సి.ఎస్.కు తెలంగాణ సి.ఎం. కె.సి.ఆర్. ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్ 09 : యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ లకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
ఇందుకు సంబంధించి తక్షణ చర్యల్లో భాగంగా రేపు ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సంబంధిత ఏర్పాట్లు, కార్యాచరణకు చర్యలు చేపట్టాలని సిఎస్ శాంతి కుమారిని సీఎం ఆదేశించారు. గతంలో నిర్వహించిన విధంగానే 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను అన్నింటినీ ప్రారంభించి వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
Date: