ఓ కవి పుంగవా జోహార్లు మీకు

Date:

(డా విడి రాజగోపాల్, 9505690690)
ఒక కవీశ్వరులు కన్నుమూశారు
సాహితీ లోకం కన్నీటిపాలైంది
చూశారా మన సిరివెన్నెల వారి నెలా
సాగనంపుతున్నారో
ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో
ప్రతి కన్నీటి బొట్టు మీకు అభిషేకమే
మీరు నాటిన సాహితీ వనంలోని
ప్రతి చెట్టు రోదిస్తుంది
తెలుగు అక్షరాలు మాతో ఇంత ఇంపుగా పదవిన్యాసం ఇక ఎవరు చేయగలరని
దిగాలుపడి ఉన్నాయి
అందరూ ఏనాడో ఒక నాడు నీ బాట పట్టవలసిందే
నీ పుట్టుక సామాన్యపుట్టుకైనా
సరస్వతీ మాత కటాక్షంతో
నీ కవితా పరిమళాలు ఏకంగా
దర్శక దిగ్గజం విశ్వనాథ్ కు వ్యాపింపజేసి
సిరివెన్నేల సినిమాకై ఆణిముత్యాలు పండించి సిరివెన్నెల గా మారిపోతివి
పదికాలాలు పదిలంగా మదిలో నిలచిపోయే ఎన్నో పాటలు రచించావు
అందుకే సుమా నీ మరణం ఎన్నో హృదయాలను చలింపజేసింది
ఎందరికి అబ్బు ఇలాంటి వీడ్కోలు
ఈ వీడ్కోలు మీకు కాదు సుమా!
మీలోని పాండిత్య సంపదకు ఈ గౌరవం
అందుకే ఎంత సంపద ఉన్నా సాహితీ సంపదకు ధీటుకాదు అన్నది సత్యం
మీహృది పండించిన సుమధుర కవితా సుమాలు కొన్ని గుర్తు చేసుకుందామని
వెర్రి ఆలోచన మాది
చుక్కల్లో ఏచుక్క అందమైందో పట్టుకోగలమా
పరిమళాలు వెదజల్లే పూదోటలో విహరిస్తే
ఏ పుష్పం నుండి ఆ పరిమళం వచ్చిందో తెలుసుగోగలమా!
అలాగే మీ పాటల పూదోటలో
అలా విహరిస్తే ఏపాట మంచిదని చెప్పగలమా!
“విధాత తలపున ప్రభవించినది” అన్న
పాటలో అంతర్లీనమైన భావం నిఘంటువును పెట్టుకుని చదివితే తప్ప అర్ధం కాదే
ఇలాంటి పాటలు పండితుల వీనుల విందుకు రాశావేమో!
మందమైన కవచం క్రింద దాగిన పనస తొనలలాంటివి కదా ఇలాంటి పాటలు
ఆ మధురమైన తీపి రుచించాలంటే
దేవుడిచ్చిన చేతులు సరిపోవు ఓ కత్తో కటారో కావాలి తొనలు తీయడానికి
అలా అని అన్ని పనసతొనలు కాదు
అరటి పండు తిన్నంత సులువుగా అర్ధమయ్యే పాటలు కూడ రాశారు
భాషా పరిమితులను అధిగమించి
“బోటనీ పాఠముంది మ్యాటనీ ఆట ఉంది
దేనికో ఓటు చెప్పరా”…… అంటూ
.”లెక్కలు ఎక్కాలు తెల్వనోళ్లు లక్కుతోని లచ్చలల్ల ముంగిపోతారు పుస్కాల్తో కుస్తీలు పట్టేటోల్లు సర్కారి క్లర్కులై ముర్గిపోతరూ”….అంటూ నేటి సమాజ స్థాయి ఎంత చక్కగా చెప్పావో కదా!
బలపం పట్టిభామ బళ్లో అ ఆ ఇ ఈ నేర్చుకుంటా పంతం పట్టి ప్రేమ ఒళ్లో ఆహా ఓహో పాడుకుంటా” అంటూ శృంగార రసాన్ని పండించావు
“ఇందిరమ్మ ఇంటి పేరు కాదురా గాంధీ..
ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధీ.. 
కరెన్సీ నోట్ మీద….ఇలా నడి రోడ్ మీద
మనం చూస్తున్న బొమ్మ కాదుర గాంధీ
భరత మాత తల రాతను మార్చిన
విధాతరా గాంధీ”
అంటూ గాంధీజీ పై ఎంత అద్భుతమైన పాట ఇచ్చావో కదా!
ఒప్పుకోవద్దురా ఓటమిని” అని యువతకు చక్కని సందేశమిచ్చావు
“నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని
మారదు లోకం మారదు కాలం”
అంటూ శ్రీశ్రీ నీ మరపించావు
సమాజానికి సందేశాలిచ్చే పాటలెన్నోరాశావు అవార్డులపంట పండించావు
మీపాటల సమాహారం జోలికి ఇంతకన్నా ఎక్కువ పోదలచుకోలేదు
ఈ రాతలేవో పైలోకాన రాసుకుంటే
ఎటూ అక్కడే మన బాలూ ఉన్నాడు
స్వర్గసీమలో స్వరాభిషేకం చేసుకోవచ్చని
బిర బిరా గోదారి సముద్రంలో కలసినట్లు
మీరు స్వార్థంతో విధాతను మరీ కోరి వెళ్ళినట్లుంది మాకు ఓ చెంబోలు సీతారామశాస్త్రి కవిపుంగవా!
పోయిరా వయ్యా ఓ కవి పుంగవా
పునర్జన్మ ఉంటే బాలూను వెంటబెట్టుకొని మళ్ళీ రావయ్యా!
(క‌విత ర‌చ‌న రిటైర్డ్ డైరెక్ట‌ర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాల‌జీ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పుష్కర శ్లోకాలు… అన్వేషణ

వేద పండితుల నుంచి సన్నిధానం వరకూగౌతమి గ్రంధాలయం గొప్పదనం….ఈనాడు - నేను:...

రామోజీ వర్కింగ్ స్టైల్ అలా ఉంటుంది…

నాకు ఆయన నుంచి వచ్చిన తొలి ప్రశంస?నేను - ఈనాడు: 15(సుబ్రహ్మణ్యం...

రామోజీ కామెంట్స్ కోసం చకోర పక్షుల్లా….

టీం వర్క్ కు నిదర్శనం సైక్లోన్ వార్తల కవరేజ్ఈనాడు - నేను:...

కర్ఫ్యూలో పరిస్థితులు ఎలా ఉంటాయంటే….

విజయవాడ ఉలికిపాటుకు కారణం?ఈనాడు - నేను: 13(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)పని పూర్తయింది....
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://safepaw.com/https://www.caretuner.com/https://myvetshop.co.za/https://rtxinc.com/https://voice-amplifier.co.uk/https://shamswood.com/