ట్యాంక్ బండ్ మీద రేవంత్

0
266

నిమజ్జనం తీరుపై పరిశీలనా
(కె.వి.ఎస్. సుబ్రహ్మణ్యం)

ఒక ముఖ్యమంత్రి సాధారణ జనంలో కలిసిపోయి తిరగడం మామూలు విషయం కాదు. దాదాపు నలభై ఐదేళ్ల క్రితం అంటే 1985 లో ఎన్.టి. రామారావు ఇలా వచ్చేశారు. సాధారణ సందర్భంలో అయితే సరే. కానీ, గణేశ నిమజ్జన సమయంలో జనంలోకి వెళ్లిపోవడం అసాధారణమైన పని. ఎన్.టి.ఆర్. తరవాత ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పని చేశారు. శనివారం గణేశ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా రేవంత్ అకస్మాత్తుగా ఎన్.టి.ఆర్. మార్గ్ కి వచ్చేశారు. అతి తక్కువ సెక్యూరిటీతో వచ్చారు. వస్తూనే జనంలో కలిసిపోయారు. సెల్ఫీలు దిగారు. కరచాలనాలూ చేశారు. నిమజ్జనం సాగుతున్న తీరును పరిశీలించారు.

అధికారులతోనూ, పోలీసులతోనూ మాట్లాడారు. ఖైరతాబాద్ గణేశుణ్ణి నిమజ్జనం చేసిన నాలుగో నెంబర్ క్రేన్ వద్ద కాసేపు ఉంది పరిశీలించారు.
అక్కడే ఖైరతాబాద్ గణేశ ఉత్సవ కమిటీ వేదికపైకి వెళ్లారు. గణపతి బప్పా మోరియా అంటూ నినదించారు. మాట్లాడాలంటూ ఉత్సవ కమిటీ చేసిన వినతిని సున్నితంగా తిరస్కరించారు. ఇది మాట్లాడే సందర్భం కాదన్నారు.

కొంతసేపు రోడ్డు మీద నడిచి… పరిశీలించారు. అందరితో కలివిడిగా తిరగడంతో అందరూ ఆసక్తిగా ఆయన వెంట పరుగులు తీశారు. ఆయనను తాకాలని, కరచాలనం చేయాలనీ పోటీ పడ్డారు.ఆయన ఉన్న కొద్దిసేపు… కోలాహలం కొత్త రూపును సంతరించుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here