సమతామూర్తి దేశానికి అంకితం
అంధవిశ్వాసాలను పారదోలిన రామానుజాచార్య
రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ
ముచ్చింతల్, ఫిబ్రవరి 5: రామానుజాచార్యుల విగ్రహం మన చరిత్రను సమున్నతం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ముచ్చింతల్ సమీపంలోని శ్రీరామ్‌నగర్‌లో ఏర్పాటుచేసిన 216 అడుగుల సమతా మూర్తి (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ) విగ్రహాన్ని శనివారం సాయంత్రం ప్రధాన మంత్రి ఆవిష్కరించారు. జ్ఞానం, ధ్యానానికి రామానుజ విగ్రహం ప్రతీక అన్నారు. మనిషి జీవితంలో గురువు అత్యంత కీలకమన్నారు. దేశ సంస్కృతిని రామానుజాచార్య విగ్రహం సుసంపన్న చేస్తున్నారు. ఇక్కడి 108 దివ్య దేశాలనున చూస్తుంటే దేశమంతా తిరిగి అన్ని దేవాలయాలనూ చూసిన అనుభూతి ఇక్కడ కలిగిందన్నారు. రామానుజాచార్యుల బోధనలు అనురసరణీయమనీ, అవి ప్రపంచానికి దారి చూపిస్తున్ఆరనీ చెప్పారు. రామానుజాచార్యులు భావితరాలకు మార్గదర్శిగా నిలిచారన్నారు. గురువే ధ్యాన కేంద్రం అని తెలిపారు. ఈ విగ్రహం రామానుజాచార్యులు ఆదర్శాలకు ప్రతీక అని నరేంద్ర మోడీ తెలిపారు. సంప్రదాయ పంచకట్టు, తిరునామాలతో మోడీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 120 కిలోల సువర్ణ విగ్రహానికి మోడీ పూజలు చేశారు. దేశ ఐక్యత, అఖండతకు రామానుజార్య ఉదాహరణ అన్నారు. అన్నమాచార్య తెలుగులో రామానుజాచార్య గురించి రాశారాన్నారు. భక్తికి కులం, జాతి లేదని రామానుజాచార్యులు చాటి చెప్పారని మోడీ తెలిపారు. జాతి కాదు.. గుణం ముఖ్యమని లోకానికి చాటారన్నారు. 11వ శతాబ్దంలోనే రామానుజాచార్యులు లోక కల్యాణం గురించి ఆలోచించారన్నారు. విశిష్టాద్వైతం దేశానికి శరణ్యమన్నారు. ఆయన అంధ విశ్వాసాలను పారదోలారన్నారు. సమతా సూత్రమే మన రాజ్యాంగానికి స్ఫూర్తి అని పేర్కొన్నారు. చిన జియర్ స్వామి తనతో చేయించిన విశ్వక్సేనేష్ఠి యజ్ఞ ఫలం దేశంలోని 130 కోట్లమందికీ చెందాలని ఆకాంక్షించారు. రామానుజాచార్యుల బోధనలో వైరుధ్యం ఎప్పుడూ కనిపించలేదని తెలిపారు. మన దేశంలో ద్వైతం, అద్వైతం కలిసి ఉన్నాయని మోడీ చెప్పారు.
అసమానాతల రూపుమాపడానికి కృషిచేసిన ఆధునికుడు డాక్టర్ అంబేద్కర్ అని మోడీ ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి త్రిదండి చినజియర్ స్వామి అధ్యక్షత వహించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వరరావు ప్రసంగించారు. తొలుత ప్రధాని మోడీతో చినజియర్ స్వామి ముచింతల్ ఆశ్రమంలో విష్వక్పేనేష్టి యాగాన్ని చేయించారు.
రామానుజుని సమత రాజ్యాంగానికి స్ఫూర్తి
Date: