ఐ.పి.ఎల్. బాటలో ఎస్.పి.ఎల్.

Date:

ఇండియన్స్ చేతిలో స్మాషర్స్ స్మాష్
(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)

క్రికెట్ ఇండియాలో ఒక ప్యాషన్. ఐదేళ్ల బుడతడి నుంచి అరవై ఏళ్ల ముదుసలి వరకూ క్రికెట్ అంటే పడి చచ్చిపోతారంటే అతిశయోక్తి లేదు. గల్లీలో అయినా క్రికెట్ దృశ్యం కనిపిస్తే అలా ఒక చూపు వెయ్యకుండా ఉండలేరు. ఎక్కడో జరుగుతుంటేనే కళ్లప్పగించి చూసే వాళ్ళు, వాళ్ళ కాలనీలో జరుగుతుంటే చూడరా? ఎందుకు చూడరు? చూడడం మాట పక్కన పెడితే అసలు మన కాలనీలోనే ఐ.పి.ఎల్. తరహాలో మ్యాచులు ఆడాలనే సంకల్పమే నాటుకుంటే దానికి అడ్డేముంటుంది.


అందుకు ఒక మంచి ఉదాహరణ శిల్ప కాలనీ. అమీన్ పూర్ పరిధిలో కొత్తగా ఏర్పాటైన ఈ కాలనీ ఒకప్పుడు, దుర్గంధానికి చిరునామా. ఈ కాలనీలోని పార్కులైతే డ్రైనేజీ నీటికీ, దోమలకు ఆలవాలం. కానీ ఐక్యత చేయలేని పని ఉండదు కదా. ఈ కాలనీలోని యువత కదిలి రావడంతో ఆ దుస్థితి మారింది. పార్కు చక్కగా రూపుదిద్దుకుంది. మున్సిపాలిటీ సహకారమూ కొంత తోడైంది. ఉద్యానవనంగా మార్చి, వాకింగ్ ట్రాక్, పిల్లలకు గేమ్స్ పెట్టేలోగా… పార్కు దుర్వినియోగం కాకుండా కొందరు యువకులు చూపిన చొరవ… పార్కు స్వరూపాన్ని పూర్తిగా మార్చేసింది. గ్రౌండ్ చదును చేసుకున్నారు. పిచ్ రూపొందించారు. క్రికెట్ ఆడడం ప్రారంభించారు. ఆ సమయంలోనే వారి మదిలో మెదిలింది.


అనుకున్నదే తడవుగా ఐ.పి.ఎల్. తరహాలో ఎస్.పి.ఎల్. (శిల్ప ప్రీమియర్ లీగ్) తలపెట్టారు. తొమ్మిది టీమ్స్ ఏర్పడ్డాయి. ఈ కాలనీలో ఇంచుమించు అందరూ ఐ.టి. ఉద్యోగులే. తమకు అనుకూలమైన తేదీలలో మ్యాచులను నిర్వహించుకుంటూ, లీగ్ పూర్తిచేశారు. శిల్ప ఇండియన్స్ జట్టు ఫైనల్ మ్యాచ్ లో శిల్ప స్మాషర్స్ జట్టును యాభై పరుగుల తేడాతో స్మాష్ చేసి, జయకేతనం ఎగరేసింది.


ఇక్కడ ఎవరు ఎవరిని ఓడించారు.. ఎవరు గెలిచారు అన్నది కాదు… ఐక్యత. డ్యూటీ టైమింగ్సును అడ్జస్ట్ చేసుకుంటూ, క్రీడా స్ఫూర్తిని చాటుతూ, సాగారు. ఒక ఆదర్శాన్ని నెలకొల్పారు. సంకల్పం బలంగా ఉంటే ఏదయినా సాధ్యమేనని నిరూపించారు. పక్క కాలనీల నుంచి కూడా వచ్చి మ్యాచ్ చూశారంటే… ఈ పోటీలు ఎలా సాగాయి అనే అంశం అర్థమవుతుంది. యువతరం కదిలింది అంటూ ఒక రోల్ మోడల్ గా నిలిచారు. ఐక్యంగా ఉంటే సమస్యలను స్మాష్ చేయవచ్చని చేసి చూపించారు. ఈ మ్యాచ్ లను చూసిన కాలనీలోని, బాలలు మేము సైతం అంటున్నారు. శిల్ప చిల్డ్రన్ లీగ్ నిర్వహించాలని కోరుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఎస్.పి.ఎల్. యాజమాన్యం పూనుకుంటే అది కూడా సాకారమవుతుంది. వచ్చేవి సెలవు రోజులు. పిల్లలూ సిద్ధంగా ఉండండి.
(ఎస్.పి.ఎల్. ఫైనల్ మ్యాచ్ అనంతరం బహుమతి ప్రదాన దృశ్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాము.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

China and Trump Tariff war: China has upper hand

(Dr Pentapati Pullarao) The tariff –trade war, started by President...

A Movement of Hearts, Heritage, and Harmony

Culture, Language, Indian, and Connections (CLIC) & International Sweet...

Donald Trump’s Tariff War

(Dr Pentapati Pullarao) Ever since Donald trump was sworn as...

సమయ పాలనతో సాగే రామాయణం

వాల్మీకి సంస్థ కార్యక్రమంలో డాక్టర్ వైజయంతిట్యాంక్ బండ్ పై వాల్మీకి విగ్రహానికి...