స‌మ‌స్య‌లు తెలుసుకుని ప‌థ‌కాల రూప‌క‌ల్ప‌న‌

Date:

సీఎం జ‌గ‌న్‌పై నోబెల్ బ‌హుమ‌తి గ్ర‌హీత డ‌ఫ్లో ప్ర‌శంస‌ల వ‌ర్షం
సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాల దిశ‌గా జగన్‌ సర్కారు అడుగులు
ప్రభుత్వంతో పనిచేయనున్న ఎస్త‌ర్ డ‌ఫ్లో బృందం
ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌తో భేటీ
అమరావతి, మార్చి 28:
ఏపీ ఆర్థిక ప్ర‌గ‌తికి ఉప‌క‌రించే దిశ‌గా కీల‌క‌మైన అడుగు ప‌డింది. ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బ‌హుమ‌తి గ్రహీత‌, ఎంఐటీ ప్రొఫెసర్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక వేత్త ప్రొఫెసర్ అయిన ఎస్తర్‌ డఫ్లో త‌న బృందంతో సోమ‌వారం అమ‌రావ‌తికి విచ్చేశారు. రాష్ట్రం సుస్థిర ఆర్థిక ప్ర‌గ‌తి ల‌క్ష్యాల దిశ‌గా అడుగులు వేసేందుకు ఆమె అమ‌రావ‌తి ప‌ర్య‌ట‌న ఆలంబ‌న‌గా నిలుస్తుంది. ఈ అంశంలో ఏపీ ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేయనున్న‌ట్లు ఎస్త‌ర్ డ‌ఫ్లో ప్ర‌క‌టించారు. క్యాంప్ కార్యాల‌యంలో ఆమె సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణం, మహిళా సాధికారిత అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలను, అమలు చేస్తున్న కార్యక్రమాలను, పథకాలను ఎస్తర్‌ డఫ్లో బృందానికి వివరించారు. ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలను ఎస్త‌ర్ ప్రశంసించారు.


పాదయాత్రలో సీఎం క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని అర్థంచేసుకుని ప్రభుత్వ పథకాలన్నీ రూపొందించారని ఎస్తర్‌ డఫ్లో కితాబునిచ్చారు. గదిలో కూర్చుని సీఎం పథకాలకు రూపకల్పన చేయలేదన్నారు. అలా చేసుంటే కేవలం థియరిటికల్‌గా ఉంటాయని చెప్పారు. అర్హులంద‌రికీ ప‌థ‌కాలు అందేలా ముఖ్యమంత్రి తీసుకుంటున్న చొరవ ఆయన గొప్ప ఆలోచనా దృక్పథాన్ని వెల్లడిస్తోంద‌న్నారు ఎస్తర్‌ డఫ్లో. పేదరికాన్ని నిర్మూలించాలనే ఆయన అంకితభావాన్ని ఇది సూచిస్తోంద‌న్నారు. డీబీటీ స్కీంల్లో అధికభాగం నేరుగా మహిళల ఖాతాల్లోకి వేయడం, అలాగే గృహనిర్మాణంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అన్నది.. కేవలం మహిళా సాధికారికతకే కాదనీ, కుటుంబాలు అన్ని విధాల సుస్థిరమవుతాయ‌ని చెప్పారు. సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల అమలు తీరు, దాని ప్రభావంపై అధ్య‌య‌నం చేసి, సలహాలు కోరడం అనేది కూడా సీఎంగా ఆయనకున్న దార్శనికతకు నిరద్శనమ‌న్నారు.


క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించి సూచ‌న‌లు చేస్తాం
పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి సీఎం పథకాలు పెట్టారు కాబట్టి… ఏం చేయాలన్నదానిపై మేం పెద్దగా దృష్టిపెట్టాల్సిన అవసరం లేదని డ‌ఫ్లో చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి.. వాటిని బలోపేతం చేయ‌డానికి సలహాలు సూచనలు ఇస్తామ‌ని తెలిపారు.


నిర్మాణాత్మ‌క స‌మావేశం
ముఖ్యమంత్రితో నిర్మాణాత్మకంగా చాలా చక్కటి సమావేశం జరిగింద‌నీ, ఆయన చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి తెలుసుకున్నామ‌నీ డ‌ఫ్లో చెప్పారు. ముఖ్యమంత్రిగారితోపాటు, ఆయనతో కలిసి పనిచేస్తున్న అధికారుల బృందాన్ని కూడా కలుసుకున్నామ‌నీ, వివిధ అంశాలపై భవిష్యత్తులో వారితో కలిసి పనిచేయడంపైనా దృష్టి పెడుతున్నామ‌నీ వివ‌రించారు. పేదల అభ్యున్నతికోసం చేస్తున్న కార్యక్రమాలను సీఎం తెలియ‌జేశార‌న్నారు.

వారి కనీస అవసరాలను తీర్చడానికి, సుస్థిర ఆర్థిక ప్రగతికోసం, చేపడుతున్న కార్యక్రమాల గురించి చెప్పార‌న్నారు. స్వీయ అనుభవాలను కూడా సీఎం త‌మ‌తో పంచుకున్నార‌ని డ‌ఫ్లో చెప్పారు. పేదరికాన్ని నిర్మూలించి ప్రజల జీవన స్థితిగతులను పెంచే లక్ష్యంతో వారితో కలిసి పనిచేస్తామ‌ని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అమలు చేస్తున్న పథకాలు విశేషంగా ఆకట్టుకున్నాయన్నారు.

వివిధ అంశాలపై ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌కున్న పరిజ్ఞానం త‌మ‌ను ఆకట్టుకుంద‌ని చెప్పారు. గొప్ప అంకిత భావంతో ఆయన ప‌నిచేస్తున్నార‌న్నారు. గడచిన 15 ఏళ్లుగా వివిధ రంగాల్లో జె–పాల్‌ పనిచేస్తోంద‌నీ. తాము మొత్తం 20 రాష్ట్రాల్లో పనిచేస్తున్నామ‌నీ తెలిపారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్‌లో పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని అంశాల్లో పనిచేస్తున్న‌ట్లు చెప్పారు.


జె-పాల్ అంటే….
జె–పాల్‌ అంటే ది అబ్దుల్‌ లతీఫ్‌ జమీల్‌ పావర్టీ యాక్షన్‌ ల్యాబ్‌. దీనికి ఎస్తర్‌ డఫ్లో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. సహ వ్యవస్థాపకురాలు కూడా. దక్షిణాసియాకు సంబంధించి జె–పాల్‌ తరఫున సైంటిఫిక్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా వ్యవహరిస్తున్నారు.


ఆర్థిక ప్ర‌గ‌తి ల‌క్ష్యాలు వివ‌రించిన సీఎస్
ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాలకు సంబంధించిన వివరాలను డ‌ఫ్లో బృందానికి చీఫ్ సెక్ర‌ట‌రీ సమీర్‌ శర్మ వివ‌రించారు. లక్ష్యాల సాధ‌న‌కు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను తెలియ‌జేశారు.

ఈ సమావేశంలో ఎస్తర్‌ డఫ్లోతో పాటు ఆమె బృంద సభ్యులు శోభిని ముఖర్జీ, కపిల్‌ విశ్వనాథన్, అపర్ణ కృష్ణన్, కునాల్‌ శర్మతో పాటు చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

రిపోర్టర్ సలహా పాటించిన లోక్ సభ స్పీకర్

జిల్లాలో పూర్తైన కీలకమైన వంతెనవేదికపైకి పిలిచి చెప్పిన బాలయోగిఈనాడు - నేను:...

హాసం రాజా అమీన్ సయానీ

ఆపాతమధురం -2 పుస్తకావిష్కరణహైదరాబాద్, జనవరి 21 : ప్రముఖ పాత్రికేయులు, మ్యూజికాలజిస్ట్,...

ఒ.ఎన్.జి.సి. వెల్ రిగ్గింగ్ ఎలా చేస్తుందంటే…

ఒక మాజీ ఉద్యోగి కథనంపాశర్లపూడి వెల్ తవ్వింది మేడ్ ఇన్ ఇండియా...

నిజాయితీకి ఆహార్యం ఆ రిపోర్టర్

ఆయన పేరే బొబ్బిలి రాధాకృష్ణనేను - ఈనాడు: 31(సుబ్రహ్మణ్యం వి.ఎస్. కూచిమంచి) సంస్థకు...
slothttps://www.rajschool.com/slot onlinehttps://sai-ban.com/https://britoli.com/https://www.anabias.com/https://bcrbltd.com/https://s2aconsultingfze.com/https://rock-poker.com/https://koinhoki88.org/https://koinhoki88.net/https://rawsolla.com/https://koinhoki888.com/https://koinhoki88.com/https://infomedan.net/qqplazaslot gacorslot gacor koinhoki88slot gacor terbaru koinhoki88koinhoki88koinhoki88slot777https://usfinancehelp.com/https://collectingdiecasttoystoday.com/https://nyonyaguru.com/https://topindo-pulsa.com/https://gojekonline.com/https://dafrastar.com/https://www.reliantholdings.net/https://www.opalcitysview.com/https://lumarca.info/https://alt-qqaxioo.com/https://www.capuletlondon.com/https://www.tithaimart.com/https://www.trungvuongus.com/https://tropicalbioenergy.com/https://www.capitol-peak.com/https://pisswife.com/https://gamvipvn.com/https://www.elfutbolesnuestro.com/https://ampdsmart.com/https://schiffsilver.com/https://theicemall.com/https://shebenik.com/https://popvoxawards.com/https://www.adwebconsultancy.com/https://www.technotchsolutions.com/https://threekookaburras.com/https://marcjacobsonsale.com/https://www.forexrehberim.net/https://dreamlifefactory.com/https://www.videosocialcreative.com/https://www.oregonwetlands.net/https://www.americaneve.com/https://www.iamthelongtail.com/https://www.privatelivesbroadway.com/https://travelamateurs.com/https://sustaintheline.com/https://geekforcefive.com/https://galaksinews.com/https://sejutateknologi.com/https://harimausumateranews.com/https://diarysaham.com/https://lacakonline.com/https://undangansah.com/https://kottakkalayurvedapharmacy.com/https://kabforums.org/https://bhootmedia.com/https://erectie-goedkoop.com/https://heylink.me/Bandargaming-/https://qqcrownbos.com/https://eastofanfield.com/https://nyonyabesar.com/https://direktoriwisata.com/https://bbqburgersmore.com/https://bjwentkers.com/https://mareksmarcoisland.com/https://richmondhardware.com/https://technostrix.com/https://troostcoffeeandtea.com/https://malindoak.co.id/