కృతజ్ఞతలు తెలిపిన బీద, కృష్ణయ్య, నిరంజన్
అమరావతి, జూన్ 3: రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు బీద మస్తాన్రావు, ఆర్. కృష్ణయ్య, ఎస్. నిరంజన్ రెడ్డి శుక్రవారం అమరావతిలో సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో వారు కొద్దిసేపు భేటీ అయ్యారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నుంచి డిక్లరేషన్ తీసుకున్న అనంతరం ముఖ్యమంత్రిని కలిసి వారు కృతజ్ఞతలు తెలిపారు.
సీఎంను కలిసిన రాజ్యసభ సభ్యులు
Date: