ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ స్పందన
నాగార్జున, రామ్ గోపాల్ వర్మ సంచలన చిత్రం ‘శివ’ త్వరలో తెలుగులో మళ్ళీ విడుదల కాబోతోంది. తరువాత హిందీ, తమిళ భాషలలో రిలీజవుతుంది. దీని టీజర్ ఈ నెల 14 న విడుదలయ్యే కూలీ చిత్రంలో ప్రదర్శితమవుతోంది. ప్రేక్షకులు డాల్బీ ఎఫెక్ట్ లో ‘శివ’ ను 4 K దృశ్యాలతో చూడవచ్చు. మూడు దశాబ్దాల తరువాత, భారతదేశంలో ఇప్పటివరకు ఉన్న అత్యుత్తమ చిత్రాలలో ఒకటి మరోసారి చరిత్ర సృష్టించడానికి శివ సిద్ధమవుతోంది. పూర్తిగా ఎ. ఐ. సాంకేతికతలో రూపొందించారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఆర్జీవీ ‘శివ’ ఒక అద్భుతం. ఇది సి.ఎన్.ఎన్.-ఐబిఎన్ లైఫ్ టైం టాప్ హండ్రెడ్ చిత్రాలలో స్థానం సంపాదించింది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో 50 వ వార్షికోత్సవం సందర్భంగా, మళ్ళీ థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.
శివ చిత్రం సౌండును మోనో మిక్స్ నుండి డాల్బీ యాట్మోస్‌లో మార్చారు. అత్యంత ఆధునిక AI ఇంజనీరింగ్ ను దీనికోసం ఉపయోగించారు.

“శివ చిత్రం నాకు ఐకానిక్ రోల్ స్థాయిని ఇచ్చిందని అక్కినేని నాగార్జున వెల్లడించారు. చిత్రంలో తన పాత్రను మర్చిపోలేని విధంగా ఉంటుందన్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా ఈ చిత్రం గొప్పతనం అలాగే నిలిచి ఉంటుందన్నారు. నా సోదరుడు వెంకట్ అక్కినేని, నేను శివ రీ రిలీజును అద్భుతమైన రీతిలో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు.

అన్నపూర్ణ స్టూడియోస్ రీ-రిలీజ్ పై తీసుకున్న నిర్ణయం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. సౌండును ప్రస్తుత ప్రమాణాలకు సరిపోయేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. AI సాంకేతికతను ఉపయోగించి, మోనో మిక్స్ ను డాల్బీ అట్లాస్ లోకి మార్చామని వెల్లడించారు. సరికొత్త సౌండ్ ఎఫెక్ట్స్ తో తీసుకొస్తున్న శివ ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందని ఆర్జీవీ చెప్పారు.

