ఒకే విడతలో రూ. 2 లక్షల రుణ మాఫీ: రేవంత్

Date:

తుమ్మల, పొంగులేటి ఇచ్చేది మాత్రమే
అధికారిక సమాచారం
కాబినెట్ నిర్ణయాలు వెల్లడించిన సీఎం
హైదరాబాద్, జూన్ 21 :
రుణ మాఫీ చేసి తీరుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. శుక్రవారం కాబినెట్ మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం ఒకే విడతలో రెండు లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేయాలని కాబినెట్ నిర్ణయించినట్టు వెల్లడించారు. మీడియాతో రేవంత్ ఏమన్నారంటే….
 వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీపై కేబినెట్ లో చర్చించాం.
 వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే కాంగ్రెస్ విధానం.


 మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జునఖర్గే..
 కాంగ్రెస్ మాట ఇస్తే అది శిలా శాసనం..
 ఇచ్చిన మాట ప్రకారం ఓకే దఫాలో రూ.2లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
 గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన రుణమాఫీ రూ.28వేల కోట్లు..
 గత ప్రభుత్వం 11 డిసెంబర్ 2018 వరకు కటాఫ్ తేదీతో రుణమాఫీ చేసింది.
 మా ప్రభుత్వం 12 డిసెంబర్ 2018 నుంచి 9 డిసెంబర్ 2023 మధ్యకాలంలో రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది.
 రుణమాఫీకి దాదాపు రూ.31వేల కోట్లు అవసరమవుతోంది.


 రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం రుణమాఫీ చేయాలని నిర్ణయించింది.
 గత ప్రభుత్వం పదేళ్లలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు.
 మా ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటోంది.
 రైతు భరోసాపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి..
 రోడ్లు, కొండలు, గుట్టలకు, రియల్ ఎస్టేట్ భూములకు, ధనికులకు రైతు భరోసా ఇస్తున్నారని చర్చ జరుగుతోంది.
 అందుకే రైతు భరోసాను పారదర్శకంగా అందించేందుకు మంత్రివర్గ ఉపసంఘం నియమించాం.


 ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు, పొంగులేటి సభ్యులుగా కేబినెట్ సబ్ కమిటీని నియమించాం.
జూలై 15లోగా కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తుంది.
 ఈ నివేదికను శాసనసభలో పవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అమలు చేస్తాం.
 మంత్రివర్గ నిర్ణయాలు, ప్రభుత్వ పరిపాలనపరమైన నిర్ణయాలను వెల్లడించే బాధ్యత శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటారు.
 వారిద్దరు ఇచ్చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారం.
 సమచారం ప్రసారం చేసేముందు మీడియా మిత్రులు ఇది గమనించాలి.


 రుణమాఫీపై తినబోతూ రుచులెందుకు..
 రైతు రుణమాఫీ చేసి తీరుతాం.. దీనిపై ఎవరికీ శషబిషలు అవసరం లేదు.
 నియమ నిబంధనలకు సంబంధించి జీవోలో అన్నీ పొందుపరుస్తామని రేవంత్ వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గణేశుని పూజిస్తే మౌస్ క్లిక్ చేసినట్టే…

నిరాడంబరుడు… విఘ్నలను తొలగించే రాజు(డా. పురాణపండ వైజయంతి)మౌస్‌ని ఒక్కసారి క్లిక్‌ చేస్తే...

గణేశ మండపాలకు ఉచిత విద్యుత్తు: రేవంత్

ఖైరతాబాద్ వినాయకునికి సీఎం పూజలుహైదరాబాద్, సెప్టెంబర్ 07 : ఖైరతాబాద్ గణేశ...

పదేళ్లలో కానిది ఎనిమిది నెలల్లో సాకారం

సుసాధ్యం చేసిన జర్నలిస్టు బంధు రేవంత్‌రెడ్డిజె.ఎన్.జె. హోసింగ్ సొసైటీకి రేపు భూమి...

విఘ్నాధిపతి రూపం – విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం

(వాడవల్లి శ్రీధర్)శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజంప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే"శుక్లాంబరధరం అంటే...