వివేకా హత్య వెనక నిజం లో, అబద్దముందా ?
అనే ఎపిసోడ్ తో నా “నిజం” ఛానల్ ప్రారంభం 25 th 4 pm
“నేను ప్రారంభించబోయే ” నిజం” ఛానల్ ముఖ్య ఉద్దేశం అబద్ధాల బట్టలూడదీయడానికి.. ఆ బట్టలూడదీసి విసిరి పారేస్తేనే , నిజం యొక్క పూర్తి నగ్న స్వరూపం బయటపడుతుంది.
అబద్ధం బతికేదే నిజాన్ని చంపటం కోసం ప్రయత్నించటానికి .. నిజాన్ని ఎవ్వరూ చంపలేరు.
కానీ నిజం అప్పుడప్పుడూ చచ్చిపోయినట్టు నటిస్తుంది. .. దానికి మోసపోయి, చచ్చింది అని అబద్ధాలు చెప్పే వాళ్ళు సంబరంతో నాట్యమాడుతుండగా ఏదో ఒక రోజు వెనక నుంచి ముందు పోటు పొడుస్తుంది.
నిజాన్ని ఛేదించడానికి ఒకే ఒక్క సాధనం లాజికల్ థింకింగ్ .. అనాలిసిస్ ద్వారా , టెక్నాలజీ ద్వారా, పరిస్థితుల ద్వారా అన్నింటికన్నా ముఖ్యంగా మోటివ్ మీద కాన్సంట్రేట్ చేయడం ద్వారా నిజాన్ని అబద్ధం నుంచి కాపాడవచ్చు.
“నిజం” ఛానల్ లో కేవలం పొలిటికల్ కాంట్రవర్సీస్ మాత్రమే కాకుండా కొన్ని కరెంట్ సిట్యుయేషన్స్, సైన్స్, హిస్టరీ, ఆర్టిీషియల్ ఇంటెలిజెన్స్, సెక్స్ , ఫిలాసఫీ, పోలీస్, క్రైం, న్యాయ స్థానాలు ఇంకా ఎన్నెన్నో టాపిక్స్ ఉంటాయి.
వాటి గురించి ప్రతి ఎపిసోడ్ లో ,నేనే కాకుండా రకరకాల ఎక్స్పర్ట్స్, థింకర్స్ , రీసెర్చర్స్ వేరే వేరే టాపిక్స్ ని అనలైజ్ చేస్తారు.
కొన్ని సార్లు నేను వాళ్ళతో , కొన్ని సార్లు స్వప్న వాళ్ళతో, కొన్ని సార్లు వాళ్ళే వాళ్ళతో , కొన్ని సార్లు వేరే వాళ్ళు ఎవరెవరితోనో , అలా నిజాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికీ ఈ నిజం ఛానల్ గొడుగు కింద వాళ్లకే కేటాయించిన ఒక ప్రత్యేక చోటుంటుంది.
” నిజం ” ఛానల్ లోని మొదటి ఎపిసోడ్ ” వివేకా హత్య వెనక నిజంలో అబద్ధముందా ? “
వివేకా మర్డర్ వెనక నిజంలోని అబద్ధాలు , ఆ అబద్ధాలు చెప్పే వాళ్ళ వెనక ఉన్న నిజాలు, ఆ నిజాల వెనక వేరే వాళ్ళు ప్రభోధిస్తున్న అబద్ధపు నిజాలు, ఇంకా వాళ్ళ పైవాళ్లు బలవంతంగా అందరి నెత్తి మీద రుద్దుతున్న నిజమైన అబద్ధాలు ,వాటన్నింటి వెనుక అసలు నిజాలన్నింటినీ కూడా తవ్వి తీయడమే “నిజం” ఛానల్ ముఖ్య ఉద్దేశం.
వివేకా హత్య వెనక నిజం లో అబద్దముందా ?అనే ఎపిసోడ్ రిలీజ్ 25 న సాయంత్రం 4 గంటలకు.
ఇట్లు ” నిజం ” గా
రామ్ గోపాల్ వర్మ