పెళ్లి పీటల నుంచే రిపోర్టింగుకు

Date:

అమలాపురం రిపోర్టర్ నిబద్ధత
సోర్స్ ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపణ
ఈనాడు-నేను: 28
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)


అది 1993 వ సంవత్సరం. పాశర్లపూడి ఒ.ఎన్.జి.సి. సైట్. ఉన్నట్టుండి ఆయిల్ రిగ్ ఫెడేల్మని పేలింది. అందులోంచి చమురు ఒక్కసారిగా కొన్ని కిలోమీటర్ల మేర చిమ్మింది. మీదపడినదేమిటో ఆ ప్రాంతీయులకు కొద్దిసేపు అర్థం కాలేదు. వేలితో తడిమి చూస్తే, జిడ్దుజిడ్డుగా తగిలింది… అంతా ఆకాశంలోకి చూశారు. అది ఎక్కడినుంచి పడిందా అనే అనుమానంతో… చమురు వర్షం కురిసిందా అనిపించింది. ఈలోగా ఆ ప్రాంతానికి ఒ.ఎన్.జి.సి. వాహనాలు వరుసగా రావడంతో అర్ధమైంది… ఏదో ప్రమాదం సంభవించి ఉంటుందని.
వెంటనే ఆ ప్రాంతం అంతటా చాటింపులు వేయించారు… లౌడ్ స్పీకర్లతో ఆటోలలో తిరుగుతూ ప్రకటించారు. అక్కడి గ్రామాలలోని ఇళ్లలో దీపాలు వెలిగించే ప్రయత్నం చెయ్యవద్దని చెప్పారు.
ఆ సమయంలో అమలాపురం రిపోర్టర్ రామకృష్ణ పెళ్లయ్యింది. పెళ్లయిన మరునాడే ఈ సంఘటన.

అతని స్థానంలో వార్తల సేకరణ పనిని పర్యవేక్షిస్తున్న వ్యక్తి పంపిన రిపోర్ట్ డెస్కుకు అర్థం కాలేదు. అంతా గందరగోళంగా అనిపించడంతో, అప్పటి కోనసీమ డివిజన్ ఇంచార్జి పార్ధసారధి ఆ విషయాన్ని డెస్క్ ఇంచార్జి శర్మ గారితో చెప్పడం ఆయన బ్యూరో ఇంచార్జి గారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లడంతో, ఆయన రామకృష్ణకు ఫోన్ చేశారు. ప్రమాద తీవ్రతను చెప్పగలితే తాను బయలుదేరి వస్తానని చెప్పారు. శర్మ గారు కూడా ఫోన్ చేసి, అత్యవసర పరిస్థితి కాబట్టి వివరాలు కనుక్కోమని అడిగారు. ఈనాడులో గొప్పతనం అదే.. సొంత పనులు సైతం పక్కన పెట్టి విధి నిర్వహణకు నడుంబిగించేలా చేస్తుంది. ఎవరైనా ఇలాంటి పరిస్థితిని ఊహించగలరా… పెళ్లి తరవాత కార్యక్రమాలను పక్కన పెట్టి పనిలో దూకుతారని?. ఈనాడు శిక్షణ అలా ఉంటుంది. ఇక్కడ ఈనాడును పొగడడం కంటే… తన వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి, ట్రబుల్ షూటింగ్ పనిలో పడ్డ రామకృష్ణను ప్రశంసించక తప్పదు.


పని గురించి రామోజీ సూక్తి
ఒక సమీక్ష సమావేశంలో చైర్మన్ రామోజీరావు గారు చెప్పిన మాట ఈ సందర్భంలో జ్ఞాపకం వస్తోంది. ఆ మీటింగుకు ముందే ఒక సహచరుడికి పెళ్లి అయ్యింది. మేనేజర్ ఆ విషయాన్ని రామోజీరావు గారి దృష్టికి తీసుకెళ్లారు. అతనికి శుభాకాంక్షలు చెబుతూ… పని గురించి ఎంత సేపు ఆలోచిస్తావు? అని ప్రశ్నించారు. పనిచేస్తున్నప్పుడు అదే పని కదండీ అన్నాడతను. మిగిలిన సమయంలో ఏమి చేస్తావు… మరో ప్రశ్న దూసుకొచ్చింది. పడుకున్నప్పుడు తప్ప ఎప్పుడైనా ఈనాడు గురించే ఆలోచించాలి.. పనే దైవంగా భావించాలంటూ హితబోధ చేశారు.


రామోజీ మాట నాగస్వరం
అప్పట్లో రామోజీ రావు గారి మాట మాత్రం రామబాణం. సరిగ్గా ఎక్కడ గుచ్చుకోవాలో అక్కడ గుచ్చుకుంటుంది. ఉద్యోగిని సంస్థకు కట్టుబడేలా చేస్తుంది. ఆ మాట ఒక మెస్మరైజర్. నాగస్వరానికి నాగుపాము ఎలా తలాడిస్తుందో అలా ఉద్యోగి ఆడతాడు. ఆ గొంతులో అంత శక్తి ఉంది. చక్కగా పనిచేయడం ప్రారంభిస్తారు. మేమంతా అలా పనిచేసిన వాళ్ళమే. పనిచేసిన వాళ్లందరికీ రివార్డ్స్ రావు. కొందరికే వస్తాయి. ఆ కొద్దిమందిలో రామకృష్ణ ఉన్నాడు. అతను సంస్థకు అంత ఒబ్బిడిగా, పొందికగా, విశ్వాసంగా పనిచేశాడు. అతని పనితీరుకు అద్దం పట్టే ఘటనలు రెండు. ఒకటి పాశర్లపూడి బ్లో అవుట్, రెండు కోనసీమ తుపాను. ఈ రెండు అతనికి రామోజీ దగ్గర గుర్తింపు తెచ్చిపెట్టాయి. అది అతనికి ఈనాడు జర్నలిజం స్కూలు మీదుగా… స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేసే అవకాశాన్ని ఇచ్చింది. అతను అంతే విశ్వాసంతో, సంస్థ పట్ల నిబద్ధతతో పనిచేశాడు.

Machara Ramoji son of A. Ramakrishna
కుమారుడికి రామోజీ పేరు
రామోజీ అంటే రామకృష్ణకు ఎంత గౌరవమో తెలిపే విషయం ఒకటి చెబుతాను. రామకృష్ణ తన కుమారుడికి రామోజీ అని పేరుపెట్టుకున్నాడు. రామకృష్ణ తండ్రి గారి పేరు మాచర రావు. తండ్రి గారి పేరులోని మాచర తీసుకుని దానికి రామోజీ కలిపి ఇద్దరి ఋణం తీర్చుకున్నాడు.

(Machara Rao Father of A. Ramakrishna)

మరొక ఉద్యోగి తన ఇద్దరు పిల్లలకూ రామోజీ రావు గారి అబ్బాయిల పేర్లు కిరణ్, సుమన్ అని పెట్టుకున్నారు. ఇలా రామోజీ రావు గారి పట్ల తమ విశ్వాసాన్ని ప్రకటించేవారు సంస్థలో కనిపిస్తూనే ఉంటారు.

ఇక అసలు విషయంలోకి వస్తాను. కొత్తపెళ్ళికొడుకు రామకృష్ణ పెళ్లి బట్టలతోనే, కార్యరంగంలోకి దిగాడు. తనకు తెలుసున్న ఒ.ఎన్.జి.సి. ఉద్యోగి ద్వారా సమాచారాన్ని రాబట్టాడు. పూర్తిస్థాయిలో వార్త ఇచ్చాడు. ఈనాడులో వచ్చినట్టు మరే పత్రికలోనూ ఆయిల్ బ్లో అవుట్ వార్త రాలేదు. అది ఈనాడుకు గర్వకారణమైంది. ఇంత సవివరంగా, తప్పులు లేకుండా వార్త ఎలా ఇచ్చారనేది ఏ పత్రికకూ అంతుపట్టలేదు. అప్పటి బ్యూరో చీఫ్ నవీన్ గారు అదే మాట చెప్పారు.

ఆయిల్ బ్లో అవుట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు గోతులు తవ్వగా వచ్చిన చమురును డబ్బాల్లో నింపుకుని వెళ్ళిపోయేవారు. దానిని ఆటోలకు ఉపయోగించేవారు. ఈ చమురును ఉపయోగిస్తే ఇంజిన్లు పాడవుతాయని చెప్పినా వినిపించుకునేవారు కాదు. ఇక్కడ పరిస్థితిని అదుపు చేయడం ఎవరి వల్ల కాలేదు. ఈ అంశంపైనే పెద్ద సంఖ్యలో కథనాలు వచ్చేవి. సాంకేతిక అంశాలతో వచ్చిన కథనాలు సరేసరి. ఈ కథనాలతో ఈనాడు ఒక సంచలనాన్ని సృష్టించింది. యూనిట్ ఆఫీస్ నుంచి నవీన్ గారు, స్టాఫ్ రిపోర్టర్లు కూడా వంతుల వారీగా ఆయిల్ బ్లో అవుట్ అయిన ప్రాంతానికి వెళ్లి వచ్చేవారు. ప్రత్యేక కథనాలు, ఈనాడుకు సొంతమైన స్టోరీలు ఇచ్చేవారు. ఆ వార్తలు చదివినప్పుడు, పేపర్లో పబ్లిష్ అయినప్పుడు చూసుకోవడం వింత అనుభూతిని కలిగించేవి.

గత ఎపిసోడ్ లో బ్లో అవుట్ – ఇదీ ఒకటి కాదనేగా మీ అనుమానం.. ఆగండాగండి.. ముందుంది అసలు ఎపిసోడ్…. ఈనాడు క్రెడిబిలిటీని పెంచిన ఒక వార్త వచ్చే భాగంలో…

కోనసీమకు పెద్ద బ్లో…. అవుట్

2 COMMENTS

  1. ఈనాడు లో అప్పటి చైర్మన్ నుండి క్రింది స్థాయి వరకు సిబ్బందిని సంస్థకు బానిసలుగా ఎలా మారుతుందో..ఈ కథనం స్పష్టం చేస్తోంది. అప్పట్టి బ్యూరో నవీన్ గారిని ఈనాడు తీరుపై ప్రశ్నించి అది కూడా ఉన్నది ఉన్నట్లు రాయండి సర్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

మిస్సమ్మకు 70 ఏళ్ళు

ప్రాణం పోసిన పింగళి పాటలుపది పాటలు ఆణిముత్యాలు(డాక్టర్ వైజయంతి పురాణపండ)కంబళి గింబళితల్పం...

కోనసీమకు పెద్ద బ్లో…. అవుట్

ఆరోజు ఉదయించిన రెండో సూర్యుడుప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఘటనఈనాడు - నేను:...

Yet another alarming situation from HMPV

Preventive measures should be taken for public health (Dr. N....

Kejriwal ‘s battle for survival

(Dr Pentapati Pullarao) Delhi will have its state elections in...
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://eastofanfield.com/https://nyonyabesar.com/https://direktoriwisata.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://richmondhardware.com/https://technostrix.com/https://troostcoffeeandtea.com/https://malindoak.co.id/