షావుకారు జాన‌కికి ప‌ద్మ‌శ్రీ‌

Date:

ప్ర‌తిభ‌కు ఆల‌స్యంగా గుర్తింపు
తొమ్మిది ప‌దుల వ‌య‌సులోనూ పొంగిపొర్లే ఉత్సాహం
స్వ‌యంగా ఇంటి ప‌ని
వ్యూస్‌తో త‌న అభిప్రాయాల‌ను పంచుకున్న జాన‌కి
(వైజ‌యంతి పురాణ‌పండ‌, 8008551232)
గుర్తింపున‌కు నోచుకోని ఎంద‌రికో బీజేపీ ప్ర‌భుత్వంలో గుర్తింపు ల‌భిస్తోంది. అత్యంత ప్ర‌తిభావంతులు, సామాన్యులు ఎంద‌రో…ఎంద‌రెంద‌రికో బీజేపీ ప్ర‌భుత్వం గుర్తిస్తోంది. అలా వ‌చ్చిన వారిలో ప్ర‌ముఖ న‌టి షావుకారు జాన‌కి ఒక‌రు. ఆమెను ప‌ద్మ‌శ్రీ అవార్డుకు ఎంపిక చేసింది మోడీ ప్ర‌భుత్వం. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని వ్యూస్ ప్ర‌తినిధి డాక్ట‌ర్ వైజ‌యంతి పురాణ‌పండ ఆమెతో మాట్లాడారు. 90 ప‌దుల వ‌య‌సులోనూ చురుగ్గా ప‌నిచేస్తున్న ఆమె ఆరోగ్య ర‌హ‌స్యాన్ని అడిగారు. త‌న‌కు ప‌ద్మ‌శ్రీ ల‌భించ‌డం ప‌ట్ల జాన‌కి సంతోషం వ్య‌క్తంచేశారు.

శంకరమంచి జానకి… షావుకారు చిత్రంతో ఇంటిపేరు మారిపోయింది..
తొమ్మిది పదులు నిండినా ఇప్పటికీ తన పని తనే చేసుకుంటున్నారు..
సంప్రదాయ కుటుంబంలో పుట్టారు.. పదహారవ ఏట వివాహం… 18 సంవత్సరాలకే ప్రథమ సంతానం…
కుటుంబ పోషణ కోసం సినిమా నటిగా జీవితం ప్రారంభం…
మద్రాసు ఆకాశవాణిలో చదివిన కథలతో గుర్తింపు…
ఆ కంఠమే షావుకారు జానకిని నేటికీ నటిగా గుర్తుండిపోయేలా చేసింది…
74 సంవత్సరాల క్రితం నటించిన షావుకారు చిత్రంలోని డైలాగులను నేటికీ అప్పచెబుతున్న షావుకారు జానకి తన ఆరోగ్య రహస్యాలను పంచుకున్నారు. ఆ వివరాలు ఆవిడ మాటల్లోనే…


రాజ‌మండ్రిలో జ‌న‌నం
నేను బ్రిటిషు వారి పరిపాలనా కాలంలో.. 1931 డిసెంబరు 11న తూ. గో. జిల్లా రాజమండ్రిలో పుట్టాను. ఇప్పుడు 89 పూర్తయ్యి 90 కి వచ్చాను. నా బర్త్‌ సర్టిఫికెట్‌ ఇప్పటికీ దాచుకున్నాను. మా కుటుంబాలన్నీ చాలా తరాలుగా రాజమండ్రిలో గోదావరి ఒడ్డున కంభం వారి సత్రం దగ్గర ఉండేవి. మాది చాలా ఆచారవంతుల కుటుంబం. మా అమ్మ మేనమామనే వివాహం చేసుకున్నారు. నేను పుట్టడానికి ముందే నాన్నగారు మూడు సంవత్సరాలు ఇంగ్లాండులో పేపర్‌ మేకింగ్‌ టెక్నాలజీ చదవటానికి వెళ్లారు. ఇంగ్లాండ్‌లో ఉన్నప్పుడు భగవద్గీత, భారతం మీద లెక్చర్లు ఇచ్చేవారు. నా కంటె ముందు అన్నయ్య, అక్కయ్య, ఆ తరవాత, నేను నా తరవాత చెల్లి కృష్ణకుమారి. నాకు చెల్లికి ఏడాది మీద మూడు నెలలు తేడా. అక్కయ్య చాలా చిన్నతనంలోనే కన్నుమూసింది. నాన్న 1930లో ఇంగ్లండ్‌ నుంచి రాజమండ్రి వచ్చి, అక్కడి పేపర్‌ మిల్లులో 13 సంవత్సరాలు పనిచేశారు. ఆ తరవాత చెన్నై వచ్చేశాం. ఆ రోజుల్లో ఈ టెక్నాలజీ కొత్త కాబట్టి, ఉద్యోగం త్వరగా వచ్చింది. ఇంగ్లండ్‌ నుంచి రావటం వల్ల నన్ను, చెల్లెల్ని పాశ్చాత్య పద్ధతుల్లో పెంచారు. టిఫిన్‌ తినటం కూడా అదే పద్ధతి.


మనం తినే భోజనంలోనే ఆరోగ్యం..
అమ్మ పేరు శచీదేవి, చాలా అందంగా ఉండేది. నాన్న టేకుమళ్ల వెంకోజీరావు. మా తాతగారు బెంగాల్, బీహార్‌లలో పనిచేశారు. అమ్మ సెనగ పిండి, కొబ్బరి నూనెలు ఒంటికి పూసి స్నానం చేయించి పెంచారు. అందుకే అమ్మ దగ్గర నుంచి ఆ పద్ధతులు, శుభ్రత అన్నీ అలవడ్డాయి. ఒంటికి పనికొచ్చే ఆహారాన్ని, పరిమితంగా కొలిచి పెట్టేవారు. అందరూ ఆవకాయ, ముద్దపప్పు తింటుంటే, మాకు కూడా తినాలనిపించేది. పెద్దవాళ్లం అయ్యాక.. ఆవకాయ తింటాం అని అడిగి, నెమ్మదిగా మన పద్ధతులలోకి వచ్చాం. అమ్మ చాలా బాగా వంట చేసేది. అమ్మ అన్ని ప్రాంతాల వంటలు బాగా చేసేది. కన్నడ వంటకాలు బాగా ఇష్టపడేవాళ్లం. అమ్మ చేతి వంటలాంటి వంట మళ్లీ ఎక్కడా చూడలేదు. నాన్నగారు నేర్పిన అలవాట్ల కారణంగా టైమింగ్స్‌ బాగా మెయిన్‌టెయిన్‌ చేసేవాళ్లం. తల్లిదండ్రుల నుంచి మంచి అలవాట్లు వచ్చాయి. రాజమండ్రి ప్రభుత్వ గర్ల్స్‌ హైస్కూల్‌లో ఏడో తరగతి వరకు చదువుకున్నాను. ఉద్యోగరీత్యా నాన్నకు ట్రాన్స్‌ఫర్‌లు ఉండటంతో, చాలా రాష్ట్రాలకు మారాం. స్కూల్‌లో చేరటం, ఈలోగా వేరే ఊరు వెళ్లిపోవటం.. ఇలా జరగడంతో చదువు సరిగ్గా సాగలేదు.


అమ్మనాన్నలు అన్నీ నేర్పారు..
నాన్నగారు మా ఇద్దరికీ మంచి ట్రయినింగ్‌ ఇచ్చారు. మాకు పదమూడేళ్లు వచ్చేసరికి అమ్మ మాకు వంట చేయటం నేర్పించింది. మాకు బాధ్యతలు తెలియాలని ఒక్కోసారి కావాలనే మమ్మల్ని ఇంట్లో వదిలి బయటకు వెళ్లేవారు. ఇంక వండుకోవటం తప్పదు కదా. అలా మాకు చిన్నతనంలోనే అన్ని పనులు వచ్చేలా అలవాటు చేశారు. అమ్మ నన్ను కంది పచ్చడి చేయమని అడిగేది. ‘మీ వంట మీరే చేసుకోవాలి’ అనేది. మా నాన్నగారు మాత్రం హిందూ పేపర్‌ చదవమనేవారు. తప్పులు చదివితే చెవి మెలిపెట్టేవారు. నాన్న చాలా స్ట్రిక్ట్‌. చాలా నిజాయితీ ఆఫీసర్‌. బంధువులందరినీ ఆయనే చూసుకోవలసి రావటం వల్ల ఆర్థికంగా బాగా లేకపోయినా, మాకు ఆ ఇబ్బంది తెలియకుండా బాగా పెంచారు. మద్రాసులో ఉన్నప్పుడు ఆంధ్ర మహిళా సభలో మెట్రిక్‌లో చేర్పించారు. నాకు లెక్కలు రావు. డబ్బులు కూడా లెక్క పెట్టుకోలేకపోయేదాన్ని. అందుకని లెక్కలు లేని బెనారస్‌ మెట్రిక్‌లో చేర్పించారు నన్ను. ఆ తరవాత తెలుగు రాయటం, మాట్లాడటం నేర్చుకున్నాను నేను. ఇంట్లో అన్ని విషయాలలోను తర్ఫీదు ఇచ్చేవారు. శుభ్రత, పవిత్రత, మా పనులు మేం చేసుకోవటం, చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాటు. అందుకే ఈ రోజుకీ వంటింట్లో పని నేనే చేసుకుంటాను. నేను వాడుకునే గ్లాసులు, పళ్లాలు అన్నీ నేను శుభ్రం చేసుకుంటాను. తెల్లవారుజామునే నిద్ర లేచి, అన్ని పనులు చేసుకోవటం అలవాటుగా మారిపోయింది. ఇంట్లో అందరూ నిజమే మాట్లాడాలి అనేది నాన్న సిద్ధాంతం.


నాది బాల్య వివాహం…
పదిహేను సంవత్సరాలకే పెళ్లి చేసేశారు నాకు. అందుకు పెద్ద కారణమే ఉంది. నేను మద్రాసు ఆకాశవాణిలో బాలానందం ప్రోగ్రామ్‌కి ఒకసారి ఆడిషన్‌కి వెళ్లాను. అక్కడ రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్యలు నేను చదివే విధానం చూసి వెంటనే చిన్న కార్యక్రమాలు కాకుండా పెద్ద ప్రోగ్రామ్‌కి అప్‌డేట్‌ చేశారు. పెద్ద పెద్ద వాళ్ల స్క్రిప్ట్స్‌ చదివించారు. అలా చిన్నతనంలోనే పెద్ద ప్రోగ్రాములు చేశాను. దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ గారు నా చురుకుతనం చూసి, మా నాన్నతో ‘అమ్మాయికి మంచి టాలెంట్‌ ఉంది, ప్రోత్సహించండి’ అని చెప్పారు. తరవాత అదే నిజం అయ్యింది. రేడియో కార్యక్రమంలో నా గొంతు విన్న బి.ఎన్‌. రెడ్డిగారు, ‘ఈ అమ్మాయి ఎవరు, గొంతు చాలా బావుంది’ అనుకుని చెన్నై ఆకాశవాణికి ఫోన్‌ చేసి, ‘ఈ అమ్మాయి బొద్దుగా ఉంటుందా’ అని అడిగారట. అందుకు రేడియో అక్కయ్యగారు, ‘అమ్మాయి సన్నగా, తెల్లగా, పీలగా ఉంది. బ్రాహ్మల అమ్మాయి’ అని చెప్పారట. ఆయన నన్ను చూడటానికి రేడియోకి వచ్చారు. నన్ను నిలువునా చూశాక, ‘సినిమాలో చేస్తావా’ అని అడిగారు. నాకు అసలు సినిమా అంటేనే తెలియదు, కానీ ఏమీ ఆలోచించకుండా ‘చేస్తాను’ అనే ఠక్కున అనేశాను. ఇంటికి వెళ్లి అమ్మనాన్నలకి చెప్పాను. నన్ను గట్టిగా చీవాట్లు పెట్టి, వెంటనే పెళ్లి చేసేశారు. ఆ తరవాత నాన్నగారు బదిలీ మీద అస్సాం వెళ్లిపోయారు.


విజయవాడలో కొత్త కాపురం…
మా వారి పేరు శ్రీనివాసరావు శంకరమంచి. మేమిద్దరం విజయవాడ సత్యనారాయణపురం వచ్చేశాం. చిన్నదాన్ని, నాకు పెళ్లి అంటేనే తెలియదు, ఇంక ఇల్లు ఎలా నడపాలో ఏం తెలుసు. కూరలు కొని, వంట చేసేదాన్ని. ఆయనకు వంట చేసి పెట్టటమే తెలుసు నాకు అప్పుడు. కాని ఆర్థికంగా ఇబ్బందులు మొదలయ్యాయి. మా వారికి సరైన ఉద్యోగం ఎంత ప్రయత్నించినా దొరకలేదు. మా వారు నాన్నగారితో ఏం మాట్లాడారో నాకు తెలియదు కానీ, నాన్న మమ్మల్ని అస్సాం రమ్మన్నారు. ఇద్దరం కలిసి అస్సాం వెళ్లాం. అక్కడ కొన్నాళ్లు ఉన్నాం. పెళ్లి అయ్యాక పుట్టింట్లో ఉండటం ఇబ్బందిగా అనిపించింది. అక్కడ కూడా మా వారికి ఎంత ప్రయత్నించినా సరైన ఉద్యోగం దొరకలేదు. అక్కడ మా చెల్లి కృష్ణకుమారి చదువుకుంటోంది. తను చదువుకోవటం పూర్తయ్యాక ఆ పుస్తకాలు తీసుకువచ్చి మా వారు నాకు చదువు చెప్పి, నన్ను ప్రైవేట్‌గా పరీక్ష రాయించారు. పగలంతా అమ్మకు సహాయం చేసేదాన్ని. అప్పుడు నాకు 17 సంవత్సరాలు. అక్కడ ఉండగానే ఒకసారి నాకు జ్వరం వస్తే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. నేను ప్రెగ్నెంట్‌ అని చెప్పారు. నిండు నెలలతో, ఓవర్‌కోట్‌ కప్పుకుని గౌహతిలో మెట్రిక్‌ పరీక్ష రాశాను.


చెన్నైలో మేనమామ ఇంట్లో..
ఎక్కువ రోజులు పుట్టింట్లో ఉండటం బావుండదు కనుక అక్కడ నుంచి వెళ్లిపోదాం అని, మద్రాసు మా మేనమామ ఇంటికి వచ్చేశాం. అక్కడే డెలివరీ అయ్యింది. అమ్మాయి పేరు యజ్ఞ ప్రభ. మాకు ఆర్థికంగా అప్పటికీ బాలేదు. ఇక ఎవరి ఇంట్లోనో ఎంత కాలం ఉంటాం. వారికి కూడా ఇబ్బందే కదా. ఒక రోజున మా వారితో, గతంలో నాకు వచ్చిన సినిమా అవకాశం, ఇంట్లో వాళ్లు ఒప్పుకోకపోవటం అన్నీ చెప్పాను. అప్పుడు ఆయన, నటించటం కంటె పాటలు పాడచ్చు కదా అన్నారు. నాకు సంగీతం రాదని, ఇప్పుడు నేర్చుకునే అవకాశం కూడా లేదు కదా అని అన్నాను. ఎలాగైతేనేం చివరకు, నేను నటించటానికి ఒప్పుకున్నారు. అప్పుడు బిఎన్‌ రెడ్డిగారిని కలిశాను. చేతిలో పాపాయి, పక్కన మా వారు. ‘ఏంటి ఇలా వచ్చావు’ అన్నారు. మా ఇబ్బందుల గురించి చెప్పాను. నేను మాట్లాడుతుంటే, ఆయనకు నా కళ్లల్లో మా ఇబ్బంది కనిపించింది. అప్పుడు ఆయన ‘ప్రస్తుతం నేను ఏ సినిమా తీయట్లేదు, మా తమ్ముడు ‘షావుకారు’ అనే సినిమా తీస్తున్నాడు. నువ్వు అక్కడికి వెళ్లు, నేను మాట్లాడతాను’ అని అప్పటికప్పుడు నాగిరెడ్డి గారితో మాట్లాడారు. ఆయన సరే మూవీ టెస్ట్‌ చేద్దామన్నారు. నాకు పెళ్లయింది, పిల్ల ఉంది అని తెలుసుకుని, ‘నీకు పెళ్లి అయింది, పిల్ల కూడా ఉంది, కష్టం కదా’ అన్నారు. నేను చాలా మొండిగా, ధైర్యంగా, నా అవసరం గురించి చెప్పాను. సరేనని మేకప్‌ టెస్ట్‌ చేశారు. నెలరోజులైనా కబురు రాలేదు. ఏమీ చేయలేని పరిస్థితి. ఒకరోజు ఎల్‌. వి. ప్రసాద్, నాగిరెడ్డి, చక్రపాణి గార్లు మా ఇంటికి వచ్చి, ‘ఈమ్మాయ్‌ నీకు వేషం వచ్చింది, మామూలు వేషం కాదు, నువ్వే హీరోయిన్‌’ అన్నారు. నాకు పట్టరాని సంతోషం కలిగింది. విజయవాహినీ సంస్థ ఎంత గొప్పదో తెలిసిందే కదా. నేను చిన్నతనం నుంచి బిబిసి వార్తలు బాగా వినేదాన్ని. వాళ్ల ఇంగ్లీషు మాడ్యులేషన్‌ నన్ను బాగా ప్రభావితం చేసి ఉంటుంది. ఎల్‌ వి ప్రసాద్‌ గారు ఎంతో శ్రద్ధ తీసుకుని, నాకు ట్రయినింగ్‌ ఇచ్చారు. నా డైలాగులు, ఉచ్చారణ, మాడ్యులేషన్, వాయిస్‌ కల్చర్‌ అన్నీ నచ్చాయి ఆయనకి, నన్ను అందరూ మెచ్చుకున్నారు.


షావుకారు నా ఇంటి పేరుగా మారింది…
షావుకారు సినిమా డైలాగులు నాకు ఇంకా గుర్తున్నాయి. ఆ సినిమాలో బాగా చేస్తేనే నిలదొక్కుకోగలను అనుకున్నాను. ఇంట్లో మూడు నెలల పాపను వదిలి, తల్లిగా మానసిక వేదన అనుభవిస్తూ, ఆ సినిమా చేశాను. సినిమాకి నాకు 2500 రూపాయలు ఇచ్చారు. అలా సంసారం నడపటం కోసం సినిమాలలోకి ప్రవేశించాను. నా అభినయం మీద, నా వ్యక్తిత్వం మీద నాకు బాగా నమ్మకం ఉంది. చెత్త పాత్రలు వేయకూడదు, నాలుగుకాలాల పాటు ఉండే పాత్రలు చేస్తూ, అందరి మనసుల్లో స్థానం సంపాదించాలనే దీక్షతో నా పని ప్రారంభించాను. ‘నువ్వు పనికిరావు’ అన్న కె. వి. రెడ్డిగారితో ‘పనికి వస్తావు’ అని అనిపించుకునే స్థాయికి ఎదిగాను. వచ్చిన పాత్రను చేతనైన పద్ధతిలో, గైడెన్స్‌ లేకపోయినా నటించాను.
ఏవిఎం. జెమిని, మోడర్న్‌ థియేటర్‌లలో చేశాను. అన్నీ మంచి బ్యానర్లే. అది నా అదృష్టం.


తమిళంలో గ్లామర్‌ రోల్‌…
పుదియ పరవై అనే తమిళ చిత్రంలో గ్లామర్‌ రోల్‌ వేశాను. ఆ పాత్రకు ముందు చాలా తర్జనభర్జన జరిగింది. శివాజీ గణేశన్‌గారి సొంత సినిమా, ఆయన నా చేత గ్లామర్‌ రోల్‌ చేయిస్తాను అన్నారు. మిగతావారంతా వద్దు, ఆవిడకు నప్పదు అనానరు. అందుకు శివాజీ గణేశన్, ‘జానకి చాలా స్పోర్టివ్‌గా ఉంటుంది. షూటింగ్‌ చేసి చూద్దాం. బాగా లేకపోతే ఆపేయొచ్చు’ అన్నారు. అందులో చాలా మంచి పాత్ర నాది. షూటింగ్‌ చూశాక, అందరూ నన్ను ప్రశంసించారు. అంతవరకు నేను అన్నీ విషాద పాత్రలు, ఏడుపుగొట్టు పాత్రలు చేశాను. ఆ సినిమా నాకు మంచి టర్నింగ్‌. నాకు ఆత్మవిశ్వాసం ఎక్కువ.


బాలచందర్‌ నాటకాలతో గుర్తింపు…
నేను ఎస్టాబ్లిష్‌డ్‌ ఆర్టిస్టుగా ఉండగానే, స్టేజీ నాటకాల కోసం పిలుపు వచ్చింది. ఒక్క పైసా కూడా తీసుకోకుండా 300 నాటకాలు చేశాను. షూటింగ్‌ సాయంత్రం అయిపోగానే, రాత్రి నాటకంలో చేయటానికి వెళ్లిపోయేదాన్ని. ముంబై, ఉత్తర భారతం అంతా తిరిగాను. మంచి గుర్తింపు వచ్చింది. అప్పట్లో బాలచందర్‌గారు నాటకాలు రాసి, దర్శకత్వం చేస్తుండేవారు. ఆయన నాటకాలలో కూడా వేశాను. విచిత్రమేమిటంటే.. ఆ తరవాత నేను ఆయన దర్శకత్వంలో 13 సినిమాలు చేశాను. అలాగే నేను ప్రొడ్యూసర్‌గా బాలచందర్‌ దర్శకత్వంలో సినిమాలు కూడా చేశాను. ఆ తరవాత మురళీమోహన్‌గారి ‘వంట మనిషి కావాలి’ నాటకాన్ని అమెరికా అంతా తిరిగి వేశాం. అలా స్టేజ్‌ మీద కూడా శ్రద్ధ వచ్చింది. ఇప్పటికీ నాకు నాటకాలంటేనే ఇష్టం. అక్కడ ప్రేక్షకుల స్పందన వెంటనే వస్తుంది. 500 సినిమాలు చేసినా, నాటకాల మీద వ్యామోహం పోలేదు.
డాక్టర్‌ అని రాయొద్దన్నాను…
కలైమామణి అవార్డు అందుకున్నాను. అలాగే అరిజోనా యూనివర్సిటీ డాక్టరేట్‌ కూడా వచ్చింది. కాని నేను ఎక్కడా డాక్టర్‌ అని రాయొద్దని చెప్పాను. గౌరవంగా, మర్యాదగా, తృప్తిగా బతకడానికి ఎంత డబ్బు కావాలో అంతే కావాలి అని కోరుకుంటాను.


పిల్ల‌ల‌కు స్వాతంత్రం ఇచ్చా…త‌ప్పు చేస్తే తెలియ‌జెప్పా..
నాకు ముగ్గురు పిల్లలు… యజ్ఞ ప్రభ, వెంకట రమణ, కృష్ణ శశి. పెద్ద మనవరాలు వైష్ణవి చాలా సినిమాలలో వేసింది, పెళ్లయ్యాక మానేసింది. నేను నా పిల్లల విషయాలలో ఎన్నడూ కల్పించుకోను. మనుషులకి స్వేచ్ఛ కావాలి. మనకు పుట్టారు కదా అని టార్చర్‌ పెట్టకూడదు. పిల్లలకు పూర్తి స్వతంత్రం ఇచ్చాను. ఎప్పుడైనా పిల్లలు దారి తప్పుతున్నారు అనుకుంటే, వాళ్లని కూర్చోబెట్టి నెమ్మదిగా చెప్తాను. వింటే వింటారు, లేకపోతే లేదు. ఏం జరిగినా, నేను మాత్రం ఆనందంగా తృప్తిగా ఉంటాను. ఏమీ లేని రోజులను ఎప్పటికీ మరచ్చిపోలేను. ఈ రోజు ఎంత ఆనందంగా ఉన్నానో, ప్రతిరోజూ ఇలాగే గడవనీ అని దేవుడికి దండం పెట్టుకుంటాను. ఆరోగ్యకరమైన భోజనం తింటాను. ఎవరినీ బాధపెట్టను. ఎవ్వరికీ ఫేవర్, సిఫారసు చేయను. ఎవరి టాలెంట్‌ మీద వారు పైకి రావాలని భావిస్తాను. చాలామందికి సహాయం చేయాలను మనసున్నా మనీ ఉండాలి కదా. నాకు వీలైనప్పుడు వృద్ధాశ్రమాలకే కాకుండా ఎవరికైనా సరే, నా పర్సనల్‌ ఖర్చు తగ్గించుకుని సహాయం చేస్తూంటాను. కాని పబ్లిసిటీ ఇష్టం ఉండదు. జీవితంలో కూడా ఆర్భాటంగా ఉండను. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చూస్తూ ఆనందించగలను. తోటలో మొక్కలు, పూలు నాతో మాట్లాడుతుంటాయి. అవి వింటుంటాను. జీవితంలో కష్టం సుఖం అన్నీ చూశాను. కాని కోవిట్‌ వంటిది ఎన్నడూ చూడలేదు. వార్తలు ఫాలో అవుతుంటాను. పేపర్‌ చదవటం అలవాటు. నా జాగ్రత్త నేను తీసుకుంటాను. మా పిల్లలు నా 90 వ పుట్టినరోజు సెలబ్రేట్‌ చేస్తాం, అమెరికా రమ్మన్నారు. కాని నేను రానన్నాను. నాకు నేను, అలాగే అందరూ బావుండాలి.
టెక్నాలజీ తెలియదు…
నేను టెక్నికల్‌గా చాలా పూర్‌. నాకు క్రెడిట్‌ కార్డు లేదు. తెలియని వాటి గురించి, లేని వాటి గురించి తల పాడు చేసుకోను. నాకు ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి, అందుకే నేను శుభ్రం చేసుకుంటాను. టీవీలో నాకు ఇష్టమైన ప్రోగ్రామ్స్‌ చూస్తాను. కొత్త సినిమాలు చూడను. కరోనా వచ్చాక మార్పులు వచ్చాయి. ఇంక సినిమాలు చేయలేదు. కిందటి సంవత్సరం వరకు చేశాను.
వంటలంటే మ‌హా సరదా…
స్వీట్లు తయారుచేస్తుంటాను. అరిసెలు ఇష్టం. అవి చేస్తాను. జెమిని, మా టీవీలలో వంటల కార్యక్రమాలు చాలా చేశాను. నా క్యాసెట్లు పట్టుకెళ్లి, వంటలు నేర్చుకున్నామని అమెరికాలో చాలామంది నాకు చెప్పటం సంతోషం అనిపించింది. కొత్త వంటలు చేస్తుంటే కొత్త వేషం వేసినంత సంతోషంగా ఉంటుంది.


డైట్‌లో మార్పులు…
ఉదయం లేవగానే దండం పెట్టుకుని, కాఫీ, బ్రెడ్, అలవాటు, ఆ తరవా తపేపర్‌ చదవటం. ఇప్పుడు
డైట్‌లో మార్పులు చేసుకున్నాను. కాఫీ మానేసి, వేడినీళ్లు తేనె శొంఠి పొడి, జీలకర్ర పొడి కలిపి గ్లాసుడు నీళ్లు కలుపుకుని, నెమ్మదిగా పేపర్‌ చదువుతూ తాగుతాను. ఇల్లు, వంట గది శుభ్రం చేసుకుంటాను. అన్నీ ప్లాన్‌ చేసుకుంటాం. అలాగే వంట కూడా ప్లాన్‌ చేసుకుంటాను. తిన్నదే తినాలనిపించదు. వెరైటీలు కావాలి. పద్ధతిగా చేసుకుంటాను. తక్కువ చేయటం అలవాటు లేదు. మద్రాసు ఇంట్లో పది మందికి వంట చేసి, షూటింగ్‌కి వెళ్లేదాన్ని. షూటింగ్‌లో బయట తినను కనుక నేను వండుకుని, తీసుకువెళ్లేదాన్ని. ఒకవేళ బయట తినవలసి వస్తే, పళ్లు తినేసేదాన్ని. ఇప్పటికీ నా వంటకోసం పిల్లలు ఎదురుచూస్తారు. స్వయం పాకం, జాగ్రత్త, ఆకలి వేస్తేనే తినటం, లేదంటే మానేయటం… ఈ అలవాట్ల వల్ల నాకు సుగర్‌ బీపీలు లేవు.
స్వీట్స్ అంటే ఇష్టం
స్వీట్స్‌ అంటే ఇష్టం.ఇది తినాలంటే మిగిలినవి కట్‌ చేసేస్తాను,. పెరుగు, అరటి పండు, ఒక కూర/పప్పు/ చారు/పులుసు ఏదో ఒకటి మాత్రమే. వంటను సింప్లిఫై చేసుకుంటాను. నెయ్యి తప్పనిసరిగా ఉండాలి నాకు. అన్నీ పరిమితంగానే తింటే మంచిది. వెన్న, నెయ్యి, పాలు అవసరం. మంచి భోజనం సరిగా తింటే రోజుకొకసారి చాలు. తినాలి కదా అని టైమ్‌టైమ్‌కి తినకూడదు. ఆకలి లేకపోతే చిన్న పండు తిని, మంచినీళ్లు తాగి పడుకుంటే చాలు.
ఏడాదికి 20 సినిమాలు చేశా
సంవత్సరానికి 20 సినిమాలు చేశాను. మూడు ప్రసవాలు జరిగినా, ఎన్నడైనా కెరీర్‌కు ఇబ్బంది రాకుండా చూసుకున్నాను. రెండు మోకాళ్లకు మార్పిడి ఆపరేషన్‌ చేయించుకున్నాను. రావోయి చందమామా సినిమా టైమ్‌లో మేజర్‌ హార్ట్‌ అటాక్‌ వచ్చింది. ఒత్తిడి వల్ల వచ్చిందన్నారు డాక్టర్లు. గుండె ఆపరేషన్‌ అయినా కూడా పని చేస్తూనే ఉన్నాను. ఇంటి పనే నాకు వ్యాయామం. సినిమాలు మరుగున పడినా.. ఇంటి పనే నాకు పెద్ద వ్యాయామం. శరీర భాగాలకు పని పెట్టడమేనాకు వ్యాయామం. గార్డెన్‌లో నడవటం, తోటపని చేయటం…


దైవ భ‌క్తి ఉంది… మూఢ న‌మ్మ‌కాల్లేవు
దేవుడి మీద భక్తి ఉంది. భక్తి, మూఢ నమ్మకాలు లేవు. దేవుడి మీద, నా మీద నాకు నమ్మకం. దేవుడికి సరెండర్‌ అయిపోతే, మంచి ఆలోచనలు వస్తాయి. చిన్నతనంలో నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే, రియాక్ట్‌ అయ్యేదాన్ని. ఇప్పుడు తప్పులు చేస్తుంటే క్షమించేయటం, మంచితనంతో మార్చటం అలవాటు చేసుకున్నాను. వినకపోతే వాళ్ల కర్మ అని వదిలేస్తాను. ఎవరికైనా పని చేస్తానని ప్రామిస్‌ చేస్తే, అది నెరవేర్చేవరకు నిద్ర పట్టదు. అపాత్రదానం చేయను.
భ‌గ‌వంతుడు నాతోనే ఉన్నాడ‌నుకుంటా…
నేను అనుకున్నవి బాబా బోధిస్తే సంతోషంగా అనిపించేది. ఆయన నన్ను ప్రశంసించేవారు.
నేను ఒంటరిగా ఉన్నాను అనుకోను, భగవంతుడు నాతోనే ఉన్నాడనుకుంటాను. బాబా పటం నుంచి విభూతి వస్తోంది. అదే ధరిస్తాను నేను. మంచి ఆలోచనలతో ఉంటే దేవుడు ఇక్కడే ఉన్నాడు. ఎక్కడికీ వెళ్లక్కర్లేదనేది నా నమ్మకం. కరోనా వచ్చాక అందరూ ఇంట్లోనే పూజలు చేసుకున్నారు కదా.
మా కుటుంబం నుంచి ఎవ్వరూ నన్ను ప్రోత్సహించలేదు. నేను పట్టించుకోలేదు. పబ్లిక్‌ మెచ్చుకున్నారు.
వృత్తి పట్ల డెడికేషన్, మిగిలిన వాటిని మూసేసింది. నా కష్టాలు ఎవ్వరికీ తెలియనివ్వలేదు. ఆకలి, పస్తులుండటం, సెట్‌ మీద కళ్లు తిరిగి పడిపోవటం, అన్నీ జరిగాయి. నా జీవితంలో పడిన ఇబ్బందులు తెలిసి ఒకరు, ‘తల్లిగా బతికింది’ అని నా మీద ఒక కార్యక్రమం చేశారు.


ప‌ద్నాలుగేళ్ళ పిల్ల‌లా ఉన్నావ‌న్న కెవి రెడ్డి
కె. వి. రెడ్డిగారు నన్ను చూసి 18 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాల పిల్లలా ఉన్నావు, ఇంతకీ మీది ఏ ఊరు’ అని అడిగారు. ‘రాజమండ్రి’ అని చెప్పాను. ‘బట్టలు సద్దుకుని మీ ఊరు వెళ్లిపో’ అన్నారు. ఆ తరవాత జెమినిలో అవకాశం వచ్చింది. తమిళంలో 1951లో హీరోయిన్‌గా మొట్టమొదటిసారి చేశాను. ఇక అక్కడ నుంచి తిరిగి చూసుకోలేదు. కన్నడ, తమిళం, తెలుగు… అన్ని భాషలలో చేశాను. ఒకసారి అనుకోకుండా ఒక అవకాశం వచ్చింది. పుల్లయ్యగారి దర్శకత్వంలో ‘వెంకటేశ్వర మహాత్మ్యం’ షూటింగ్‌ జరుగుతోంది. అందులో ఎరుకలసాని వేషం కోసం చూస్తున్నారు. ఆ రోజు సాయంత్రం షూటింగ్‌ అయితే, మధ్యాహ్నం నాకు చెప్పారు. నేను ఆ భాష మాట్లాగలనా అని భయపడ్డాను.

పుల్లయ్యగారు ధైర్యం చెప్పి, నాకు ట్రయినింగ్‌ ఇచ్చారు. పదిహేను నిమిషాల పాత్ర. చెప్పినది చెప్పినట్లుగా నేర్చుకున్నాను. ఆ సినిమా చూసిన కె. వి. రెడ్డిగారు తన మాటను వెనక్కు తీసుకుంటాను అన్నారు. ఎంతో సంతోషించాను. అది నాకు నిజమైన సినిమా అనుకుంటాను ఇప్పటికీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ప్రభువు మనసెరిగి ప్రవర్తించకుంటే…

ఉద్యోగుల పాలిట శాపంబ్లాక్ లిస్టులోకి నా పేరుఈనాడు-నేను: 19(సుబ్రహ్మణ్యం వి. ఎస్....

రామోజీ ఆగ్రహించిన వేళ…

సమీక్ష సమావేశాల తీరు అలా ఉంటుంది…ఈనాడు - నేను: 18(సుబ్రహ్మణ్యం వి.ఎస్....

My Memories with Dr. Manmohan Singh

This young Political Strategist from Visakhapatnam shares his experience...

రెండు పుష్కరాలు నేర్పిన అక్షరాలు

కృష్ణా పుష్కర దీపికకు పనిచేసిన విధానం…రాజమండ్రిలో దివ్యానుభూతిఈనాడు - నేను: 17(సుబ్రహ్మణ్యం...
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://richmondhardware.com/https://revolo.co.uk/video/https://apollog.uk/top/https://abroadnext.global/m/https://optimalqatar.me/https://pixelpayments.com/https://plinyrealty.com/https://ilkaylaw.com/https://mycovinadentists.com/https://www.callnovodesk.com/https://www.untax.com/https://www.socialhire.io/https://www.therosenthallaw.com/https://www.charlietakesanadventure.com/https://www.hausefbt.com/https://www.tripvacationrentals.com/https://tfm.digital/https://teethinadayuk.com/https://schrijnwerkerschoten.be/https://daddara.in/file/https://www.atsenvironmental.com/