వందే రేడియో..!

Date:

(ఎలిశెట్టి సురేష్ కుమార్, 9948546286)

నాలుగు తరాల నెచ్చెలి..
ఇంటింటి జాబిలి..
ఆట..పాట..
విజ్ఞానం..వినోదం..
ఎప్పటికప్పుడు
తాజా వార్తలు
భక్తి…భుక్తి..యుక్తి..ప్రయోక్తి..
అన్నిటికీ ఆ బుల్లి పెట్టే సాధనం
చాన్నాళ్ల పాటు మానవ జీవితాన్ని నడిపిన ఇంధనం..!

నూటొక్క ఏళ్లకు మునుపు
1923 లో ఊపిరి పోసుకున్న రేడియో..ఇంటింటి రోమియో..
తెల్లోడి హయాంలో
బొంబాయిలో పుట్టి
పదమూడేళ్ళ తర్వాత అయింది ఆలిండియా రేడియో
మరో రెండేళ్లలోనే కొట్టింది
ఆకాశవాణి బోణి..
అప్పటి నుంచి మొదలైంది
సరికొత్త బాణి..
ఇంటింటా రేడియోనే రాణి..
అందర్నీ అలరించే అలివేణి!

ప్రతి భ్రాత రేడియో శ్రోతే..
ఎవరు చెప్పినా
మన్ కీ బాతే..
అమ్మ,అమ్మమ్మ
అందరూ రేడియో పిచ్చోళ్లే..
ఎవరి కోటా వారికి..
నీ టేస్టు..నా టేస్టు..
అందరికీ అన్నీ బెస్టు..

అసలు సుప్రభాత సంగీతమే
మధురానుభూతి..
ఇప్పటికీ మనసులను వెంటాడే సజీవ స్రవంతి..
విదేశీయుడు రూపొందించిన
శివరంజని..
రసధుని..మధురధ్వని
ఆ వెంటే ఓ భక్తి గీతం..
తదుపరి సూక్తిముక్తావళి..
ఆపై పొలం పనులు..
నిలయ విద్వాంసుల కచేరీలు..
కాసేపు అలరించే పాటలు..
ఆటలుంటే కామెంటరీ..
లేదంటే విరామం..
మధ్యాహ్నం వార్తలు..
ఆ వెంటే కార్మికుల కార్యక్రమంలో సందడి చేసే
ఉషశ్రీ, చిన్నక్క, ఏకాంబరం..
అప్పుడప్పుడు సినిమాలు..
నాటకాలు…రూపకాలు..
ప్రముఖుల ఇంటర్వ్యూలు..
రాత్రి నిద్రపుచ్చే
ఆపాతమధురాలు..!

మనం వినలేదు గాని
ఇదే రేడియోలో ఖంగుమన్న కొంగర జగ్గయ్య కంఠం..
మనకి తెలిసిన
తిరుమలశెట్టి శ్రీరాములు..
అద్దంకి మన్నార్…
దుగ్గిరాల,కందుకూరి..
ప్రయాగ రామకృష్ణ…
ఉదయాన పాటలు
సమర్పించే కామాక్షి..

ఇక ఇతర భాషలూ
మన గుండె ఘోషలే..
హిందీ వార్తలు చదివే
బరున్ హల్దార్..
సుర్జిత్ సింగ్, సుశీల్ ఝవేరి..
పమెలా సింగ్,లుటిక రత్నం..
క్రికెట్ కామెంటరీ దంచేసే
జస్దేవ్ సింగ్,విజయ్ డేనియల్
బాబూనద్కర్నీ విశ్లేషణలు..
చెవి దగ్గర రేడియో పెట్టుకుని ఆస్వాదించే క్రికెట్ ప్రేమికులు..
స్కోరెంత..!?
చెప్పగానే ఎన్ని ఓవర్లు..
ఇలా ప్రశ్నల పరంపర..
తామర తంపర..
అదో లోకం..రేడియో మైకం..

ఇక మరో రెండు కారెక్టర్లు
రేడియో సూపర్ స్టార్లు..
శ్రీలంక స్టేషన్లో
తెలుగు పాటలు సమర్పించిన
మీనాక్షి పొన్నుదురై..
ముద్దుగా మన భాషలో పలకరించిన ముద్దుగుమ్మ..
కనిపించకుండా వినిపించిన ఆరాధ్యదేవత..
పొంగిపోయిన ప్రతి శ్రోత..
అందరినీ మించి..
బుధవారం రాత్రి..
ఎనిమిది గంటకొట్టేపాటికి
లక్షలాది మందిని
రేడియో ముందు చేర్చిన
సుమధుర స్వరం..
అమీన్ సయాని..
మంత్రముగ్ధం..
పాటల కార్నివాలా..
బినాకా గీత్ మాలా..
హిందీ కొత్త పాటల రంగీలా..!

ఇలా ఎన్నో మధురానుభూతుల రేడియో..
టివి వచ్చాక
తగ్గిందేమో నీ ఠీవి…
మొబైల్ రాకతో
నీ పరిస్దితి మరీ ఎండమావి..
కానీ నువ్వున్నావు
ఎఫ్ ఎం రూపంలో
ఇంకా కొన్ని ఇళ్లలో పాతబడక
మూల పడక…
పాడుతూ..పాటుపడుతూ..
ఆలపిస్తూ..అలరిస్తూ..
ఆకాశవాణి..
నువ్వు ఎప్పటికీ ప్రకాశవాణి..

రేడియో దినోత్సవం సందర్భంగా
ఆ బుల్లి పెట్టెతో అనుబంధాన్ని..
అనుభవాలను..!

అనుభూతులను నెమరువేసుకుంటూ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆర్జీవీపై అసాధారణ రచన ఈ కావ్యం

ఒక అభిమాని సమర్పించిన అక్షర శరం(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి)ఒక్కొక్క సాయంత్రానికి ఒక్కొక్క...

జనజీవనం కకావికలం – కొబ్బరి సీమకు శాపం

కోనసీమ తుపాను మిగిల్చిన విషాదంవార్తాసేకరణలో ఎన్నెన్నో ఇక్కట్లుఈనాడు - నేను: 25(సుబ్రహ్మణ్యం...

అప్పటిదాకా ప్రశాంతం… అంతలోనే ఉత్పాతం

తుపాను ముందు ప్రశాంతతను చూశాం ఈనాడు-నేను: 24 (సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి) అది 1996 నవంబర్...

రాంగోపాలాయణం … ఇది రామాయణం కాదు

రామ్ గోపాల్ వర్మ ఒక సంచలనం. అవరోధాలను అధిగమించడం ఆయనకు వెన్నతో...
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://eastofanfield.com/https://nyonyabesar.com/https://direktoriwisata.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://richmondhardware.com/https://technostrix.com/