(వ్యూస్ ప్రతినిధి) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంరంభం దశదిశలా వ్యాపించింది. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఉత్సవాలు రాత్రి ముగిశాయి. రాత్రి వర్షం పడుతున్నప్పటికీ కొనసాగాయి. తొలుత ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ముఖ్యమంత్రి, గవర్నర్ రాధాకృష్ణన్ సందర్శించారు. జ్యోతిప్రజ్వలన చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఉత్సవాల దృశ్యమాలికను మీరూ చూడండి.