ఆయన అమాయకుడు అంటున్న మంత్రి రోజా
బాలయ్య బాబు కామెంట్స్‌కు కౌంటర్
తిరుపతి, మే 28: ఏపీ ప్రభుత్వంపై ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా సెల్వమణి కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ మాటలు వింటుంటే ఆయన అమాయకుడా అనిపిస్తోందనీ, జాలి వేస్తోందని అన్నారు రోజా. ఇంతవరకూ నిమ్మకూరుకు రాని బాలయ్య ఇప్పుడు ఎందుకు వచ్చారని ఆమె ప్రశ్నించారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పి, పర్యాటక ప్రదేశంగా రూపుదిద్దాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిన తరవాత బాలకృష్ణలో కదలిక వచ్చిందని ఆమె ఎద్దేవా చేశారు. అందుకే ఆయన నిమ్మకూరు వచ్చారని చెప్పారు. ఇంతకు ముందు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
బాలకృష్ణను చూస్తే జాలేస్తోంది
Date: