Home క్రీడలు రెజిలింగ్ లో వినీష్ వెలుగులు

రెజిలింగ్ లో వినీష్ వెలుగులు

0
రెజిలింగ్ లో వినీష్ వెలుగులు

భారత్ కు పతకం ఖాయం చేసిన రెజెలర్
(వాడవల్లి శ్రీధర్)

వినేష్ ఫోగాట్ అంచనాలను అందుకుంటూ పారిస్‌ విశ్వ క్రీడల్లో రెజిలింగ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ చరిత్ర సృష్టించింది. 50 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగంలో ఈ స్టార్ రెజ్లర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం (ఆగస్టు 06) రాత్రి జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో వినేశ్‌ ఫోగట్ 5-0 తేడాతో యుస్నీలిస్ లోపెజ్‌ (క్యుబా)పై విజయం సాధించింది. తద్వారా ఈ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకాన్ని ఖాయం చేసింది. ఈ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ విభాగంలో ఇదే తొలి పతకం కానుంది. మూడోసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న 29 ఏళ్ల వినేష్ మంగళవారం (ఆగస్టు 6వ తేదీ) తన పోరాటాన్ని ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్, వరల్డ్ నెంబర్ వన్ యుయ్ సుసాకీ(జపాన్)ను 3-2తో ఓడించింది. చివరి 10 సెకన్లలోనే ఈ విజయానికి కావాల్సిన పాయింట్స్ నమోదు చేయడం విశేషం. అనంతరం అదే జోరులో 7-5తో ఉక్రెయిన్ రెజ్లర్ ఒక్సానా లివాచ్‌ను ఓడించి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. సెమీఫైనల్ మ్యాచ్ లో వినేశ్‌ ఫోగట్ 5-0 తేడాతో యుస్నీలిస్ లోపెజ్‌ (క్యుబా)పై విజయం సాధించింది.
వినేష్ ఫోగాట్ 2016లో రియో ​ జరిగిన ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసింది. మొదటి మ్యాచ్‌లోనే గాయం కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. దీని తర్వాత, అతను సెమీ-ఫైనల్‌కు ముందే టోక్యో ఒలింపిక్స్‌లో ఓడిపోయాయింది. ఇప్పుడు, పారిస్‌లో అద్భుతాలు చేయడం ద్వారా, ఆమె ఒలింపిక్ ఫైనల్‌కు చేరుకున్న మొదటి భారతీయ మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది.

ఆమె ఈ విజయం రెజిలింగ్ ప్యానెల్ మాజీ చైర్మన్ బ్రిజ్ భూషణ్ శరన్ కు చెంపపెట్టు అని రెజ్లర్ భజరంగ్ పూనియా వ్యాఖ్యానించారు. బ్రిజ్ భూషణ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలనూ, ఆ సమయంలో సాగిన రెజ్లర్ల పోరాటంలో ఫోగోట్ కూడా పాల్గొంది. ఈ అంశాన్ని కూడా పూనియా ప్రస్తావించారు. ఆరోజున ప్రభుత్వం వీధిలోకి లాగిన వారిలో ఆమె కూడా ఉంది. ఆమే ఇప్పుడు భారత కీర్తిని విశ్వ వేదికపై చాటింది అంటూ చురకలు వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here