(పురాణపండ భాస్కర శ్రీనివాస్)
చిత్రమైన వాతావరణంతో వచ్చింది చైత్రం.
వరాలు కురిపించాలి ఈ నవ వసంతం.
తెలుగు నేల మీద తేనెలొలకు అమృతం.
తిని ఆనందించాలి షడ్రుచుల సమ్మేళనం.
విశ్వావసు నామంతో కలగాలి విశ్వానికి జయం.
వసుధ కలిగించాలి ఈ సంవత్సరం అభయం.
నేడు తొలి వసంత వేళయని కూసింది కోయిల గానం.
లేత ఆకుపచ్చ రంగులతో మురిసింది ప్రకృతి ప్రాణం.
ఓ విశ్వావసు నామమా..! మాకు విజయమ్ములు అందించు.
అంతర్గత శత్రువులైన అరిషడ్వర్గములను అణిచివేయు.
మనోబలాన్ని ఇచ్చి మనసుకు మనోధైర్యం కలిగించు.
సుఖసంపదలిచ్చి సంతోషాలను రెట్టింపు చేయు.
మానవుల మనసుల్లో మతోన్మాదాన్ని తుంచి వేయు.
జనరంజకంగా జీవించేలా మమ్ములను ఆశీర్వదించు.
అడుగంటిన ఆశలు చిగురించేలా ఆనందాన్ని వెలిగించు.
కొత్త ఊహలకు ఊపిరినిచ్చేలా ఉషస్సును సంధించు.
ఈ విశ్వావసు నామ సంవత్సరం అందరికీ మంచి జరిగేలా చూడాలని కోరుకుంటూ..,
మీ..! పురాణపండ భాస్కర శ్రీనివాస్.
(M.A T.P.T D.F.A)
కాకరపర్రు., తూర్పుగోదావరి జిల్లా.
చరవాణి : 9908949429