అధికారులూ పారాహుషార్

Date:

వరదలపై సి.ఎస్.కు సీఎం ఆదేశాలు
స్కూళ్లకు సెలవు పొడిగింపు
హైదరాబాద్, జులై 20 :
గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున ప్రభుత్వం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసింది.
ఈ నేపథ్యంలో చేపట్టవలసిన అత్యవసర చర్యల పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు సి.ఎస్ శాంతి కుమారికి పలు ఆదేశాలు జారీ చేశారు.
పోలీసు సహా ప్రభుత్వ యంత్రాంగాన్ని సంబంధిత శాఖల ఉన్నతాధికారులను అప్రమత్తం చేస్తూ తక్షణ చర్యలకు ఉపక్రమించాలని ఆదేశించారు.
భధ్రాచలంలో ముంపుకు గురయ్యే అవకాశాలున్న తోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్దంగా వుండాలన్నారు.
గతంలో వరదల సందర్భంగా సమర్థవంతంగా పనిచేసిన అధికారుల సేవలను వినియోగించుకోవాలని సిఎం తెలిపారు. ప్రస్థుతం హైద్రాబాద్ కలెక్టర్ గా పనిచేస్తున్న దురిశెట్టి అనుదీప్ ను తక్షణమే బయలుదేరి భద్రాచలం వెళ్లి అక్కడి పరిస్థితులను బట్టి సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్దంగా వుండాలని సిఎం ఆదేశించారు.
రాష్ట్ర సచివాలయంతో పాటు, కలక్టరేట్ లో ఎమ్మార్వో కార్యాలయాల్లో కంట్రోల్ రూం లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
సహాయక చర్యల కోసం హెలికాఫ్టర్లను ఎన్డీఆర్ ఎఫ్ దళాలను అందుబాటులో వుంచాలని సిఎం ఆదేశించారు. సిఎం ఆదేశాలమేరకు కంట్రోల్ రూం సహా హెలీకాప్టర్లు సంబంధిత సహాయకచర్యలకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లను చేసిన అధికారయంత్రాంగం, భద్రాచలంలో సహాయక చర్యలకు సిద్దంగా వుంది.
రెవిన్యూ, పంచాయితీ రాజ్, వైద్యారోగ్యశాఖ, డిసాస్టర్ మేనేజ్మెంట్, సహా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా వుండాలని , ఇందుకు సంబంధించి సమన్వయం తో తక్షణ చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశించారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని సిఎం కేసీఆర్ ఆదేశించారు.
ఎటువంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా వుందని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

ఎడతెరిపిలేని వర్షాల కారణంగా, జీహెచ్ఎంసీ పరిథిలోని అన్ని రకాల విద్యాసంస్థలు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు ఎల్లుండి (శుక్ర శని వారాలు) రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు ఆదేశించారు. వైద్యం, పాల సరఫరా తదితర అత్యవసర సేవలు కొనసాగుతాయని సిఎం తెలిపారు.
అదే సందర్భంలో…..ప్రయివేట్ సంస్థలు కూడా వారి వారి కార్యాలయాలకు సెలువులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మికశాఖ ను సిఎం కేసీఆర్ ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రిపోర్టర్ సలహా పాటించిన లోక్ సభ స్పీకర్

జిల్లాలో పూర్తైన కీలకమైన వంతెనవేదికపైకి పిలిచి చెప్పిన బాలయోగిఈనాడు - నేను:...

హాసం రాజా అమీన్ సయానీ

ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణహైదరాబాద్, జనవరి 21 : ప్రముఖ పాత్రికేయులు, మ్యూజికాలజిస్ట్,...

ఒ.ఎన్.జి.సి. వెల్ రిగ్గింగ్ ఎలా చేస్తుందంటే…

ఒక మాజీ ఉద్యోగి కథనంపాశర్లపూడి వెల్ తవ్వింది మేడ్ ఇన్ ఇండియా...

నిజాయితీకి ఆహార్యం ఆ రిపోర్టర్

ఆయన పేరే బొబ్బిలి రాధాకృష్ణనేను - ఈనాడు: 31(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి) సంస్థకు...
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://eastofanfield.com/https://nyonyabesar.com/https://direktoriwisata.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://richmondhardware.com/https://technostrix.com/https://troostcoffeeandtea.com/https://malindoak.co.id/