అధునాత‌న సాంకేతిక కేంద్రాలుగా ఐటీఐలు

Date:

రూ.2,324.21 కోట్ల‌తో ఐటీఐల ఆధునీక‌ర‌ణ‌
మ‌ల్లేప‌ల్లి ఐటీఐలో ఏటీసీల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాప‌న‌
హైదరాబాద్, జూన్ 18 :
ఆధునిక ప‌రిశ్ర‌మ‌ల (ఇండ‌స్ట్రీ 4.0) అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా యువ‌త‌ను తీర్చిదిద్దేందుకుగానూ ఐటీఐల‌ను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఏటీసీ) మార్చాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందుకోసం ఐటీఐల‌ను ఏటీసీలుగా తీర్చిదిద్దాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నిర్ణ‌యించారు. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లోని 65 ఐటీఐల‌ను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం టాటా టెక్నాల‌జీస్ లిమిటెడ్ (టీటీఎల్‌)తో ప‌దేళ్ల‌కుగానూ అవ‌గాహ‌న ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఏటీసీల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం 1.30 గంట‌ల‌కు మ‌ల్లేప‌ల్లి ఐటీఐలో శంకుస్థాప‌న చేశారు. మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో ఐటీఐ స్కిల్ డెవలప్మెంట్ అప్ గ్రేడేషన్ ప్రాజెక్టు కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు, టాటా టెక్నాలజీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్ర  సాధనలో నిరుద్యోగ సమస్య అత్యంత కీలక పాత్ర పోషించిందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐ లు నిరుపయోగం మారాయనీ, ఐటీఐల్లో నేర్పించే నైపుణ్యాలు విద్యార్థులకు ఉపయోగం లేకుండా పోయాయనీ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 40, 50 ఏళ్ల కిందటి నైపుణ్యాలను ఐటీఐల్లో నేర్పిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు, నిరుద్యోగులను తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏటీసీ సెంటర్స్ తన ఆలోచనల నుంచి వచ్చిందేనని వెల్లడించారు. మేం పాలకులు, మీరు బానిసలు అన్న ఆలోచన మాకు లేదనీ, తాము ప్రజా సేవకులమని ఎప్పటికీ మరిచిపోమనీ రేవంత్ తెలిపారు. 40 లక్షల మంది యువతీ యువకులు ఉపాధి లేక రిక్రూట్మెంట్ బోర్డుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. సర్టిఫికెట్ తో పాటూ సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉపాధి లభిస్తుందని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.


ఆయన ఇంకా ఇలా అన్నారు.
కేవలం సర్టిఫికెట్స్  జీవన ప్రమాణాలను పెంచవు.. 
దుబాయ్ లాంటి దేశాలకు వలసలు వెళ్లకుండా ప్రభుత్వం ఉపాధి గ్యారెంటీ ఇస్తుంది… 
టాటా సంస్థ సహకారం తో సాంకేతిక నైపుణ్యాల కోసం 2324 కోట్లతో 65 ఐటీఐల ఐటీసీలు గా మారుస్తున్నాం.. 
విద్యార్థుల శిక్షణ కోసం ముందుకు వచ్చిన టాటా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.. 
ఐటీ రంగంలో ప్రపంచంతో మన తెలుగు వారు పోటీ పడుతున్నారు.


మధ్య తరగతి, దిగువ తరగతి కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించడమే మా బాధ్యత.. 
రాష్ట్రంలోని 65 ఐటీఐలను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్దుతాం…
నైపుణ్యాలను నేర్పించడం ద్వారా నిరుద్యోగులకు భరోసా కల్పిస్తాం…
విద్యార్థిని విద్యార్థులు ఐటీఐల్లో చేరాలి… 
ఈ శాఖ నా దగ్గరే ఉంటుంది.. నేనే పర్యవేక్షిస్తా.. ప్రతి నెలా సమీక్ష నిర్వహిస్తాను అని సీఎం రేవంత్ చెప్పారు.

ఎఐటీసీల‌కు సంబంధించిన ముఖ్య అంశాలు..
65 ఐటీఐల‌ను ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేస్తారు.
ఆధునిక ప‌రిశ్ర‌మ‌ల‌కు అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఏటీసీల్లో యువ‌త‌కు శిక్ష‌ణ ఇస్తారు. ఇందుకోసం ఏటీసీల్లో అధునాత‌న సామ‌గ్రి, సాంకేతిక‌త ఏర్పాటు చేస్తారు.
శిక్ష‌ణ ఇచ్చేందుకు 130 మంది నిపుణుల‌ను టీటీఎల్ నియ‌మిస్తుంది.


ఏటీసీల్లో ఏటా 15,860 మందికి ఆరు ర‌కాల దీర్ఘ కాల (లాంగ్ ట‌ర్మ్‌) కోర్సుల్లో, 31,200 మందికి 23 ర‌కాల స్వ‌ల్ప కాలిక (షార్ట్ ట‌ర్మ్‌) కోర్సుల్లో శిక్ష‌ణ అందిస్తారు.
గ‌త ప‌దేళ్ల‌లో రాష్ట్రంలోని ఐటీఐల్లో కేవ‌లం 1.5 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే శిక్ష‌ణ పొందారు. ఈ ఏటీసీల‌తో రానున్న ప‌దేళ్ల‌లో నాలుగు ల‌క్ష‌ల మంది శిక్ష‌ణ పొందుతారు.
ఐటీఐల‌ను ఏటీసీలుగా మార్చే ప్రాజెక్టు మొత్తం వ్య‌యం రూ.2,324.21 కోట్లు. ఇందులో రాష్ట్ర ప్ర‌భుత్వం వాటా రూ.307.96 కోట్లు (13.26 శాతం) కాగా టీటీఎల్ వాటా రూ.2016.25 కోట్లు (86.74)


ఏటీసీలు కేవలం వివిధ కోర్సుల్లో శిక్ష‌ణకే ప‌రిమితం కాకుండా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా ప‌ని చేస్తాయి. అలాగే ఈ ఏటీసీలు ఔత్సాహిక పారిశ్రామికవేత్త‌లతో పాటు చిన్న‌, సూక్ష్మ‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, భారీ ప‌రిశ్ర‌మ‌ల‌కు సాంకేతిక కేంద్రాలుగానూ (టెక్నాల‌జీ హ‌బ్‌) ప‌ని చేస్తాయి.
ఏటీసీల్లో వివిధ కోర్సుల్లో శిక్ష‌ణ పొందిన వారికి టీటీఎల్ ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పిస్తుంది.
ఏటీసీలు భ‌విష్య‌త్తులో త‌మ సేవ‌ల‌ను పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్ విద్యార్థుల‌కు అంద‌జేస్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గణేశుని పూజిస్తే మౌస్ క్లిక్ చేసినట్టే…

నిరాడంబరుడు… విఘ్నలను తొలగించే రాజు(డా. పురాణపండ వైజయంతి)మౌస్‌ని ఒక్కసారి క్లిక్‌ చేస్తే...

గణేశ మండపాలకు ఉచిత విద్యుత్తు: రేవంత్

ఖైరతాబాద్ వినాయకునికి సీఎం పూజలుహైదరాబాద్, సెప్టెంబర్ 07 : ఖైరతాబాద్ గణేశ...

పదేళ్లలో కానిది ఎనిమిది నెలల్లో సాకారం

సుసాధ్యం చేసిన జర్నలిస్టు బంధు రేవంత్‌రెడ్డిజె.ఎన్.జె. హోసింగ్ సొసైటీకి రేపు భూమి...

విఘ్నాధిపతి రూపం – విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం

(వాడవల్లి శ్రీధర్)శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"శుక్లాంబరధరం అంటే...