అని చివరి సీన్ లో మహా బిల్డ్ అప్ ఇచ్చావు . అమ్మాయి ఉద్యోగం చేస్తే తండ్రి అన్ని మరచిపోతాడు. నువ్వు కూడా ఒక తండ్రే కదా ! ఇంత నీచంగా ఆ పాత్రను మలచావేంది?
6 ఏమి చేసినా తప్పులేదు .. మహిళ తన కాళ్లపై తాను నిలబడాలి .. ఆత్మ గౌరవం చాటు కోవాలి అని నీ సందేశం బాగుంది .
కానీ .. నీ హీరో లాంటి వెధవలు నేటి సమాజంలో లక్షల్లో .
తనకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని వాడు ఆమె పై ఆసిడ్ దాడి చేసుంటే ?
సరే.. నీది సినిమా . ఫేర్ వెల్ ఫంక్షన్ లో హీరోయిన్ ఒక్క వీర స్పీచ్ ఇచ్చేటప్పటికి వాడు మారిపోతాడు .
మరి నిజ జీవితం లో రేపు ఎవడైనా హత్య ఆత్మ హత్య ప్రయతం చేస్తే ..నీ సినిమా చూసి తప్పుదారి పట్టిన యువతకు నువ్వు అండగా వుంటావా?
7 . నీ సినిమాలో అన్నిటికన్నా పెద్ద మోసం.. హీరో తల్లి క్యారెక్టర్ . మహిళల్లో పురుష ద్వేషం పెంచి పెళ్ళికి దూరం చేయాలనే నీ ప్లాన్ కు అనుగుణంగా ఆ క్యారెక్టర్ మలిచావు .
హీరో తండ్రి పెద్ద వెదవ. పెళ్ళాన్ని అలా చేసాడు .
కానీ కొడుకు తో కూడా మాట్లాడని … కొడుకు ముందు కూడా తలదించుకుని మాట్లాడే తల్లి ఉంటుందా?
మహిళా సమానత్వం అంటూ అమ్మాయిలను పక్కదారి పట్టిస్తున్న నీవు .. ఒక తల్లి క్యారెక్టర్ ను ఇంత నీచంగా మలుస్తావా ? ఇది మహిళా లోకానికి అవమానం కాదా ?
నీ వ్యక్తిత్వాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి .
నీ వ్యకిత్వానికి తగ్గ వ్యక్తిని ఎన్నుకోవాలి .
తల్లితండ్రి సలహా తో .
అదీ.. చదువు పూర్తయ్యాక .
చదువుకొనే వయస్సులో బ్రహ్మచర్యం .
అటు పై పెళ్లి .. ప్రేమ .
అదే గృహస్థ ఆశ్రమం .
కంపాటిబిలిటీ ముఖ్యం .
అటు పై అడ్జస్ట్మెంట్ .
నీకు జన్మ నిచ్చిన తల్లితండ్రులు నీ మంచి కోరుతారు .
నీ భవిషత్తు కోసమే వారి ఆరాటం .
పేరెంట్స్ విలన్ లు కారు .
{ ఎక్కడో కొంతమంది ఉంటే వారిని చూపి ప్రతి పేరెంట్ విలన్ అని చూపించే వెధవల్ని ఉరి తీయాలి}
పెళ్లి చేసుకొని .. ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలి . అమ్మాయిలు చదవాలి .
అబ్బాయిలూ చదవాలి .
ఇద్దరికీ ఉద్యోగాలు .
నీ భార్య .. ఈ కాలం అమ్మాయి . ఆమెను గౌరవించాలి .
మీ అమ్మ అమ్మమ్మలాగే వుండాలి అనుకోవడం సరి కాదు .
నీతో సమానంగా చదివిన అమ్మాయి… ఒక్కో సారి నీకంటే ఎక్కువ సంపాదించే అమ్మాయి తో వ్యవహరించే తీరు ఇది .. అని ప్రతి పేరెంట్ కొడుక్కి చెప్పాలి .
“అమ్మా.. గుడ్డిగా ప్రేమ లో దిగకు . సమాజం లో పోరంబోకులు ఎక్కువ . డ్రింక్ డ్రగ్స్ .. బెట్టింగ్ కాలం ఇది” ..అని అమ్మాయిలకు చెప్పాలి .
అబ్బాయిలకు కూడా హనీ ట్రాప్ .. సెక్సటార్షన్ గురించి, దొంగ గృహ హింస కేసుల గురించి చెప్పాలి .
హలో .. తమిళ తంబీ .. రాహుల్ రవీంద్రన్. ఆల్రెడీ తగలడుతున్న సమాజం లో పెట్రోల్ పొసే నీ సినిమా హిట్ అయ్యింది .
ఇకనైనా మంచి సినిమా లు తీస్తావని ఆశతో ..
ఎందుకంటే .. నీకు ఒక కొడుకు .. కూతురు వుంటారు . వారు సమాజం లో భాగం . సముద్రం లో పయనిస్తూ సమాజమనే నౌకను తగలెట్టేస్తే.. ఎవరూ సేఫ్ కాదు .
నీ డబ్బు అప్పుడు నిన్ను రక్షించదు.

(వ్యాస రచయిత ప్రముఖ విద్యావేత్త)


Excellent 👌 rachana saar నేనుకూడా సినిమా చూసి చాలా బాగా తీశారు అనే అనుకున్నాను. కానీ మీ కోణంలో ఇప్పుడే చూసాను. ఇది కూడా కరెక్ట్. సినిమాలు సమాజం మీద ప్రభావం చూపుతాయి. కానీ హిట్ అయ్యింది అంటే జనం ఏ కోణం లో సినిమా చూసి ఉంటారు? నా లాగానే అమ్మాయిలు ఇలా బాధపడుతున్నారు కదా తల్లిదండ్రులకు కాస్త తెలియాలి అనుకోని ఉంటారా??? ఏమో తెలియడం లేదు.