బోఫోర్స్ భోక్త… దేశ్ కి నేత అన్న పత్రికలోనే…

Date:

ఆరోజు పేపర్ ఎక్కువ ధరకు కొన్నాను
ఈనాడు – నేను: 12
(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)

సుబ్రహ్మణ్యం…సుబ్రహ్మణ్యం… కంగారుగా తట్టిలేపుతోందా ఆకారం.. కళ్ళుతెరిచి చూసేసరికి సారథి… నాకు ఆర్నెల్ల సీనియర్‌.. తెలుసా.. రాజీవ్‌గాంధీని హత్య చేశారు. తమిళనాడులో.. అంతా గందరగోళంగా ఉంది. ఆఫీసునుంచి పరుగెత్తుకుని వచ్చానని రొప్పుతున్నాడు. నాకు కూడా కాళ్ళు ఒక్కసారి చల్లబడ్డాయి. మా వాళ్ళని కూడా లేపి ఇంట్లోకి వెళ్ళిపోయాం.. ఆ వీధి చివర్నే ఉన్న వాళ్ళ బాబయ్య గారింటికి వెళ్ళిపోయాడు సారథి.


అంతా షాక్‌లోనే ఉన్నాం. రాజీవ్ చిర్నవ్వే గుర్తొచ్చింది అందరికీ.. కళ్ళనీళ్ళు పెట్టని వారు లేరు.. నిద్రలేకుండానే తెల్లారింది. రోజూ అయిదు గంటలకల్లా వచ్చే ఈనాడు ఇంటికి రాలేదు.. ప్రింట్‌ కాలేదా.. అది ఈనాడు చరిత్రలో ఊహించలేని పదం.. చూద్దామని రోడ్డుమీదకు వెళ్ళాను. పేపర్‌ బాయ్‌ చుట్టూ జనాలు.. ఆత్రంగా చేతులు చాస్తున్నారు ఈనాడు పేపర్‌ కోసం.. నాకూ ఇమ్మని అడిగా.. పది రూపాయలు..చెప్పాడు బాయ్‌.. అదేమిటి… రూపాయిన్నరేగా… ఇవాళ అదేం లేదు..తీసుకుంటారా వేరే వాళ్ళకి ఇచ్చేయమంటారా.. తప్పేది కాదు.. తీసుకున్నాను.. ఉద్యోగంలో చేరాక మొట్టమొదటిసారి ఈనాడు పేపర్‌ కొన్నా..
మాస్ట్‌ హెడ్‌ కిందకు దింపేశారు..

రాజీవ్‌ దారుణ హత్య

దిగ్భ్రాంతికరమైన వార్తను అత్యద్భుతమైన రీతిలో సమర్పించారు. రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలో హత్య జరిగితే.. ఆ ఫొటోలను తెప్పించుకుని అనితర సాధ్యమైన పనిని అనాయాసంగా చేసింది ఈనాడు.. మిగిలిన పత్రికలకూ ఈనాడుకూ అదే తేడా. వార్త ప్రెజెంటేషన్. ..లో వైవిధ్యత. ఆ రోజు ఆ ఫొటో ప్రచురించకపోతే.. మరుసటి రోజెవరు చూస్తారు.. పోటీలో ఎప్పుడూ ముందుండేది ఈనాడు.. అది ఒక్క రోజులో వచ్చేయలేదు.


శీర్షికల్లో అంతరార్థం
ఆరోజు పత్రిక హెడ్ లైన్ చూసి నవ్వొచ్చింది. బోఫోర్స్ భోక్త దేశ్ కీ నేత శీర్షికతో ఇదే రాజీవ్ గాంధీపై గతంలో వేసిన వార్త గుర్తొకొచ్చింది. బోఫోర్స్ శతఘ్నుల కుంభకోణంలో ఇటలీ సంస్థ నుంచి ముడుపులు అందుకున్నది అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ అన్నది వార్త సారాంశం. అప్పట్లో ఈ వార్త కేవలం రెండు పత్రికలలో మాత్రమే సవివరంగా ఫొటోలతో సహా వచ్చింది. ఈనాడుతో పాటు ద హిందూ. దీనికి కారణం ఆ సమయంలో హిందూ, ఈనాడు పత్రికల మధ్య ఒడంబడిక ఉండడమే. దీనికి అంతర్లీనంగా ఉండే అంశాలు నాకే కాదు, సంస్థలో చాలా మందికి తెలిసి ఉండవు. కుంభకోణంపై హిందూ ప్రచురించిన వార్తను ఈనాడు యధాతధంగా ఇచ్చింది. అప్పట్లో అంత వ్యతిరేకంగా రాసిన ఈనాడు, రాజీవ్ హత్య సంఘటనను అంతకు రెట్టింపు ప్రాధాన్యత ఎందుకు ఇచ్చింది అర్ధం కాలేదు. పాఠకాసక్తి ఒక కారణమైతే… సంఘటన తీవ్రతను ప్రతిబింబింపచేయడం మరొకటి.

రామోజీ సూచనలో నిగూఢార్థాలు
సంస్థలో అందరూ తప్పులు చేశారు…అందరూ రామోజీరావుగారితో తిట్లు తిన్నారు.. ఆయన తిట్టినా అందులో సందేశం ఉండేది..ఆయన ఓ సందర్భంలో చేసిన ఓ సూచన…

తప్పు లు చెయ్‌…. కా నీ చే సి న త ప్పు మ ళ్ళీ చే య కు….
ఎంత నిగూఢార్థముంది ఇందులో…
తప్పులు చేయాలిట.. కానీ చేసిందే మళ్ళీ చేయకూడదట..
మళ్ళీ మళ్ళీ చేస్తే అలవాటు.. దిద్దుకుని ముందుకు సాగితే.. నిపుణత

ఇది పాఠం రెండు…నాకు…

ఇలాంటి పాఠాలే ఈనాడులో ఎందర్నో గొప్పవారిగా తీర్చి దిద్దాయి. ఈనాడును కీర్తి శిఖరాలకు చేర్చాయి. అందులో అందరి కృషీ ఉంది. అంతకు మించి రామోజీరావుగారి అనితర సాధ్యమైన విభిన్న దృక్కోణం ఉంది. మనం రేపటి గురించి మాత్రమే ఆలోచిస్తాం… ఆయన మాత్రం.. ముప్పై సంవత్సరాలు ముందుకెళ్ళేలా ప్రణాళికలు రచిస్తారు.. అదీ ఆయన గొప్పతనం…
అందుకే ఈ నా డు
ఇంతితై వటుడింతై… అన్నట్లు ‘ఎదుగు’తోంది…

ఇప్పుడు దాని వయసు… 51 సంవత్సరాలు…
అందులో నా భాగం 23 సంవత్సరాలు..
ఈనాడు రజతోత్సవంనాడు.. మాకు కలిగిన ఆనందం అంతా.. ఇంతా..కాదు.. 25 గ్రాముల (ఈనాడు) వెండి నాణెం… ఒక నెల జీతం ఆనాడు ఈనాడు ఉద్యోగులందరికీ బోనస్‌గా అందాయి. ఆ ఏడాది అందరికీ మూడు నెలల జీతం ఎక్కువగా అందింది. సాధారణంగా ఎరన్డ్‌ లీవ్స్‌(ఈఎల్స్‌) 90 మించితే మిగిలిన రోజులకు వచ్చే మొత్తాన్ని ఏప్రిల్‌ నెలలో చెల్లించడం ఈనాడుకు అలవాటు.. మరో నెల జీతం దసరాకు బోనస్‌ రూపంలో అందుతుంది. అది ఉద్యోగులకు ఎంతో ఆనందం.. ఎన్ని పత్రికలు అలా ఇస్తున్నాయో చెప్పండి.. తెలుగులో… నాకు తెలుసుండి ఏ పత్రికా ఆ పని చేయడం లేదు..

ఇప్పుడు మళ్ళీ విషయానికి వచ్చేస్తున్నా…
ఉదయం పదిగంటలకే ఆఫీసుకు బయలుదేరా.. సారథి మా ఇంటికి వచ్చాడు. అక్కడినుంచి ఇద్దరం శర్మగారింటికి వెళ్ళాం.. ముగ్గురం కలిసి నడుస్తున్నాం… స్టెల్లా కాలేజీ దగ్గరకి చేరేసరికి బూట్ల చప్పుళ్ళూ… కర్రలతో నేలకు కొడుతున్న శబ్దాలు.. కౌన్‌రే… అనే అరుపులూ.. కంగారు పడలేదు మేం. దగ్గరకొచ్చిన తరవాత… గుర్తింపుకార్డులు చూపించాం. ప్రెస్‌వాలా.. అంటూ ఆఫీసు ఎక్కడ అని అడిగారు.. జావో.. అని చెప్పి ఆగిపోయారు..
చెప్పలేదు కదూ… అప్పుడు ఊళ్లో కర్ఫ్యూ అమల్లో ఉంది… వంగవీటి రంగా హత్యానంతరం పరిణామాలను.. ఇతర సంఘటనలనూ దృష్టిలో ఉంచుకుని రాత్రికి రాత్రే కర్ఫ్యూ పెట్టేశారు. ఆఫీసుకు వెళ్ళే లోగా… మరో మూడు పోలీసు బృందాలు మమ్మల్ని శల్యశోధన చేసి విడిచిపెట్టాయి.
లోపలికి వెళ్ళిన తరవాత.. పని ప్రణాళిక సిద్ధమైపోయింది అప్పటికే..
భోజనాలు రెడీ అయ్యాయి. కర్ఫ్యూ పాస్‌లు అప్పటికప్పుడు ఏర్పాటు చేశారు అందరికీ…

హత్యానంతరం వివిధ ప్రాంతాలలో చెలరేగిన అల్లర్లూ.. హింసాకాండ.. విధ్వంసాలూ… వార్తలను ఫోనులో తీసుకోవడం.. చకచకా రాయడం… జనరల్‌ డెస్కుకు ఇచ్చేయడం… పత్రిక పూర్తయ్యింది. ఇక ఇంటికెళ్ళాలి.. రాత్రి తొమ్మిదిన్నరయ్యింది.

ఇక ఆ రాత్రి ఇంటికి వెళ్ళామా.. లేదా… వెళ్ళిన వారు ఎదుర్కొన్న పరిస్థితి ఏమిటి… వివరాలు రేపు…

రాజీవ్ సభ వార్త ఎలా వచ్చిందంటే…

1 COMMENT

  1. చీమా చీమా ఎందుకు కుట్టావు అంటే నా బంగారు పుట్టలో వెలుపెడితే కుట్టనా అందట.
    ఆ తరువాత చీమ కూడా చచ్చింది అది వేరే సంగతి.
    అదేగా జరిగింది రాజీవ్ గాంధీ హత్య కేసులో.
    ఇక బోఫోర్స్ పొలిటికల్ లోఫర్స్ గురించి చెప్పేది ఏముంటుంది
    మనదేశంలో జనాలు అంతేగా అంతేగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆరోజు డి.ఎన్. ప్రసాద్ ఏం చేశారంటే…?

ఎవరూ లేకున్నా ప్రత్యేక సంచికదీని వెనుక డి.ఎన్. ప్రసాద్ కృషిబాలయోగి మరణించి...

A Premier Rural Development Institute of India

National Institute of Rural Development and Panchayati Raj (NIRD&PR)...

Science for the common man

(Dr. N. Khaleel) Four years ago, Corona shook the world....

Watch CHAVA in a Theatre

(Dr Kamalakar Karamcheti) The Hero is captured by the villain...