మెట్రో నిర్మాణానికి కేసీఆర్ నిర్ణయం
31 కిమీ… రూ. 6250 కోట్ల అంచనా
విమానాశ్రయం నుంచి రైట్ ఆఫ్ వే ఏర్పాటు
హైదరాబాద్, నవంబర్ 27: మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద గల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రోకారిడార్ ను విస్తరించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అందులో భాగంగా డిసెంబర్ 9 న సిఎం కెసిఆర్ శంఖుస్థాపన చేయనున్నారు. రానున్న మూడు సంవత్సరాలల్లో మెట్రో ప్రాజెక్టును పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది. ఈ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించనున్నదని సిఎం తెలిపారు.
ఈ మెట్రో.. వయా, బయో డైవర్సిటీ జంక్షన్ కాజాగూడా రోడ్డు ద్వారా ఔటర్ రింగ్ రోడ్డు వద్దగల నానక్ రామ్ గూడ జంక్షన్ మీదుగా వెడుతుంది. విమానాశ్రయం నుంచి ప్రత్యేక మార్గం ద్వారా ( right of way) మెట్రో రైలు నడుస్తుంది.
మొత్తం 31 కిలో మీటర్ల పొడవుతో కూడిన ఈ మెట్రో ప్రాజెక్టు ను రూ.6,250 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్నది. ఈ మార్గం వెంట పలు అంతర్జాతీయ సంస్థలు తమ కార్యాలయాలను నిర్మించుకుంటున్నాయి.