Revanth performs ganesa Pooja

0
216

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా వినాయక పూజ చేశారు. తన నివాసంలో ఆయన గణేశ పూజ చేసారు. అందుకు సంబంధించిన చిత్ర మాలిక. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలోని విఘ్నాలను తొలగించి అందరికీ ఆనందం, ఐశ్వర్యం, ఆరోగ్యం ప్రసాదించాలని ముఖ్యమంత్రి విఘ్నేశ్వరుడుని ప్రార్థించారు. వాడ వాడల వెలిసే గణేష్ మండపాలలో భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించుకోవాలని కోరారు. ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే మండపాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సంవత్సరం కూడా వినాయకుని మండపాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నదని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here