ఎస్టీ రిజర్వేషన్లపై తెలంగాణ జీవో
హైదరాబాద్, అక్టోబర్ 1: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న మాట నిలబెట్టుకున్నారు. గిరిజనులకు ఇస్తానన్న రిజర్వేషన్ను కల్పించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరవాత ఇందుకు సంబంధించిన జీఓ విడుదలైంది. రాష్ట్రం లో ఎస్టీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు తీసుకున్న నిర్ణయం మేరకు, రాష్ట్ర ప్రభుత్వం జీ వో ను జారీ చేసింది.
కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఒకరకంగా కేంద్రాన్ని ఇరుకున పెట్టేదే. కేంద్రం ఈ నిర్ణయాన్ని అంగీకరిస్తుందా లేక ఏమైనా ఇబ్బందులు సృష్టిస్తుందా లేక తాను కూడా అదే బాటలో నడుస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.