క్విట్ టుబాకో… బీ ఏ హీరో

Date:

(ఫిబ్రవరి 4 ప్రపంచ కాన్సర్ దినోత్సవం)

(మాచన రఘునందన్, 9441252121)
“ఏవండి సాయంత్రం సినిమా కి వెళ్దాం ఇంటికి త్వరగా రండి”
సర్లే..అంటూ..సిగరెట్ దమ్ము లాగుతూ …బండిపై కూర్చుని ఆఫీసుకు వెళ్ళిపోయాడు శైలజ భర్త.

“ఈ..నగరానికి ఏ..మైంది..
అంటూ .. మొదలై
గుట్కా బీడీ,సిగరెట్ ఇవి ప్రాణాంతకం అని హెచ్చరించి ముగిసింది
ప్రజా హితం కోసం జారీ చేసిన ప్రకటన.

ఏ సినిమా అయినా..
ఖచ్చితంగా
Smoking is injurious to health
అనే ప్రకటన తో ప్రారంభం కావాల్సిందే.

ఇది ఎందుకు చెప్తున్నానంటే..
20 ఏళ్లుగా పొగాకు నియంత్రణ కు కృషి చేస్తున్న నన్ను ..

“సిగరెట్ మానమని మాకు హిత బోధ చేసే బదులు
ఫ్యాక్టరీలను బంద్ చేయొచ్చు కదా “మాచన”గారు”
అని అన్న వారెందరో..
ఐతే..
జనబాహుళ్యానికి తెలవని ముచ్చట
తెలియాల్సిన సంగతి ఏమిటంటే..
పారిశ్రామిక విధానం ప్రకారం
ప్రభుత్వాల కు , పరిశ్రమలను మూసే హక్కు లేదు.
కాబట్టి
పొగాకు వల్ల, పొగాకు ఉత్పత్తుల వల్ల క్యాన్సర్ రావడం ఖాయం
కాబట్టి చికిత్స కంటే నివారణ శ్రేష్టం అని అంటారు కదా..
సో..
దమ్ము కొట్టడం మానేస్తే?!
మన హృదయం
మన కాలేయం
ఆరోగ్యాలకు మనమే హాని తలపెట్టిన పాపం మనకు అంటదు.

సినిమా మొదలయ్యాక అడపా దడపా దగ్గుతూనే ఉన్నారు హరి.
బోర్ గా అనిపిస్తే..
పాట వస్తే మళ్ళీ బయటకి వెళ్లి దమ్ము కొట్టి వస్తున్నాడు.
ఇదంతా గమనించిన హిమ బిందు
హరి సినిమా వద్దు లే.. ఇంటికి వెళ్దాం పదా అంది.

ఐ..యామ్ సారి,రా.. బిందు
అంటూ
ఏదో చెప్పబోయాడు హరి

ఇపుడు అంటే ఇంటర్వల్ లో నే వచ్చేశాం
మరి జీవితం కూడా ఇంటర్వల్ వరకేనా అన్నది.
కంట్లో నీళ్ళు తుడుచుకుంటూ
వ్యసన పరుడైన శ్రీవారిని ఏమి అనలేక.

దమ్ము కొడితే కాన్సర్ ఎలా వస్తుంది
పొగాకు,పగాకు. ఆరోగ్యం పై పగ బడుతుంది.
దేహం ఎంత ధృఢం గా ఉన్నా..సిగరెట్, బీడీ అలవాటు ఉంటే?! చాలు. పొగాకు దండయాత్ర కు గేట్ తీసినట్టే.
పొగాకు తో క్యాన్సర్ ఎలా వస్తుంది అనే విషయం చెప్పటానికి, తెలుసుకోవటానికి వైద్యం చదవనవసరం లేదన్న సంగతి అంతర్జాలం చెప్పకనే చెపుతుంది. ఈ మధ్య వచ్చిన మైదాన్ హిందీ సినిమాలో హీరో పాత్రలో అజయ్ దేవగన్ దేశానికి మెరికల్లాంటి ఆటగాళ్లను అందిస్తాడు. కానీ ధూమపానం అలవాటు ఉన్న ఓ కోచ్ పొగాకు, ధూమపానం అలవాటుకు ఎలా బలయ్యాడు అని ఆ సినిమా అంతర్లీనంగా చెప్పింది. తెలుగు సినిమాకు అద్భుతం అనదగ్గ పాటలకు సాహిత్యాన్ని, సమ”కూర్చిన” రచయితలు, కవులు, కొందరు దర్శకులు కూడా ధూమపానం వల్లనే చిత్ర పరిశ్రమకు దూరం అయ్యారన్న విషయం చాలా కొద్ది మందికే తెలుసు.
ఒక్కటి చాలు అంటూ.. మొదలెట్టి మెల్లిగా..2,3,4 అలా ..రోజూ డబ్బా ఖాళీ చేసి పర్సు ఖాళీ చేసుకున్న అభాగ్యులు ఉన్నారు.
సిగరెట్, బీడీ తాగితే జబ్బు ఎలా చేస్తుంది అంటే.
దమ్ము కొట్టినపుడు సిగరెట్, బిడి లో నీ పొగాకుతో పెనవేసుకున్న రసాయనాలు శరీరంలోకి ప్రవేశించి కణాల డి ఎన్ ఏ ను నాశనం చేసే పనిలో పడతాయి. సరళంగా చెప్పాలి అంటే ఓ వ్యక్తి జాతకం ఎలా ఉన్నా..సిగరెట్ అలవాటుకు ముందు, ఆ తర్వాత అని చెప్పొచ్చు. దోస్తుల వల్ల దమ్ము కొట్టడానికి అలవాటు అయిన వాళ్లు ఉన్నారు.
అమ్మా, నాన్న లు ఇచ్చే పాకెట్ మనీ తో గుట్టుగా సిగరెట్ కు అలవాటయ్యే కుర్రాళ్లు లేకపోలేదు. జేబులో దండి గా పైసలు ఉన్నా సద్వినియోగం చేసే వారూ ఉన్నారు. కానీ దమ్ము కొట్టే ఒక్కరి వల్ల అతని స్నేహితులు ఆ అలవాటు కు “దగ్గర” అయ్యే అవకాశాలే అధికంగా ఉన్నాయి. అంతే గాక కొన్ని సినిమా ల్లో కూడా హీరో దమ్ము కొడుతూ ఉండే సీన్ లు సైతం యువత ను అటు వైపు ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. అందుకే ముఖ్యమంత్రి పాఠశాల ల్లో కూడా మాదక ద్రవ్య నిరోధ చర్యలు చేపట్టారు.
అయినా..ఎవరో వచ్చి చెప్తే నే ..
“బాబు ఆ అలవాటు మంచిది కాదు మానేయ్” అని చెప్పాల్సిన అగత్యం ఏర్పడింది.

సిగరెట్, బీడీ కాల్చినపుడు వాటి నుంచే వెలువడే రసాయనాలు ఎంతటి ఉక్కు లాంటి కండరాలను సైతం తుప్పు పట్టించే పని లో ఉంటాయి. పటిష్ట మైన ఆరోగ్యం పునాదులను దారుణంగా దెబ్బ తీస్తాయి. కణాలు(సెల్స్)అడ్డగోలుగా పెరిగేలా కారకం అవుతాయి తద్వారా కేన్సర్ కు దారి తీస్తాయి. ఆరోగ్యం గా ఉన్న కణాల డి ఎన్ ఏ ను దెబ్బ తీస్తాయి. అంటే శరీరం ఆకృతి ఇచ్చే కణాల పై ప్రభావం చూపుతాయి. ఓ ఎత్తైన భవనానికి గట్టి పునాది ఎంత ముఖ్యమో. ఓ వ్యక్తి ఆరోగ్యం కు కూడా కణాల ఆరోగ్యం అవశ్యం.
సిగరెట్, బీడీ అలవాటు వల్ల కణాల డి ఎన్ ఏ ను రూటు మార్చే పొగాకు ఉత్పత్తుల రసాయనాలు. ఆ తర్వాత మెల్లిగా రోగ నిరోధక శక్తిని దారుణంగా దెబ్బ తీస్తాయి.దీంతో దేహానికి పోరాడదాం అని ఆశ పడే సత్తా ను కూడా సమాధి చేస్తాయి. వెరసి కణాల పై రాక్షసంగా దండ యాత్ర చేసి. దేహాన్ని జబ్బు ల తో అష్ట దిగ్బంధనం చేసేస్తాయి. రొంపి లో దిగబడ్డ ప్రాణి లా.. ఊపిరి ఆడకుండా చేస్తాయి.
మరి ఊపిరి ఆడకుండా నరకం చూపించే పొగాకు తో దోస్తీ దేనికి.
దూరంగా ఉంటే ఆరోగ్యం తో పాటు ఐశ్వర్య కూడా మన దగ్గరే ఉంటుంది.
కాదంటారా…


(వ్యాస రచయిత పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత, పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తాహశిల్దార్)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Watch CHAVA in a Theatre

(Dr Kamalakar Karamcheti) The Hero is captured by the villain...

మా మద్దతు టీమ్ జేఎన్‌జేకే

తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు మ‌హేష్‌కుమార్‌గౌడ్‌ఈసారి టీమ్ జేఎన్‌జే అభ్య‌ర్థుల‌ను గెలిపించండిఅడ్డంకుల‌న్నీ తొల‌గించి,...

AGOMONI: A Rising Socio-Cultural Force in Suncity

(Dr Shankar Chatterjee) Agomoni Cultural Association established itself as a significant...

First Alumni Meet at a Engineering College in Telangana

Kshatriya College of Engineering (KCEA), Nizamabad District (Dr Shankar...