25మంది మంత్రుల ప్రమాణ స్వీకారం
రెండుపదాలు పలుకలేక బొత్స తడబాటు
జగన్‌కు గుడివాడ సాష్టాంగ నమస్కారం
ఆంగ్లంలో ముగ్గురి ప్రమాణం
అమరావతి, ఏప్రిల్ 11: ఆంధ్ర ప్రదేశ్‌లో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. 25 మంది మంత్రులచేత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఇంటిపేరు వరుసలో మంత్రులతో పదవీ స్వీకారం చేశారు.
అంబటి రాంబాబు స్పష్టమైన ఉచ్చారణతో ప్రమాణం చేశారు. అమ్జాద్ బాషా అల్లా సాక్షిగా ప్రమాణం చదివారు. ఆదిమూలపు సురేష్ ఇంగ్లీషులో ప్రమాణం చేశారు. బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారంలో రెండుసార్లు తడబడ్డారు. సార్వభౌమాధికారం, అంతఃకరణ శుద్ధి అని పలకలేకపోయారు. దాడిశెట్టి దైవసాక్షిగా అంటూ ప్రమాణం చేశారు. ఆయన సంతకం చేయకుండానే జగన్ వద్దకు వెడుతుంటే వెనక్కి పిలిచారు. గుడివాడ అమర్నాథ్ వేదికపై జగన్‌కు ఇంచుమించు సాష్టాంగ నమస్కారం చేశారు. గుమ్మనూరు జయరాం కర్తవ్యం అనే పదాన్ని పలుకలేక తడబడ్డారు. జోగి రమేష్ సీరియస్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. బహిరంగ సభలోప్రసంగం మాదిరిగా ఆయన ప్రమాణం సాగింది. జోగి రమేష్ మోకాళ్ళపై కూర్చుని జగన్‌కు నమస్కరించారు. స్పష్టమైన ఉచ్చారణతో అంబటి తరవాత సుస్పష్టంగా ప్రమాణ స్వీకారం చేశారు. శాసనం ద్వారా నిర్మాణమైన అనడానికి బదులు నిర్మాతమైన అని పలికారు. సీఎం జగన్‌కు చేతులు పట్టుకుని నమస్కరించారు. కె. నారాయణ స్వామి సీఎం కాళ్ళను పట్టుకుని నమస్కరించారు. చందనం పట్టుచీర కట్టుకుని వచ్చిన ఉష శ్రీచరణ్ ఇంగ్లీషులో ప్రమాణం చేశారు. జగన్ పాదాలకు నమస్కరించారు. మేరుగ నాగార్జున సీఎం పాదాలకు నమస్కరించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంగ్లీషులో ప్రమాణం చేశారు. పినిపే విశ్వరూప్ కర్తవ్యాలను పలికే సందర్బంలో తడబాటుకు లోనయ్యారు. సీఎం జగన్ పాదాలకు రోజా నమస్కారం చేశారు. సీదిరి అప్పలరాజు సూటు ధరించి ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ప్రమాణంలో మొదటి భాగాన్ని ఆంగ్లంలోనూ, రెండోభాగాన్ని తెలుగులోనూ ప్రమాణం చేశారు. తానేటి వనిత జగన్ కాళ్ళకు నమస్కరించారు. విడదల రజనీ కూడా సీఎం కాళ్ళకు నమస్కరించారు. ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు వీరే.
1) అంబటి రాంబాబు
2) అమ్జాద్ బాషా
3) ఆదిమూలపు సురేష్
4) బొత్స సత్యనారాయణ
5) బూడి ముత్యాల నాయుడు
6) బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
7) చెల్లుబోయిన వేణుగోపాల్ నాయుడు
8) దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)
9) ధర్మాన ప్రసాదరావు
10) గుడివాడ అమర్నాథ్
11) గుమ్మనూరు జయరాం
12) జోగి రమేష్
13) కాకాణి గోవర్ధన రెడ్డి
14) కారుమూరి వెంకట నాగేశ్వరరావు
15) కొట్టు సత్యనారాయణ
16) కె. నారాయణ స్వామి
17) శ్రీమతి కె.వి. ఉష శ్రీచరణ్
18) మేరుగ నాగార్జున
19) డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
20) పినిపే విశ్వరూప్
21) పీడిక రాజన్న దొర
22) ఆర్.కె. రోజా
23) సీదిరి అప్పలరాజు
24) తానేటి వనిత
25) విడదల రజని
ఏపీలో కొలువుదీరిన కొత్త క్యాబినెట్
Date: