మధుశ్రీ కథలపై సమీక్షకు పుస్తక రూపం

Date:

అవధానుల మణిబాబు ప్రయత్నంపై ప్రశంసలు
మాదారం:
ఒక పుస్తకానికి సమీక్ష రాయడం పాత పద్దతి. పుస్తక సమీక్షనే ఒక పుస్తకంగా మలచడం కొత్త పద్ధతి. ఈ సమీక్షలో .. ముగింపు ఎలా ఉంటే బాగుంటుంది? కథ బాగుంటే ఎందుకు బాగుంది… బాగోలేకపోతే ఎందుకు బాగోలేదు? వంటి విశ్లేషణలు అందిస్తే…. ఎలా ఉంటుంది… అందుకు అక్షర రూపమే “మధుశ్రీలు చదివాక” పుస్తకం. యానాం కు చెందిన అవధానుల మణిబాబు ఈ కొత్త ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

పల్లిపాలేనికి చెందిన కీ.శే. మధునాపంతుల వెంకటేశ్వర్లు తన ఆలోచనలకు కల్పించిన కథా రూపాలకు ఆయన కుమారుడు కిరణ్ మధునాపంతుల, కుటుంబసభ్యులు 2011 లో పుస్తక రూపాన్నిచ్చారు. ఆ ప్రతిని అందుకున్న అవధానుల మణిబాబు దాదాపుగా పరిశోధన చేశారు. మధుశ్రీలు పుస్తకంలోని కథలను పోలిన కథలను ప్రస్తావిస్తూ తన సమీక్షను రాశారు.

దానికి “మధుశ్రీలు చదివాక” అనే పేరు పెట్టారు. ఈ విశ్లేషణను చూసిన కిరణ్ మధునాపంతుల ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మధుశ్రీలు పుస్తకం కోసం పనిచేసిన వారితో పాటు అందుకు సహకరించిన వారు పాల్గొన్నారు.


పరిగి మండలం మాదారం గ్రామంలో ఉన్న జెడ్.పి. హై స్కూలులో ఈ కార్యక్రమం ఏర్పాటైంది. జెబియా, మధునాపంతుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూలు ఆవరణలో నిర్మించిన మధుశ్రీ హాలులో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పల్లిపాలెం లోని ఆంధ్రీ కుటీర సంచాలకులు మధునాపంతుల సత్యనారాయణ మూర్తి, మధుశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ అల్లంరాజు రామశాస్త్రి, ప్రముఖ కవి శిఖామణి, మధుశ్రీ కుమార్తె పద్మావతి, ఆకుండి రత్న కలికి, మారుతి పౌరోహితం, కిరణ్ మధునాపంతుల “మధుశ్రీలు చదివాక” పుస్తకంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

మణిబాబును సత్కరించారు. సత్కారానికి ముందు మణిబాబు మాట్లాడుతూ, పుస్తక సమీక్ష గ్రంధంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించారు.

మధునాపంతుల చలపతి ఆహ్వానంతో ప్రారంభమైన సభలో కిరణ్ మధునాపంతుల కుమార్తె డాక్టర్ విభ ప్రార్థన గీతాన్ని ఆలపించారు. మధునాపంతుల కుటుంబానికి ఆప్తులు, సన్నిహితులు హాజరైన ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆలూరు విజయలక్ష్మి, డాక్టర్ దశరధ రామిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం అతిథులకు వనభోజనాలు ఏర్పాటుచేశారు. అంతకు ముందు, పల్లిపాలెంలో కిరణ్ మధునాపంతుల తన తల్లి గారు రత్నప్రభ పేరిట ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి మారుతి పౌరోహితం కొన్ని పుస్తకాలను అందజేశారు.

ఈ సందర్భంగా మధునాపంతుల సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ, ఈ గ్రంథాలయాన్ని పరిశోధకులకు ఉపయోగించేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. పరిశోధకులు వచ్చి ఉండేందుకు వీలుగా గ్రంథాలయంలో ఏర్పాట్లు చేసినట్లు కూడా మూర్తి తెలిపారు.

1 COMMENT

  1. ఒక సాహిత్య సభను పూర్తిగా పరిచయం చేసారు.జత పరిచిన ఫోటో లు బాగున్నాయి.అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రోశయ్య గారినే పేరు చెప్పమన్న రిపోర్టర్

తిరుమల అనుభవం చెప్పిన మాజీ సీఎం (Kvs Subrahmanyam)ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ...

అభిమానం మితిమీరితే…

ఆంధ్రపురాణ రచయితకు వింత అనుభవం(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)ప్రముఖ రచయితలకు వింత అనుభవాలు ఎదురవుతుంటాయి....

ప్రభుత్వాన్ని బద్నాం చేస్తే వాత పెట్టండి: సీఎం

ఆరోగ్య ఉత్సవాలకు రేవంత్ శ్రీకారం213 అంబులెన్సులకు పచ్చ జెండాహైదరాబాద్: రాష్ట్ర వైద్య,...

ఇంత రుణమాఫీ చరిత్ర దేశంలో ఉందా… హరీష్

రైతు పండుగలో సవాలు విసిరినా సీఎం రేవంత్కుట్రలు, కుతంత్రాలకు బెదిరేవాణ్ణి కాదుబి.ఆర్.ఎస్....