అరబ్, తమిళ్ జానపదాల మధ్య పోలిక

0
195

డెమిస్ రూషోస్ పాటే సాక్ష్యం
(రోచిష్మాన్, 9444012279)

“సె యు లవ్ మి…”

(మెహబూబా మెహబూబా…)

గ్రీక్ గాయకుడు డెమిస్ రూషోస్ (Demis Roussos; 1946-2015) 1974లో పాడిన పాట “సె యు లవ్ మి…”

డెమిస్ రూషోస్ ఈజిప్ట్ లో పుట్టి, కొంత కాలం పెరిగిన గీక్ వ్యక్తి. అందువల్లే ఆయన సంగీతం, గానం గ్రీక్, అరబీ ధోరణుల మిశ్రమమైంది; ప్రపంచాన్ని అలరించింది.

తన warm voiceతో, warm singingతో అంతర్జాతీయ గాయకుడయ్యారు డెమిస్ రూషోస్. ఒక గాయకుడు అంతర్జాతీయ గాయకుడు అయ్యాడు అంటేనే గొప్ప అనే.

(ఘంటసాల కన్నా గొప్ప గాత్రం, గానం ప్రపంచంలో ఉండవు, లేవు, రావు అని, మన తెలుగుకు మించిన ప్రపంచం లేదు, ఉండదు, వద్దు అని అంటున్న, అనుకుంటు(తు)న్న ‘అభిప్రాయాల తెలుగు మధ్యతరగతి మాంద్యం’ కోసం కాదు ఈ వ్యాసం; ‘తెలుగు సంగీత మేధ’ కోసం కాదు ఈ వ్యాసం. ఈ వ్యాసం నా వంటి పామరులకు, సామాన్యులకు, మామూలువాళ్లకు మాత్రమే)

ఈ పాట ప్రభావంతో 1975లో వచ్చిన షోలే సినిమాలోని “మెహబూబా మెహబూబా…”పాటను ఆర్.డీ. బర్మన్ చేశారు. ఆర్.డీ. బర్మన్ కొంత కాపీగా, కొంత అనుకరణగా చేసినా పూర్తి కాపీగా చెయ్యలేదు. ఆర్.డీ. బర్మన్ తన సొంత ప్రతిభను ఆ పాటకు పొదివారు. ఎ.ఆర్. రహ్మాన్ ఆలోచనా సరళిపై ఆర్.డీ. బర్మన్ ప్రభావం ఉండడం ఈ “మెహబూబా మెహబూబా…” పాట తెలియజేస్తుంది.

తమిళ్ష్ దర్శకుడు సెల్వమణి (నటి రోజ భర్త) ఇళైయరాజా (ఇళయరాజా కాదు)ను “మెహబూబా మెహబూబా…” వంటి పాట కావాలని అడిగి తన 1991 సినిమా కాప్టన్ ప్రబాగరన్ (కెప్టన్ ప్రభాకరన్ కాదు)లో ఒక పాటను చేయించుకున్నారు. ఆ ఇళైయరాజా పాట “ఆట్టమా తేరోట్టమా…” ఇళైయరాజా డెమిస్ రూషోస్ “సె యు లవ్ మి …” పాటకు, “మెహబూబా మెహబూబా…” పాటకు భిన్నంగా గొప్పగా చేశారు.

ఎమ్. ఎస్. విశ్వనాద(థ)న్ 1979లో నినైత్తాలే ఇనిక్కుమ్ (తెలుగులో అందమైన అనుభవం) సినిమాలో చేసిన
“శంభో శివ శంభో…” పాట “మెహబూబా మెహబూబా…” పాట ప్రభావంతో చేసిందే అని అనుకున్నవాళ్లున్నారు. అది సరికాదు. “శంభో శివ శంభో…” పాటను ఒక తమిళ్ష్ జానపద పాట ఆధారంగా చేశానని విశ్వనాదన్ స్వయంగా ఆధారం చూపిస్తూ తెలియజేశారు.

డెమిస్ రూషోస్ “సె యు లవ్ మి …” పాటలో పాశ్చాత్య సంగీతంతో పాటు అరబీ జానపదం ప్రస్ఫుటమౌతూంటుంది. అరబీ జానపద సంగీతానికి, తమిళ్ష్ జానపద సంగీతానికి పోలిక ఉండడం గమనార్హం.

వినండి

సె యు లవ్ మి….

మెహబూబా మెహబూబా

ఆట్టమా తేరోట్టమా

శంభో శివ శంభో

https://youtu.be/F_-JgK8mN0k?si=L2HsxodqhuY4FuhP

(వ్యాస రచయిత ప్రముఖ విమర్శకుడు)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here