(డా విడి రాజగోపాల్, 9505690690)
ఈరోజు ఎక్కడ చూసినా
రౌద్రం… రణం… రుధిరం (RRR)
సినిమా ముచ్చటే
మూడొందల కోట్లతో నిర్మాణమట
మొత్తం ఉన్న అన్ని ధియేటర్లలో ఇదేనట
ఎప్పుడో చిన్నప్పుడు
అభిమాన కథానాయకుని చిత్రాలకు
అర్ధరాత్రి వెళ్ళి క్యూలో నిలబడి
సినిమా చూశాం
అదో సరదా మయం
అరవై దశకం దాటి కూడ
మళ్ళీ ఈ ఆర్ ఆర్ ఆర్ రప్పించింది
ఉదయం ఆటకు
ఆరుగంటలకే సినిమా
అప్పుడు టికెట్లకు పాట్లు
ఇప్పుడు ఏర్పాట్లు
బ్రిటీష్ ప్రభుత్వ పాలనపై
చెలరేగిన రౌద్రం
చేయించింది రణం
దాని ఫలితం రుధిరం
రోజూ ఉదయం లేస్తే
ఉదయించే సూర్య కాంతి
వెలుగునిచ్చేది
ఈ రోజు నన్ను చీకట్లోకి తీసుకెళ్ళింది
ఈ సినిమా
నిజంగా బ్రిటిష్ వారి చీకటి రోజులు చూపించింది
అయితే అప్పటి మన పౌరులు
ప్రాణాలకు త్యజించి
ఎలా బ్రిటిష్ వారి గుండెల్లో గునపాలైయింది
చక్కగా చూపారు దర్శకుడు రాజమౌళి
గగుర్పాటు దృశ్యాలు
ఎటుజూసినా త్యాగమయుల త్యాగాలు
నేటి యువత ఇలాంటి సినిమా చూడాలి
వారికి వడ్డించిన విస్తరి అయ్యింది
నేడు వారు అనుభవించే జీవితం
సమాజం అంటే పట్టదు
అలాంటి యువతకు ఓ మేలుకొలుపు
ఈ సినిమా
బ్రిటిష్ వారి అరాచకాలకు పరాకాష్టైన
ఓ సన్నివేశంతో సినిమా సాగుతుంది
ఒక హీరో వారితో పోరాటం చేస్తాడు
ఒక హీరో వారితో కలిసిపోయి
వారిని చాటుగా మట్టుబెట్టాలను కుంటాడు
ఇద్దరి ఆదర్శం బ్రిటిష్ వారిపై తిరుగుబాటే
ఈ ఇద్దరు వీరులు ఏకమై
ఓ చిన్నారిని రక్షించుకోవడంతో
కథ ముగుస్తుంది
యన్టీఆర్, రామచరణ్ పాత్రల్లో జీవించారు
భారతీయ నేరస్థుని చంపడానికి
ఆరు సెంట్లు (పైసలు) ఖరీదు చేసే
బుల్లెట్ ఎందుకు దండగ
అని ఓ సుత్తితో తల పగలగొట్టమంటాడు
ఆ తెల్లదొర
ఇలాంటి సంభాషణలు అనేకం ఆకట్టుకుంటాయి
ఇది అందరూ చూడాలి
బ్రిటిష్ వారి బాధలు కనాలి
వారినుంచి మనకూ స్వతంత్రం తెచ్చిన పోరటవీరులందరికి ఒక్క సారి
జోహార్లు చెప్పండి సినిమా చూశాక
(కవిత రచయిత రిటైర్డ్ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ)